కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితురాలికి న్యాయం చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. తన కూతురికి జరిగిన దారుణ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ల డాక్టర్లు తన బిడ్డలలాంటి వారని అన్నారు. సీఎం మమతా బెనర్జీ 2021లోనే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై చర్యలు తీసుకొని ఉంటే.. ఇవాళ తన కుమార్తె బతికే ఉండేదని అన్నారు.
‘‘ సీబీఐ తన పని తాను చేస్తోంది. సీబీఐ విచారణ గురించి నేను ఏం మాట్లాడలేను. ఈ హత్యతో సంబంధం ఉన్నవాళ్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన వారందరూ విచారణలో ఉన్నారు. తీవ్రమైన బాధతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారంతా నా పిల్లలలాంటి వారు, వారిని చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. నిందితులకు శిక్ష పడిన రోజు మనం విజయం సాధించినట్టు. 2021లో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడే సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమత బెనర్జీ చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు నా కూతురు బతికే ఉండేది’’ అని అన్నారు.
"My daughter would have been alive...": RG Kar Medical College victim's father#RGKarMedicalCollege #victimfather #RGKarMedicalCollegecase #kolkataincident #newsupdate #CareForElders #StopInjustice #राष्ट्रीय_बेरोजगार_दिवस #Iran pic.twitter.com/XovHWLcdTU
— The Savera Times (@thesavera) September 18, 2024
credits: The Savera Times
మరోవైపు.. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటు వేయాలన్న వైద్యుల డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అంగీకరించింది. అనంతరం కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డాక్టర్ల ప్రతినిధి బృందం మధ్య జరిగిన సమావేశం అనంతరం జూడాల డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు ఇంకా తమ సమ్మెను విరమించకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment