ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా | AP Assembly Session 2023 Live Updates | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా

Published Thu, Sep 21 2023 8:43 AM | Last Updated on Thu, Sep 21 2023 1:17 PM

AP Assembly Session 2023 Live Updates - Sakshi

Updates..

01:10PM
►ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా

►రెండోసారి మండలి వాయిదా
►మండలి చైర్మన్‌ పోడియం వద్ద టీడీపీ నేతల రౌడీయిజం
►ఫ్లకార్డులతో టీడీపీ సభ్యుల నినాదాలు
►ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేస్తున్న టీడీపీ సభ్యులు
►సభా మర్యాద పాటించాలని కోరిన చైర్మన్‌
►చైర్మన్‌ విజ్ఞప్తి చేసినా తీరు మార్చుకోని టీడీపీ
► టీడీపీ సభ్యుల ఆందోళనతో రెండోసారి మండలిని వాయిదా వేసిన చైర్మన్‌

ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
►స్పీకర్‌ పట్ల టీడీపీ నేతలు అమర్యాదగా వ్యవహరించారు
►బాబును ఎందుకు అరెస్ట్‌ చేశారో తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
►టీడీపీ నేతలు మాత్రం చర్చ అంటే పారిపోతున్నారు
►బాబు తప్పు చేయలేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు
►కచ్చితంగా చంద్రబాబు అవినీతిపై చర్చిస్తాం
►వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం


ప్రభుత్వ విప్‌ కోరుముట్ల శ్రీనివాసులు
►బాబు అవినీతిపై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ నేతలు భయపడుతున్నారు
►దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రండి
►బాబు తప్పు చేసింది వాస్తవం అవునా.. కాదా?
►ఎక్కడ దొరికిపోతామోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు
►టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ విచారణ కోరలేకపోతున్నారు

12:23PM
►విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

► బీఏసీ సమావేశం ముగిసింది. 
►ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. 

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి ఆర్‌కే రోజా..
►బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య మీసాలు మెలేస్తున్నాడు
►సభాపతి పై టీడీపీ నేతలు ఫైల్స్ బాటిల్స్ విసిరి నానా హంగామా
►సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది
►బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు
►హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా బాలకృష్ణ మాట్లాడాడా?
 ►చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ.
►తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చాడు. 
►చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటికి తీస్తాం.
►దమ్ముధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి.
►ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం

11:22AM

ఏపీ అసెంబ్లీ వాయిదా

11:10AM
►అసెంబ్లీలో  మారని టీడీపీ సభ్యుల తీరు
►మళ్లీ స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
► టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం
► సభా నియమాలను పాటించాలని స్పీకర్‌ విజ్ఞప్తి
► స్పీకర్‌ విజ్ఞప్తిని పట్టించుకోని టీడీపీ సభ్యులు
►ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌లు సస్పెన్షన్‌
► ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ శ్రీధర్‌రెడ్డి, అనగాని, పయ్యావుల  సస్పెన్షన్‌
►మిగిలిన టీడీపీ సభ్యులందరూ ఒక్కరోజు సస్పెన్షన్‌
► టీడీపీ సభ్యులతో పాటు ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్‌

11:07AM
బాలకృష్ణకు స్పీకర్‌ తమ్మినేని హెచ్చరిక
►మీసాలు తిప్పడం వంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకూడదు
►బాలకృష్ణ మొదటి తప్పిదంగా భావించి హెచ్చరిస్తున్నాం
►సభలో టీడీపీ సభ్యుల తీరు సరైనది కాదు

11:05AM
►వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ

10:16AM
►ఏపీ శాసనమండలి వాయిదా
►టీడీపీ, పీడీఎఫ్‌ సభ్యుల ఆందోళనలతో  వాయిదా వేసిన చైర్మన్‌
►ఐదు నిమిషాల పాటు మండలి వాయిదా

10:00AM
ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం

►శాసనమండలిలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు

►మండలిలోనూ ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు

►చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం తిరస్కరణ

►చైర్మన్‌ సర్దిచెప్పినా వినకుండా టీడీపీ సభ్యుల నినాదాలు

►ఏ అంశంపైనైనా చర్చించడానికి సిద్ధం:  మంత్రి బొత్స

9:32AM
►ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రౌడీయిజం
►స్పీకర్‌ పోడియంపైకి ఫైళ్లు విసిరేసిన టీడీపీ సభ్యులు
►స్పీకర్‌ పోడియాన్ని చుట్టిముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
► స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి టీడీపీ సభ్యులు ఓవరాక్షన్‌. 
►అసెంబ్లీ వాయిదా. 

9:23AM
►టీడీపీ సభ్యుల తీరుతో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం: మంత్రి అంబటి
►టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా: మంత్రి అంబటి
►టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారు: మంత్రి అంబటి
►టీడీపీ సభ్యులు అవాంఛనీయ సంఘటనలను ఆహ్వానిస్తున్నారు
►బ​​​​​​స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదు
►టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు
►టీడీపీ సభ్యులు.. వైఎస్సార్‌సీపీ సభ్యలను రెచ్చగొడుతున్నారు
►బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారు: మంత్రి అంబటి

బాలకృష్ణ తీరుపై సభలో రభస

సభలో మీసాలు తిప్పిన బాలకృష్ణ

9:20AM

►టీడీపీ అర్థం లేని నోటీసులు ఇస్తున్నారు: మంత్రి బుగ్గన
►చంద్రబాబు అరెస్టుపై చర్చకు సిద్ధం: మంత్రి బుగ్గన
►బీఏసీలో దీనిపై చర్చిద్దాం..  చర్చకు రండి: మంత్రి బుగ్గన

9:18AM

►ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు
►స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు

9:10AM
►టీడీపీ ఆందోళనల మధ్య కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
►స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యుల ఆందోళన

9:05AM
►ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు

►చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వాయిదా తీర్మానం

9:00AM

►ఏపీ అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.00 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ శానససభ సమావేశాలు ప్రారంభం కాగా,. మండలి సమావేశాలు 10.00 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి.  ఆ తర్వాత శాసన సభా వ్యవహారాలు సలహా కమిటీ సమావేశం కానుంది. 

►సభ ఎన్ని రోజుల నిర్వహించాలనే దానిపై ఈ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. దాంతో పాటు ఏ అంశాలపై చర్చించాలనే దానిపై కూడా అజెండా ఖరారు చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. 

పటిష్ట బందోబస్తు ఏర్పాటు
►సమావేశాలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

►పటిష్టమైన పోలీస్, మార్షల్‌ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, శాసన సభా స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధికారులను ఆదేశాలు.

అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లనున్న టీడీఎల్పీ సభ్యులు 

►వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీఎల్పీ సభ్యులు.. టీడీఎల్పీ సభ్యుల పాదయాత్ర
►సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర
►తెదేపా నిరసనల్లో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి
►కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement