తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తాం: రేవంత్ | ready to co-operate telangana government, says revanth reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తాం: రేవంత్

Published Mon, Nov 10 2014 4:25 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తాం: రేవంత్ - Sakshi

తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తాం: రేవంత్

హైదరాబాద్: తెలంగాణ హక్కులను కాపాడడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి- శాసనసభలో చెప్పారు.  విద్యుత్ సమస్యపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు మాని సమస్యలపై చర్చించుకుందామని సూచించారు.

చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే సమస్యలు పరిష్కారం కాదన్నారు. తాము బేషజాలకు వెళ్లబోమని అన్నారు. ఏ రాష్ట్ర నాయకులు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ సమస్య పరిష్కారానికి తామంతా ప్రభుత్వం వెంట ఉంటామన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం తలెత్తితే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిపై ఉందన్నారు. కేంద్రం సమస్య పరిష్కరించకపోతే న్యాయస్థానాలున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement