సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమ ర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ కోతలు లేవుని, 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ను తమ ప్రభుత్వం సరాఫరా చేస్తుందని చెప్పారు. అలా చెప్పి 24 గంటలు కూడా కాకముందే ప్రజలు కరెంట్ కోసం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు.
CM Revanth says NO power cuts & 24 Hour uninterrupted, quality power is being supplied
Why are these people protesting at Substation ? https://t.co/xlAK3PDFcA— KTR (@KTRBRS) June 3, 2024
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రాత్రి కరెంట్ లేక సబ్ స్టేషన్ ముందు ప్రజలు ధర్నాలు చేశారని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment