
న్యూ ఇయర్‌లో ఎవరు గ్రేట్? అప్పుడే ఎలా చెప్తాం? రెండు రోజులే కదా అయింది! రెండు రోజులే కావచ్చు. అయినా ఎవరు గ్రేటో చెప్పొచ్చు. పళ్లు నూరడం మానేస్తే ట్రంప్ గ్రేట్. ట్రంప్ వైపు చూసి వెక్కిరించకపోతే కిమ్ గ్రేట్. రెండు వేల నోటును రద్దు చేయకపోతే మోదీ గ్రేట్. రాహుల్‌గాంధీ తన సీరియస్‌నెస్‌ని కంటిన్యూ చేస్తే గ్రేట్. మాట మీద నిలబడి పార్టీ పేరు అనౌన్స్ చేస్తే రజనీకాంత్ గ్రేట్. పెళ్లయ్యాక కూడా సిక్స్‌లు, ఫోర్‌లు కొడితే విరాట్ కోహ్లీ గ్రేట్. ప్రభాస్, అనుష్క కలసి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తే.. వాళ్లిద్దరూ గ్రేట్. అయినా.. న్యూ ఇయర్ వచ్చి వన్ వీక్ కూడా గడవందే.. ఇలాంటి గ్రేట్‌లన్నీ ఎలా సాధ్యం? జరిగేవి ఉంటే చెప్పండి. ఉన్నాయి. న్యూ ఇయర్ రిజల్యూషన్‌కి జనవరి ఫస్ట్‌న రోజురోజంతా కట్టుబడి ఉన్నవారు గ్రేట్.
రెండో రోజూ కట్టుబడి ఉంటే ఇంకా గ్రేట్. ఇస్తారా? వాళ్లకైదేనా అవార్డును ఇస్తారా? అకాడమీలు ఇస్తాయా? గవర్నమెంట్ ఇస్తుందా? ఏ గుర్తింపూ లేకుండా ఎవరైనా న్యూ ఇయర్ తీర్మానాలు ఎందుకు తీసుకోవాలి చెప్పండి? తీసుకున్నా ఎందుకు వాటిపై నిలబడాలి చెప్పండి? అందుకే.. రెండు రోజులైనా సరే.. రిజల్యూషన్‌ని పంటిబిగువున పెట్టుకుని జీవితాన్ని లాగించినవాళ్లకు అవార్డు ఇవ్వాలి. వాళ్లచేత కార్పొరేట్ ఆఫీస్‌లలో ఉద్యోగులకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చెప్పించాలి.