
తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ సభ్యుల పట్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభ అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు... ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు చేతపట్టి ....నిరసనకు దిగారు. ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే...ప్రత్యేక హోదాపై ప్రకటన చేయబోతుందని, దీనిపై చర్చ, తీర్మానం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత చర్చ ఉంటుందన్నారు. అయితే వెంటనే తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది.