టెక్సాస్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్ధంతి(సెప్టెంబర్ 2) సందర్భంగా టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. వైఎస్సార్ గొప్ప మానవతావాది అని, ఆయన పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సెప్టెంబర్ 2ను తలచుకుంటే చాలా బాధ కలుగుతుందని, పదేళ్ల క్రితం ఆరోజు 10కోట్ల మంది హృదయాలు తల్లడిల్లిపోయాయన్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని కుల, మతాలకు అతీతంగా ప్రజలు పూజలు చేశారని గుర్తుచేశారు. ఏ నాయకుడికి ప్రజల్లో ఇంతటి స్థానం దక్కలేదన్నారు. వైఎస్సార్ మీద చూపిన అభిమానాన్నే ఈ రోజు ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద చూపుతున్నారని, వారి నమ్మకాన్ని సీఎం జగన్ తప్పకుండా నిలబెడతారని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి వైస్సార్ అభిమానులు సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, రవి బల్లాడ, ప్రవర్ధన్ చిమ్ముల, సాచి ముట్లూరు, మల్లికార్జున రెడ్డి ఆవుల,వెంకట శివ దుర్భకుల, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి, అనురాగ్ , బాలాజి బొమ్ము, విట్టల్ రెడ్డి, శివ శంకర్ వంకదారు, మళ్ళా రెడ్డి, వెంకట రెడ్డి , భాను ప్రకాష్ , వినోద్, రాజేందర్, యస్వంత్ రెడ్డి గట్టికొప్పుల, ఇంకా మరెంతోమంది హాజరయి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment