కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్‌జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును పోలీసులు వచ్చే ఆదివారం లోపు పరిష్కరించకపోతే.. అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్( సీబీఐ)కి అప్పగిస్తామని అన్నారు. ఈ మేరకు ఈ ఘటనను పరిష్కరించాలని పోలీసులకు డెడ్‌లైన్ విధించారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు ఉంటే.. ఆదివారం లోపు అందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీసులు చేసే దర్యాప్తు వేగంగా లేకపోతే కూడా సీబీఐకి అప్పగిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment