'గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట జరిగిన రేవు, తాను స్నానం చేసిన రేవు వేర్వేరని సీఎం అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యంవల్ల ఆయన జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా? లేక మానసిక పరిస్థితిలో తేడా వచ్చిందా? ఈ రెండూ కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా?' అని చంద్రబాబునాయుడుని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల రేవులో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.