ఎన్నికల కమిషన్‌కు స్పష్టత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ‘బీసీ-జనరల్’ అభ్యర్థికే దక్కనుంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అప్పటి ప్రభుత్వం 2014 మార్చి 1న జీవో నెం.94 జారీ చేసింది. అప్పట్లో జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని ‘బీసీ-జనరల్’గా రిజర్వు చేశారని... ఆ ఉత్తర్వుల ప్రకారమే జీహెచ్‌ఎంసీ మేయర్ పదవికి పరోక్ష ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసింది.
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీసీలకే
Published Thu, Jan 21 2016 5:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement