సాక్షి, పశ్చిమగోదావరి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఏడాది పాలనలోనే మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారని కొనియాడారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నపటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా సున్నా వడ్డీ పథకంతో పాటు అమ్మ ఒడి పథకాలు ప్రారంభించారని తెలిపారు.
కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం ఇవ్వడంతోపాటు దళిత మహిళని హోంమంత్రిని చేశారని తానేటి వనిత అన్నారు. నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం మహిళలకు కేటాయించి మహిళాపక్ష ప్రభుత్వంగా నిరుపించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు ధైర్యంగా తిరిగేందుకు.. వారికి భద్రత కల్పిస్తూ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దిశ పోలీస్ స్టేషన్లను నిర్మించారని చెప్పారు. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన దశలవారీ మధ్యపాన నిషేధం అమలు చేసి.. బెల్టు షాపులు పూర్తిగా నిషేదించడంతోపాటు.. షాపుల సంఖ్య తగ్గించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment