
కోల్‌కత్తా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభ దానిని ఆమోదించింది. బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే అసెంబ్లీలో ద్వారా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా తీర్మానించిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. తొలుత కేరళ, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించాయి. అయితే.. ఇదే విషయంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. (‘పౌరసత్వ’ బిల్లుకు వ్యతిరేకం)
Comments
Please login to add a commentAdd a comment