ఆస్టిన్ లో ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి!
ఆస్టిన్ లో ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి!
Published Wed, Sep 4 2013 11:17 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాలుగవ వర్ధంతిని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో వైఎస్సార్ అభిమానులు హోటల్ కడాయిలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.
ఈ సందర్భముగా మాట్లాడుతూ ఆస్టిన్ లోని వైఎస్సార్ అభిమానులు వైఎస్ఆర్ లేని లోటు, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే అత్యున్నత నేతగా రాజశేఖర్ రెడ్డిగా అవతరించారన్నారు. రాష్ట్రంలోని పేద, బడుగు, మైనారిటీల అభ్యున్నతికి వైఎస్ఆర్ కృషి చేశారని పలువురు ఎన్నారైలు అన్నారు. ప్రస్తుతం మహానేత లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని, అన్ని రంగాల్లో అభివృధి కుంటుపడిందనే బాధను వ్యక్తం చేసారు. పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం పథకాలను రాష్ట్రంలో ప్రారంభించిన గొప్ప నేతగా అభివర్ణించారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, జనంలోఉంటే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోవడం అసాధ్యమని భావించి నిరాధారమైన ఆరోపణలతో, కుట్రలు కుతంత్రాలతో అరెస్టుచేశారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు చీకటి ఒప్పందానికి వచ్చి వైఎస్ జగన్ ను అక్రమంగా జైలుకు పంపించాయన్నారు.
జననేత జగన్ అక్రమ అరెస్ట్ పై అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు అవలంభిస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ఎన్నారైలు తీవ్రంగా ఖండిచారు. ప్రజాబలం ఉన్న నాయకుడిని ధైర్యంగా ఎదుర్కోలేక జైలులో పెట్టి ఎన్నికలో గెలవాలి అని అటు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్నాయని విమర్శించారు. సిబిఐ ఆధికార కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలలో పనిచేస్తూ జగన్ పై దర్యాప్తుని కాలయాపన తో విచారణ కొనసాగిస్తొందన్నారు. ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భంధించి తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు.
ఈకార్యక్రమమునకు ప్రవాసాంధ్ర ప్రముఖులు సుబ్బా రెడ్డి చింతగుంట, నారాయణ రెడ్డి గండ్ర, రవి బల్లాడ , మురళి బండపల్లి, ప్రవర్థాన్ చిమ్ముల, రఘు సిద్దపు రెడ్డి , అగ్గిరామయ్య దేవరపల్లి, వెంకటేష్ బాగేపల్లి , వెంకట్ యీరగుడి , శ్రీని చింత, వెంకట్ గోతం, రామహనుమంత రెడ్డి, కొండా రెడ్డి ద్వారసాల , వెంకట్ నామాల, ప్రదీప్ రెడ్డి చౌటి, సాచి ముట్టూరు, సుధాకర రెడ్డి చౌటి, చంద్రా రెడ్డి అనుమరెడ్డి, భరత్ రెడ్డి ,నాగమణి , లీలవతమ్మ, సరిత, సంపూర్ణ , ప్రశాంతి, శైలజ, సంధ్య, చరిత, శ్వేత గార్లు పాల్గొన్నారు. టెలికాన్ఫరెన్స్ కాల్ ద్వారా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు రాజమోహన్ రెడ్డి ఆస్టిన్ వైఎస్సార్ అభిమానులతో సంభాషించారు.
Advertisement
Advertisement