
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలోని రాజాశేఖరరెడ్డి విగ్రహాంతో పాటు కొవ్వూరు పట్టణంలోని ఆయన విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడమే కాకుండా వృద్ధులకు పండ్లు,రొట్టెలు పంచారు. అలాగే టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ హయాంలో చాలా మంది ముఖ్యమంత్రులు పని చేశారన్నారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం పని చేసినట్లుగా ఏ సీఎం కూడా చేయలేదన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని, తండ్రిలాగే పేదల పక్షపాతిగా ఆయన పని చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment