విద్యుత్ సమస్యపై తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం ఆమోదించింది.
హైదరాబాద్: విద్యుత్ సమస్యపై తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం ఆమోదించింది. విభజన చట్ట ప్రకారం తమకు రావాల్సిన 53.89 శాతం విద్యుత్ వాటాను ఇప్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయపరంగా తమకు రావాల్సిన విద్యుత్ ఇప్పించే బాధ్యత కేంద్రం తీసుకోవాలని తీర్మానంలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. 24 గంటల విద్యుత్ పథకంలో తమ రాష్ట్రాన్ని చేర్చాలని విజ్ఞప్తి చేసింది.
తీర్మానంలో ఏపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించడంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొండివైఖరి అనే పదం తీసివేయాలని, విభజన చట్టాన్ని ఉల్లంఘించారని తీర్మానంలో పెట్టాలని జానారెడ్డి సూచించడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారు. తర్వాత తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.