♦ కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం
♦ కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల్ని పొందేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా: సీఎం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి గురువారం ఏకగ్రీవంగా తీర్మానిం చింది. 'హోదా'అంశంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని, పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరచిన అన్నిఅంశాల్నీ అమలుచేయాలని, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర పారిశ్రామిక , ఆర్థికాభివృద్ధికోసం పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీకి నిధు ల విడుదల, 13వ షెడ్యూల్‌లోని విద్యాసంస్థల స్థాపన, మౌలిక వసతుల కల్పన, సెక్షన్-8 అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సహా అన్ని హామీల్నీ అమ లు చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం ప్రతి పాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిం చినట్టు మండలి చైర్మన్ చక్రపాణి ప్రకటించారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు: సీఎం
అంతకుముందు జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ.. ప్రత్యేకహోదా రాద ని అధైర్యపడి ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని, ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆయన ఆరోపించారు.
అఖిలపక్ష భేటీ అవసరం: ఉమ్మారెడ్డి
అంతకుముందు చర్చలో వైఎస్సార్‌సీపీ మం డలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ.. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయన్న సంకేతాలిస్తేనే కేంద్రంనుంచి మన డిమాండ్‌ను సునాయాసంగా సాధించడానికి వీలుంటుందన్నారు. అందుకోసం ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా మాత్రమే కావాలని... ప్యాకేజీ వద్దనే సెంటిమెంట్ ప్రజల్లో నాటుకుపోయిందని గుర్తుచేస్తూ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా సీఎం చంద్రబాబు.. ప్రధానమంత్రి మోదీని ఏమి అడిగారనే విషయం ఇప్పటికీ బయటకు రావట్లేదన్నారు. సీపీఐ సభ్యుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం చేసిన తీర్మానాలు... తీర్మానాల మాదిరిగాక అభ్యర్థన కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా ఉందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక 'హోదా'కల్పించాలి
Published Fri, Sep 4 2015 3:33 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement