YS Jagan One Year Rule
-
ఆంధ్రప్రదేశ్ లో రైతురాజ్య స్థాపనకు వడివడి గా అడుగులు
-
టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదం
-
టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదం
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఉరిశిక్ష వేసిన సంగతి టీడీపీ గుర్తుంచుకోవాలని చురకలు అటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చారని ప్రశంసించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని చెప్పారు. సామాజిక పెట్టుబడి అవశ్యకతను సీఎం జగన్ గుర్తించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. -
జనరంజకం... జగన్మోహనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్ని కలలు కన్నారో, ఎంతటి మంచి చేయాలని తపన పడుతున్నారో, ప్రజల పట్ల ఆయనకి ఎంతటి వాత్సల్యం ఉందో, నిత్యం ఆయన చేస్తున్న పనులే మనకి తెలియజేస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపుగా 4 లక్షల మందికి ఉద్యోగాలనీ కల్పిం చారు. జాతీయస్థాయిలో సైతం నాలుగు నెలల కాలంలో ఇన్ని ‘ఉద్యోగాల కల్పన’ జరగనేలేదు. ‘అమ్మ ఒడి’ అనే కార్యక్రమం ఎంతటి అద్భుతమైన కార్యక్రమం! పేదింటి బిడ్డ పనిలోనికి కాకుండా బడిలోకి వెళ్ళటానికి ఇంతకంటే ప్రేరణ కలిగించే వ్యవస్థ ఇంకొకటి వుంటుందా? ఏకకాలంలో అక్షరాస్యత రేటునూ, కుటుంబ స్థాయినీ పెంచే మంచి కార్యక్రమం ఇది. ‘కంటి వెలుగు’ అనే కార్యక్రమంతో ప్రతి విద్యార్థికీ కంటి పరీక్షలు జరిపి, కళ్ళద్దాలూ, అవసరమైతే శస్త్ర చికిత్సలూ చేయటమనే ఇలాంటి సంక్షేమ చర్యల గురించి గతంలో ఎప్పుడైనా విన్నామా..? గోడలు కూలిపోయి, మూత్రశాలలు కరువై, అవసరమైతే ఇంటికే తప్ప వేరెక్కడికీ వెళ్ళలేని దుస్థితినుండి స్కూళ్ళను విముక్తి చేయాలని కనీసం ఒక్కసారైనా ఆలోచిం చామా.. నో బ్యాగ్ డే, నాడునేడు, ఉచిత యూనిఫాం, టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, షూలూ, సాక్సులూ, నిరంతర పౌష్టికా హారం ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే వసతిదీవెన, విద్యాదీవెన పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ వాటితో సహా ఎన్నో... ఎన్నెన్నో! ప్రజలను నిండు మనస్సుతో ప్రేమిస్తే తప్ప ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన జరగనే జరగదు. పదేళ్లలో చేయగలిగినన్ని పనులు కేవలం ఏడాదిలోపే చేయటమంటే మాటలు కాదు. ఇంటింటికీ రేషన్ సరఫరా, అవ్వాతాతలకు పింఛన్ అందజేత.. ఇలాంటి వినూత్న కార్యక్రమాలను చూసే అదృష్టం ప్రజలకి దక్కింది. రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు రెండువేల కోట్లు ఆదా చేయటం విషయంలో గానీ, ఇసుక విధానం ద్వారా కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి జమ చేయటంలో గానీ, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి, బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనటం ద్వారా మిగులుస్తున్న కోట్ల రూపాయలు గానీ మంచి చర్యలు కావని అనగలమా..? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వ రంగంలోనికి తీసుకురావటం గానీ, వందలాది ఉద్యోగాలను భర్తీ చేయటం గానీ, పోలీసులకు వారాంతపు సెలవును ఏర్పాటు చేయటం గానీ, సెలూన్లకు, నేతన్నలకూ, ఆటోడ్రైవర్లకూ, పూజారులకూ నగదు సహాయం అందించటం గానీ ప్రజోపయోగ కార్యక్రమాలు కాదని చెప్పగలమా? రైతుల సంక్షేమానికై రైతు భరోసా, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం, పంటనష్టం, ఉచిత విద్యుత్తు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే విత్తన పంపిణీ, ఎగుమతులను ప్రోత్సహించటం, ప్రభుత్వమే ఆహార ధాన్యాలను కొనుగోలు చేయటం ఇలాంటి లెక్కలేనన్ని కార్యక్రమాలు శరవేగంగా రూపుదిద్దుకుని ఒకప్పుడు ‘దండగ’ని పేరుబడ్డ వ్యవసాయాన్ని ‘పండగ’గా మారుస్తున్నాయి. జగన్ అంటే జనం. జగన్ అంటే నమ్మకం. జగన్ అంటే మానవత్వం. గ్యాస్ ప్రమాదం రూపంలో ఓ సంక్షోభం లాంటి ఉపద్రవం సంభవిస్తే, రాజకీయ పక్షాల డిమాండ్లను మించి, మరణించినవారికి, దేశంలో ఎక్కడాలేని విధంగా కోటి రూపాయలు ఇవ్వటంలో గాని, ప్రజలను సంరక్షించటంలో గానీ, ప్రాణాల్ని కాపాడటంలో గానీ, వివిధ రకాలుగా ప్రజలకు భరోసా కల్పించడంలో గానీ, సహాయపడడంలోగానీ, గంటల వ్యవధిలోనే ‘ప్రమాదం’ తర్వాతి పరిస్థితుల నుండి, ప్రజలను ‘ప్రమోదం’ వైపు నడిపించడంలో గానీ, వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు బాధితులు, విమర్శకుల ప్రశంసలనందుకొంది. ‘కరోనా’ విపత్కర సమయంలో దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టిని నిలిపిందంటే అందుకు కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పక తప్పదు. ‘కరోనాతో భవిష్యత్తులో కూడా కలిసి జీవించక తప్పదు, ఇది ఒక రోజుతోనో, నెలతోనో సమసిసోయే సమస్య కానే కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. కేసులు వస్తుంటాయి. ట్రీట్ చేస్తుంటాం. మరలా వస్తుంటాయి.మరలా మరలా ట్రీట్ చేస్తుంటాం..’ అని ముందుచూపుతో చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే.. దేశం మొత్తం మీద అత్యధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించటంలో గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి మూడేసి చొప్పున మాస్కులు పంచే విషయంలో గానీ, వలస కార్మికులను ఆదుకోవడంలో గానీ, వైఎస్ జగన్ దార్శనికత, దక్షతలు ప్రస్ఫుటమవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఇంకా చెప్పాలంటే జాతీయస్థాయిలో సైతం ఎన్నడూ జరగని విధంగా పాతిక లక్షలకు పైగా ఇళ్ళను తొలి ఏడాది లోనే, ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని సంకల్పించటం, రత్నాల్లాంటి ‘నవరత్నాలు’ అనే తొమ్మిది సంక్షేమ పథకాలను, ఐదేళ్ళలో కాకుండా కేవలం ఐదు నెలల కాలంలోనే దాదాపుగా నెరవేర్చటం వైఎస్ జగన్‌కి మాత్రమే చెల్లింది. ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్ర విద్యార్థులు అద్భుతాలు సాధించాలంటే, ఈ రాష్ట్ర రైతులు ఆత్మనిబ్బరంతో మెలగాలంటే చెయ్యాల్సింది చాలా సులువైన పని. అది వైఎస్ జగన్‌ని మళ్ళీ మళ్ళీ గెలి పించుకోవటం మాత్రమే. ఇంతకన్నా ప్రజలను మనసారా ప్రేమించే ముఖ్యమంత్రి మరెవ్వరూ ఉండరు. గుప్తులనాటి స్వర్ణయుగం కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో ‘వజ్రయుగం’ రావాలంటే ఎప్పటికీ కావాల్సిందీ... రావాల్సిందీ జగన్..!(ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా) డా. ఎమ్.వి.జె. భువనేశ్వరరావు వ్యాసకర్త ప్రముఖ కథారచయిత, డిప్యూటీ జనరల్ మేనేజర్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొబైల్ : 85006 6950 -
అచ్చెన్నాయుడుకు కృపారాణి సవాల్
సాక్షి, టెక్కలి: ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని నిరూపించడానికి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సవాల్ విసిరారు. శనివారం ఆమె మాట్లాడుతూ కరోనా భయంతో హోమ్ క్వారంటైన్కే పరిమితమైన అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని జూమ్ యాప్‌లో రాజకీయ ఉనికి చాటుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా అందలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. పథకాల్లో అధికంగా టీడీపీ నాయకుల కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయని గుర్తు చేశారు. నిమ్మాడలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు పడలేదని, అదే గ్రామంలో అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన పథకాలు అందలేదని నిరూపించగలరా, దీనిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. సీఎంపై లేనిపోని విమర్శలు చేస్తే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్
-
వైఎస్ఆర్ రైతుభరోసా
-
చరిత్ర గతిని మార్చే పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో చరిత్ర గతిని మార్చే పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని మార్చి వేగవంతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ఆయన ఉపక్రమించారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కక్షణం కూడా వృథా చేయకుండా రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. జగన్ పాలన ఏడాది పూరై్తన సందర్భంగా విశాఖలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న వైఎస్సార్సీపీ మహిళా నేతలు ► ఈ ఏడాదిలో ఏం చేశాం, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని సీఎం జగన్ స్వయంగా వివిధ రంగాల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ► ఈ కార్యక్రమం ప్రజలను మభ్య పెట్టడానికో, అరచేతిలో వైకుంఠం చూపడానికో కాదు. తాను ఎంత శ్రద్ధగా పని చేశాననేది తెలుసుకోవడానికి. ► రాజన్న బిడ్డగా, వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వ నాయకుడిగా ప్రజలు అభిమానించారన్న విషయం వైఎస్ జగన్‌కు తెలుసు. అందుకే జగన్ మాట చెబితే దానిని తప్పడు అని పేరు తెచ్చుకున్నారు. ► ఎన్నికల మేనిఫెస్టోలోని 90 శాతానికి పైగా హామీలను సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేసి ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని వాటిని కూడా అమలు చేసిన ఘనత ఆయనదే. ► ఆరోగ్యకరమైన కుటుంబం, భావితరాలు చిరునవ్వులు, ఆటపాటలతో సంతోషంగా ఉండేలా వైఎస్ జగన్ పాలన ఉండబోతోంది. ప్రజల సుందర స్వప్నానికి ఈ ఏడాదిలో గట్టి పునాది వేశారు. చరిత్రగతిని మారుస్తున్న ఆయనతో ప్రయాణిస్తున్న మాకు, పార్టీ కార్యకర్తలకు ఎంతో గర్వంగా ఉంది. వైఎస్సార్‌కు నివాళి.. కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో ఏడాది పాలన వేడుకలకు పరిమిత సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. వేడుకల ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సజ్జల పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి పద్మజ, నారాయణమూర్తి, గుంటూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బసిరెడ్డి సిద్ధారెడ్డి, పార్టీ యువజన రాష్ట్ర నేత కావటి మనోహర్‌నాయుడు, బీసీ సెల్ నేత పద్మారావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: మీరు ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.. గతంలో మాదిరిగా విత్తనాల కోసం రాత్రింబగళ్లు పడిగాపులు లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే మా ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. గతంలో దళారులకిస్తే రెండు నెలల వరకూ డబ్బులిచ్చేవారు కాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఊర్లోనే సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు ఇస్తుండటం చాలా ఆనందంగా ఉంది. కౌలు రైతులకూ రైతు భరోసాను అందించారు. మీరు 90 శాతం హామీలను నెరవేర్చామని అంటున్నా ప్రజలు మాత్రం వంద శాతం చేసేశారని సంతృప్తిగా ఉన్నారు.. ఇవీ వివిధ జిల్లాల రైతుల అభిప్రాయాలు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నవరత్నాలంటే ఓట్లకోసమనుకున్నాం..! రెండెకరాల సొంత పొలంతో కలిపి పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. గతంలో నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు జరగలేదు. పాదయాత్రలో మీరు మాఊరు వచ్చినప్పుడు నవరత్నాల గురించి చెబితే ఓట్ల కోసం అందరూ అలాగే చెబుతారనుకున్నాం. రైతులకు ఎవరూ ఏమీ చేయరు, మన బతుకులు ఇలాగే ఉంటాయనుకున్నాం. మీరు సీఎం కాగానే రైతుభరోసా ద్వారా రూ.13,500 మా ఖాతాల్లో వేశారు. మీరిచ్చిన డబ్బులతో వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాం. కరోనా వల్ల వరి కోతకు కూలీలు దొరక్కపోతే మీ ఆదేశాలతో వ్యవసాయశాఖ కోతమిషన్లు ఏర్పాటు చేసింది. దీని వల్ల కూలీ ఖర్చులు తగ్గాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారంలోనే మా ఖాతాలో డబ్బులు జమ చేశారు. గతంలో దళారులకిస్తే రెండు నెలల వరకూ డబ్బులిచ్చేవారు కాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఊర్లోనే సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు ఇవ్వనుండటం బాగుంది. మాది శివారు గ్రామం. వైఎస్సార్ హయాంలో కాలువల్లో పూడిక తీశారు. మీరు మరోసారి ఆ సాయం చేస్తే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కొమ్మన వెంకటరమణ, కాకినాడ రూరల్, గంగనాపల్లి గ్రామం, తూర్పు గోదావరి సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పందిస్తూ వెంటనే రైతు కోరిన మేరకు ఆ ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 90 కాదు.. 100 శాతం! 90 శాతం హామీలు నెరవేర్చామని మీరంటున్నారు. కానీ జనమంతా వంద శాతం చేసేశారని అంటున్నారు. మహిళా సంఘాలకు జీరో వడ్డీ డబ్బులు జమ చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాతో పడిగాపులు కాసే బాధ తప్పింది. కరోనా సమయంలో మీరిచ్చిన బియ్యం, డబ్బులతో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇబ్బంది లేకుండా గడిపాం. స్కూళ్లు మూసేసిన తర్వాత కూడా అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నారు. మీరు తెచ్చిన అమ్మఒడి వల్ల ఎంతోమంది పేద తల్లులు పిల్లలను చదివించుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నారు. మ దగ్గర గుర్లలో 4 వేల ఎకరాలకు నీరందించే మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరుతున్నా. – చింతాడ అప్పలనర్సమ్మ, గుర్ల తమ్మిరాజుపేట, మెంటాడ, విజయనగరం రైతులకు మీ సేవ అంతా ఇంతా కాదు ఇంతకుముందు రాత్రిళ్లు భుజాన రగ్గు లేసుకుని, క్యారియర్‌లో అన్నం కట్టుకుని విత్తనాల కోసం పడిగాపులు కాసేవాళ్లం. విత్తనాలను దళారీలకు ఇచ్చిన తర్వాతే రైతులకిచ్చేవారు. ఇప్పుడు మా ఇంటికే వచ్చినయ్ సార్ విత్తనాలు. వేలిముద్ర వేసి లైన్లో నిలబడకుండానే వేరు శనక్కాయలు తీసుకున్నాం. ఒక్కసారి రైతులంతా ఎంత ఆనందంగా ఉన్నామో, సంతోషంగా ఉన్నామో చూడండి. మా రైతులకు మీరు చేసిన సేవ అంతా ఇంతా కాదు. రైతులందరి తరపున మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. రైతు భరోసా డబ్బులు కూడా నాకు అందాయి. గతేడాది వర్షాలు కూడా బాగా పడ్డాయి. ఇది మీ సంకల్పం సార్. – టి.వెంకప్ప, గంతిమర్రి, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం కౌలురైతుకూ భరోసా... నేను కౌలు రైతును. ఐదెకరాలు సాగు చేస్తున్నా. మాకు కూడా రైతుభరోసా డబ్బులిచ్చినందుకు ధన్యవాదాలు. మొక్కజొన్న బస్తా రేటు రూ.1,100 మాత్రమే ఉంటే మార్కెట్ యార్డుల్లో రూ.1,750 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం మూడు, నాలుగు నెలలు తిప్పించుకునేవారు, మీరు వెంటనే అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు. నా మేనల్లుడికి అమ్మఒడి ద్వారా డబ్బులిచ్చారు. మా అమ్మకు పింఛన్ ఇంటికే తెచ్చిస్తున్నారు. కంకిపాడు మండలంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి. – బి. శివకోటేశ్వరరావు, పెనమలూరు, కృష్ణా జిల్లా ఏడాదిలోనే అన్ని కార్యక్రమాలు నాకు 8 ఎకరాల భూమి ఉంది. వరి, అపరాలు పండిస్తా. మీరు చెప్పినట్లుగానే ఏడాది కాలంలోనే రైతు భరోసాతో పాటు అన్ని కార్యక్రమాలు చేపట్టారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు గ్రామంలోనే దొరికేలా చర్యలు చేపట్టడం బాగుంది. పంటలకు ఇన్సూరెన్స్ కూడా కల్పించడం మాకు చాలా ధైర్యాన్నిచ్చింది. కొబ్బరికి వైట్ ప్లై సమస్యను పరిష్కరించాలి. ఎస్.రాయవరం మండలంలో బ్రిడ్జి నిర్మిస్తే పది గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – దంతులూరి అచ్యుతరామరాజు, గుడివాడ, ఎస్.రాయవరం, విశాఖ రైతు విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దీనిపై మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. -
సాగు విప్లవం మార్పు మొదలైంది..!
సాక్షి, అమరావతి: ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని ఏడాది పాలనలో నిరూపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 62 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మక మార్పులతోనే కాపాడుకోగలుగుతామని, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఏర్పాటుతోనే ఆ మార్పు మొదలవుతోందని చెప్పారు. విత్తనాల సరఫరా మొదలు రైతులు పంటలు అమ్ముకునే వరకు ఆర్బీకేలు తోడుగా ఉంటాయన్నారు. సాగుకు ముందే పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులకు అది తప్పనిసరిగా దక్కేలా ఆర్బీకేలు పని చేస్తాయని, అవసరమైతే పంటలు కూడా కొనుగోలు చేస్తాయని వెల్లడించారు. ఈ ఏడాది తొలి సంతకంగా పేర్కొంటూ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్ శనివారం ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 10,641 ఆర్బీకేలను సీఎం ప్రారంభించారు. ఆర్బీకేలలో ఉండే కియోస్క్‌ను కూడా సీఎం ప్రారంభించగా ఓ రైతు దీనిద్వారా తనకు కావాల్సిన విత్తనాలను ఆర్డర్ చేశారు. అనంతరం 155251 ఇంటరాక్టివ్ కాల్ సెంటర్ నెంబరుతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ (గన్నవరం) ప్రారంభించిన సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగాపురంలోని ఆర్బీకేల పనితీరును సీఎం జగన్ లైవ్ ద్వారా వీక్షించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన ‘సీఎం–యాప్’ను ప్రారంభించి ‘ఆల్ ది వెరీ బెస్ట్’ అని టైప్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు ఈ సందేశం ఒకేసారి చేరింది. అనంతరం లోగోను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద సామాజిక దూరాన్ని పాటిస్తూ 50 మంది చొప్పున రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 5 లక్షల మంది రైతులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవీ.. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతా ఆర్బీకేలలోనే.. విత్తనాలు వేయడం మొదలు పంటల అమ్మకం వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తారు. అన్ని అంశాలలో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆర్బీకేలు విజ్ఞాన శిక్షణ కేంద్రాల్లా పని చేస్తాయి. సేంద్రీయ, ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తాయి. సాగుకు ముందే పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి, రైతన్నలకు ఆ ధర దక్కేలా కృషి చేస్తాయి. ఆర్బీకేలలో కియోస్క్ కూడా ఉంటుంది. వాటి ద్వారా రైతులు తమకు కావాల్సినవి కొనుక్కోవడంతోపాటు పంటలు కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ టీవీ, ఇంటర్నెట్ కూడా ఉంటాయి. భూసార పరీక్షలకు అవసరమైన పరికరాలు కూడా ఉంటాయి. 13 జిల్లాల్లో ల్యాబ్‌లు.. 13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయం ఎక్కువగా ఉన్న 147 నియోజకవర్గాలలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతతో పాటు భూసార పరీక్షలు కూడా నిర్వహించే విధంగా ల్యాబ్‌లలో సదుపాయాలు ఉంటాయి. ఈ–పంట.. ఈ–పంట (క్రాపింగ్) నమోదు ద్వారా పంటలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్. బ్యాంక్ రుణాల ప్రాసెస్ సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్నితో పాటు, పలువురు అధికారులు, కలెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సీఎం–యాప్‌లో సమస్త సమాచారం.. ఆర్బీకేల్లో ఉండే అగ్చికల్చరల్ అసిస్టెంట్లందరికీ ట్యాబ్‌లు అందజేస్తాం. వాటిలో సీఎం–యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాప్) డౌన్లోడ్ చేసి ఉంటుంది. యాప్‌లో అగ్రికల్చరల్ అసిస్టెంట్లు రోజూ పంటల సమాచారం, మార్కెట్ ధరలు, గిట్టుబాటు ధరల కల్పన, అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ తదితరాలు అప్లోడ్ చేస్తారు. ఆ వెంటనే జిల్లా మార్కెటింగ్ అధికారులతో పాటు ఆర్బీకేల కోసం ప్రత్యేకంగా నియమించిన జాయింట్ కలెక్టర్లు స్పందించి రైతులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంటారు. విత్తనాల సరఫరా మొదలు సాగు మెళకువలు, సలహాలు, సూచనలు అందించడం, పంటల అమ్మకం, గిట్టుబాటు ధరల కల్పన వరకు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. నష్టాల నుంచి బయటపడి లాభం పొందా.. ముందుగా ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. మేం ప్రధానంగా వరి, పసుపు, వేరుశనగ పండిస్తుంటాం. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాను. చెప్పిన దానికంటే అదనంగా ఐదేళ్ల పాటు ఇస్తామని ప్రకటించడంపై రైతులంతా ఆనందంగా ఉన్నారు. నవంబరులో అకాల వర్షంతో వరి నేలకొరిగింది. పసుపునకు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6,850 చొప్పున ప్రకటించడంతో రైతులే స్వయంగా దళారీ వ్యవస్ధ లేకుండా, తూకంలో మోసం లేకుండా అమ్ముకోగలిగారు. నష్టపోయే పరిస్థితి నుంచి బయటపడి ఎకరాకు రూ.70 – 80 వేలు లబ్ధి పొందా. మా మండలం పెన్నా రివర్ బెడ్ కాబట్టి ఒక బ్యారేజీ నిర్మించాలని కోరుతున్నా. – శంకర్‌రెడ్డి, రైతు, వైఎస్సార్ జిల్లా దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ వెంటనే రైతు ప్రతిపాదనను నోట్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ పథకాలు సంతోషాన్నిస్తున్నాయి రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. రైతు దేశానికి వెన్నెముకలాంటివారు. ఈవిషయం తెలిసిన ఆయన రైతులకు ఎంత మంచి చేయాలో అంతా చేస్తున్నారు. విలేజ్ నాలెడ్జ్ సెంటర్ ప్రోగ్రామ్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మహాత్మాగాంధీ చెప్పినట్టు బుద్ధిబలం, కండబలం కలిసి పనిచేయాలి. ఈ నాలెడ్జ్ సెంటర్ద్వారా ఇది నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు మంచి చేస్తున్న ఆయనకు మరోసారి ధన్యవాదాలు. – వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ సందేశం -
ఏడాదిలో ఎంత తేడా!
‘అవినీతికి తావులేకుండా, పైసా దారి మళ్లకుండా ఏడాదిలో 3.58 కోట్ల మంది ప్రజలకు రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. పింఛన్ల కోసం గత ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మేం నెలకు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం విస్మరించిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.686 కోట్లు చెల్లించడంతో పాటు ఆరోగ్య ఆసరా అనే కొత్త పథకాన్ని ప్రారంభించాం. విద్యాదీవెన, వసతి దీవెన. పిల్లల చదువులకు భరోసా, కంటి వెలుగు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, గోరుముద్దతోపాటు అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తున్నాం’ జగన్ అనే నేను.. మీ బిడ్డగా, సీఎంగా ఏడాది క్రితం చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నా. ఈ ఏడాది పాలన చిత్తశుద్ధి, నిజాయతీ, నిబద్ధతతో సాగిందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత సర్కారు పాలనకు, ఏడాదిగా తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ఒకసారి చూడాలని, మేనిఫెస్టో హామీల అమలులో వ్యత్యాసాన్ని మనస్సాక్షిగా గమనించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను ఏడాదిలోనే అమలు చేశామని గర్వంగా చెప్పగలనని, ఈ విషయాన్ని ప్రజలే లెక్క తేల్చాలని కోరారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే 77 హామీలను అమలు చేశామని, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్ ప్రకటించామని, ఇంకా 16 హామీలు మాత్రమే మిగిలాయని, వాటిని కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని 40 అంశాలను అమలు చేశామని వివరించారు. వలంటీర్ల ద్వారా మేనిఫెస్టోను ఇంటింటికీ పంపిస్తామని, అందులో ఏమేం అమలు చేశామో మీరే లెక్క తేల్చాలని ప్రజలను కోరారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 10,641 రైతు భరోసా కేంద్రాలను శనివారం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఏడాది పాలన పూర్తి చేసిన తాను మలి ఏడాదిలో చేస్తున్న తొలి సంతకంగా దీన్ని అభివర్ణించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది రైతులు, అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సీఎం ప్రసంగం వివరాలివీ.. ఎంతో సంతోషంగా ఉంది.. ఈరోజుతో మన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఇవాళ రైతులతో గడపడం ఎంతో ఆనందంగా ఉంది. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మాది. తొలి ఏడాదిలోనే రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని తెచ్చి సుమారు 49 లక్షల మంది రైతు కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ.10,200 కోట్లు జమ చేశాం. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, విపత్తు వస్తే ఆదుకోవడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేశాం. ఆ దిశగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 11 ఏళ్ల ప్రయాణంలో నలుమూలలా తిరిగా.. నా రాజకీయ జీవితం ప్రారంభమై 11 ఏళ్లు అవుతోంది. 2009లో ఎంపీగా ఎన్నికయ్యా. కోట్ల మంది ప్రజలను కలిసి ఉంటా. ప్రతి ప్రాంతం సమస్యను తెలుసుకునేందుకు రాష్ట్రం నలుమూలలా అడుగులు వేశా. 3,648 కి.మీ పాదయాత్రతో ప్రతి జిల్లాలో తిరిగా. నా రాజకీయ జీవితంలో దాదాపు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఉంటా. స్థోమత లేక కొంతమంది చదువుకోలేకపోయారని తెలిసి బాధపడ్డా. వైద్యం కోసం అప్పుల పాలు కావడం చూశా. క్యాన్సర్ వస్తే అరకొర చికిత్స అందించడం చూశా. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు, రైతుల కష్టాలను చూశా. కనీస ధర లేక పంటలు పొలాల్లోనే విడిచిపెడుతున్న వారిని చూశా. అక్క చెల్లెమ్మల బాధలు చూశా. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చూశా. వారి కన్నీరు తుడిచి జీవితాలను మార్చాలనే ఆలోచన చేశా. ► ప్రజల సమస్యలన్నింటినీ చాలా దగ్గరగా చూశా. వాటన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టో రూపొందించాం.కులం, మతం, పార్టీలు చూడకుండా, మాకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని తలిచా. కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశాం. ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చానని గర్వంగా చెబుతున్నా. ‘గత ప్రభుత్వం 650కి పైగా వాగ్దానాలు చేసి పేజీల కొద్దీ మేనిఫెస్టోను విడుదల చేసి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు మాఫియా ముఠాలుగా మారి ప్రతి పనికి లంచం దండుకున్నాయి. ఇప్పుడు ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పూర్తి పారదర్శకతతో అమలవుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి’ ‘‘చెప్పింది చేయడమే తప్ప ఏడాదిగా మరో ఆలోచన చేయలేదు. అవ్వాతాతల మీద గుండె నిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల పట్ల మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో.. అన్ని వర్గాల ఆరోగ్యంపై శ్రద్ధతో ఏడాదిగా పనిచేస్తున్నాం’’ విత్తనాలకూ భరోసా.. ► గతంలో కల్తీ విత్తనాలు, పురుగు మందులు అన్నీ టీడీపీకి చెందిన వారే సరఫరా చేశారు. ఇవాళ ప్రభుత్వం నాణ్యతను నిర్ధారించి సరఫరా చేస్తోంది. 18వ తేదీ నుంచి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా స్లిప్‌లు, సమయం సూచిస్తూ పంపిణీ చేస్తున్నారు. నాడు అధికార పార్టీ నాయకులకే ప్రాసెసింగ్ యూనిట్లు, కంపెనీలు.. ఒకటి గల్లా. మరొకటి శ్రీని ఫుడ్స్. ► ఈ ఏడాదిలో రూ.2200 కోట్లతో రైతులు ఇబ్బంది పడకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ అమలు చేశాం.టమాటా, ఉల్లి, మొక్కజొన్న, అరటి, బత్తాయిలు, బొప్పాయి కొంటున్నాం. గుంటూరులో సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పూలాభిషేకం చేస్తున్న అమ్మఒడి, పింఛను లబ్ధిదారులు, ఆటో డ్రైవర్లు ఇలాంటి విపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం.. మేం రాజధాని ప్రాంతంలో పేదలకు భూములిస్తామంటే డెమొగ్రఫిక్ బ్యాలెన్స్ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని కోర్టులో వాదించారు. భూములు సేకరిస్తుంటే కోర్టుకు వెళ్లిన విపక్షాలను చూశాం కానీ ఇక్కడ పేదలకు ప్రభుత్వ భూములు ఇస్తుంటే కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం. నాడు మాఫీ మాయ.. నేడు రైతన్నకు భరోసా గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. రూ.87,612 కోట్లకు గానూ ఐదేళ్లలో కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మేం ఏడాది తిరగక ముందే రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. తొలిసారిగా కౌలు రైతులను కూడా ఆదుకుంటున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా జూలైలో రూ.2 వేల కోట్లు వడ్డీ కింద ఇవ్వబోతున్నాం. ఇదీ తేడా... గతంలో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల మాఫియా సంతకాలు, లంచాలు కావాలి. ఇవాళ ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ, గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారైనా సరే ఇంటి తలుపు తట్టి ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నాం. మీ కళ్ల ముందే గ్రామ సచివాలయాల ద్వారా గడువు విధించి మరీ 540 రకాల సేవలు అందిస్తున్నాం. దరఖాస్తు మొదలు లబ్ధిదారుల జాబితా వరకు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ఒకటో తారీఖునే పండగైనా, ఆదివారం అయినా సరే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అవ్వాతాతలకు వలంటీర్లు చిరునవ్వుతో పెన్షన్ ఇస్తున్నారు. ► గతంలో స్కూళ్లు దారుణంగా ఉండేవి. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు నెలల తరబడి పెండింగ్ పెట్టేవారు. ఆయాలకు ఇచ్చే రూ.1000 గౌరవ వేతనం కూడా ఇచ్చేవారు కాదు. ఇవాళ ప్రతి స్కూల్లో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్‌ఛానల్‌లో పెట్టడమే కాకుండా, ఆయాల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచాం. పేద బిడ్డల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు తెచ్చాం. విద్యా సంస్థలపై నియంత్రణ కోసం స్కూళ్లు, కాలేజీలకు వేర్వేరుగా రెండు రెగ్యులేటరీ సంస్థలు తెచ్చాం. ► గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు చెల్లించలేదు. రూ.686 కోట్లు బకాయిలు పెట్టింది. అవన్నీ చెల్లించి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చేశాం. దీంతో తిరిగి చక్కటి చికిత్స అందిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా ఆరోగ్యశ్రీలో చికిత్స అందుతోంది. నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. లబ్ధిదారులు 3.58 కోట్ల మంది ఏడాదిలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 3.58 కోట్ల మంది కాగా వారి ఖాతాల్లో రూ.40,627 కోట్లు జమ చేశాం. వీరిలో 1.78 కోట్ల మంది బీసీలకు రూ.19,309 కోట్లు అందించాం. 61.28 లక్షల మంది ఎస్సీలకు రూ.6,500 కోట్లు ఖర్చు చేశాం. 18.40 లక్షల మంది ఎస్టీలకు రూ.2,136 కోట్లు ఇచ్చాం. 19.05 లక్షల మంది మైనారిటీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు రూ.1,722 కోట్లు ఇచ్చాం. 77.84 లక్షల మంది ఇతరుల కోసం రూ.10,768 కోట్లు ఖర్చు చేశాం. . ► గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రూ.39 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. రూ.2.60 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది. దీనికి వడ్డీతో పాటు విద్యుత్ సంస్థలకు మరో రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టింది. ► మేం రివర్స్ టెండర్ల ద్వారా దాదాపు రూ.2,200 కోట్లు ఆదా చేశాం. అవినీతికి తావు లేకుండా జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. పోలీసులకు వీక్లీ ఆఫ్.. గతంలో పోలీసులతో బండ చాకిరీ చేయించుకునేవారు. ఏనాడూ వారి కుటుంబాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు వారికి వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో పోలీసు మిత్రలను ఏర్పాటు చేశాం. మద్యానికి కళ్లెం.. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. దాదాపు 43 వేల బెల్టు షాపులు, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో అక్కాచెల్లెమ్మలు ఇబ్బంది పడ్డారు. ఇవాళ 43 వేల బెల్టు షాపులు రద్దు చేయడంతోపాటు 33 శాతం దుకాణాలు తగ్గించాం. ధరలు పెంచడం వల్ల బీర్ల అమ్మకాలు 55 శాతం తగ్గాయి. ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు 24 శాతం తగ్గాయి. గతంలో వారానికి 5 నుంచి 6 బాటిళ్ల మద్యం తాగితే ఇప్పుడు 2 మాత్రమే తాగుతున్నారు. సామాజిక న్యాయం.. గత ప్రభుత్వానికి మాటలు తప్ప బీసీలపై ప్రేమ లేదు. సామాజిక న్యాయం అసలే లేదు. మా మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఈ వర్గాలకే ఇచ్చాం. సచివాలయ ఉద్యోగాలలో 82.5 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. దుర్గ గుడి పాలక మండలిలో తొలిసారిగా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. కృష్ణా ఏఎంసీలో కూడా వారికే స్థానం దక్కేలా చేశాం. ఎస్సీలకు మూడు వేర్వేరు కమిషన్లతోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం.. పేదలకు ఇళ్ల స్థలాలు.. వైఎస్సార్ జయంతి రోజు 29 లక్షల ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేస్తాం. రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం అందిస్తాం. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి రూ.24 వేలతోపాటు చేపల వేటపై నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున సాయం చేశాం. ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు ఇబ్బంది పడకుండా సాయమందించాం. అందరి సంక్షేమం కోసం.. అవ్వాతాతల మీద గుండెనిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల మీద మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో, మీ అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నా. -
రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
-
జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన పొలీసులు
సాక్షి, విజయవాడ: కొన్ని దశాబ్దాలుగా పోలీస్ శాఖలో అమలుకాని వీక్లీ-ఆఫ్‌లను అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకులు శ్రీనివాసరావు అన్నారు. ఏడాది పాలనలో పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శనివారం జగన్ ఏడాది పాలనపై ఆయన విజయవాడలో మాట్లాడుతూ... విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీస్ కుటుంబాలకు చెల్లించే పోలీస్ బీమా 20 లక్షలు, ఎస్ఐలకు 25 లక్షలు, సీఐలకు 30 లక్షలు, ఆ పై స్థాయి వారికి 40 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని హోంగార్డ్‌ల జీతాలను పెంచారు. సీఐడీ, దిశ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్ క్రింద 30 శాతం మంజూరు చెశారు. ఇటీవల కోవిడ్-19 విధులలో ఉండి మరణించిన అనంతపురం జిల్లా ఏఎస్ఐ హబీబుల్లా కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం సంతోషం అని శ్రీనివాసరావు తెలిపారు. ('సీఎం వైఎస్ జగన్ సంక్షేమ సామ్రాట్') -
'సీఎం వైఎస్ జగన్ సంక్షేమ సామ్రాట్'
సాక్షి, తిరుపతి : ఏడాది పాలనలో జగనన్న ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారని ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. రోజా మాట్లాడుతూ..' ఆయన పాలనలో తాము ఎమ్మెల్యేలుగా ఉండటం అదృష్టం.ఏడాది పసులనలో రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో 3 కోట్ల 50 లక్షల మందికి రూ. 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అందించారు. ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. వ్యవసాయంలో హరిత విప్లవం తెచ్చారు.రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దేశంలోనే చారిత్రాత్మకం. ఇది రైతు ప్రభుత్వం అని సీఎం జగన్ నిరూపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కానీ వైఎస్ జగన్ తన తండ్రికి మించిన తనయుడిగా పాలన అందిస్తున్నారంటూ' పేర్కొన్నారు. -
జగన్ అనే నేను...
-
వైఎస్ జగన్ జనం నమ్మిన నాయకుడు
-
ఈ-క్రాప్ బుకింగ్‌కు రైతుకు తోడ్పాటు
-
పేదలపై కోర్టుకెళ్లే ప్రతిపక్షాలను ఇక్కడే చూస్తున్నా
సాక్షి, అమరావతి : ఇళ్లులేని పేదలకు భూ పట్టాల పంపిణీ చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని తాను ఇక్కడే చూస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సంకల్పించిన పథకాలను అమలు కాకుండా అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా శనివారం ‘వైఎస్సార్ రైతు భరోసా’ కేంద్రాలను వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. లంచం, అధికార పార్టీ సిఫార్సు లేనిదే గత ప్రభుత్వంలో పేదవాడికి పని జరిగేది కాదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో లంచాలనే మాట లేకుండా నేరుగా ప్రజల ఖాతాలోనే డబ్బును జమ చేస్తున్నామని తెలిపారు. (అతనొక్కడే...) ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు దరఖాస్తు నుంచి లబ్ధిదారుల జాబితా వరకు అన్ని జాబితాలను గ్రామ సచివాలయాల్లో పెడుతున్నామని సీఎం జగన్ వివరించారు. ‘ప్రతినెలా 1వ తేదీన అర్హలందరికీ ఠంచన్‌గా పింఛన్ ఇస్తున్నాం. నాడు-నేడు ద్వారా స్కూళ్లను ఆధునీకరిస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం ఉండేలా రోజుకో మెనూ రూపొందించాం. ఉన్నత విద్య, ప్రాథమిక విద్యకు రెండు నియంత్రణ కమిటీలు వేశాం. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. రూ.2వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. కొత్త 104, 108 అంబులెన్స్‌లను ప్రారంభించబోతున్నాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చబోతున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సంఖ్యను 230 నుంచి 500లకు పెంచాం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నాం. (వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్) 29లక్షల మందికి ఇళ్ల పట్టాలు రూ. 2వేల కోట్లతో సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొస్తున్నాం. కౌలు రైతులకు సైతం రైతు భరోసా సొమ్ము ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో గుడి, బడి దగ్గర బెల్ట్ షాపులు కనిపించేవి. మా ప్రభుత్వం వచ్చాక 43వేల బెల్ట్ షాపులను రద్దు చేశాం. గతంలో పోలిస్తే ఇప్పుడు 33శాతం షాపులు తగ్గాయి. గ్రామ సచివాలయాల్లో లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశాం. అర్హులైన 29లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ.24వేలు ఇస్తున్నాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10వేలు సాయం అందిస్తున్నాం. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2వేల కోట్లకుపైగా ఆదా చేశాం’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
ప్రజలకు మంచి చేసి తీరుతాము: కొడాలి నాని
సాక్షి, గుడివాడ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు భరోసాగా నిలిచిందన్నారు. మహానాడులో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. (ఒకే ఒక్కడుగా నిలిచి... విజయపతాకం ఎగురవేసి...) ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించి నాలుగు ఓట్లు సంపాదించడానికి తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా.. ప్రజలకు మంచి చేసి తీరుతామన్నారు. కింది న్యాయ స్థానంలో న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్తామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (ఆ అడుగుల సవ్వడి..) -
అన్నదాతలకు సమస్త వ్యవసాయ సేవలు
-
ప్రతి కేంద్రంలో వ్యవసాయం చెందిన సహాయకులు
-
రైతులకు అధిక ఆదాయం
-
సర్టిఫై చేసి ప్రభుత్వమే విత్తనాలు ఇస్తుంది
-
రైతుభరోసా సొమ్ము ఇస్తున్నాం
-
ఒకే ఒక్కడుగా నిలిచి... విజయపతాకం ఎగురవేసి...
ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించింది... అసెంబ్లీలో అవమానాలు రాటు దేలేలా మార్చింది... మూడువేల ఆరువందల పైచిలుకు కిలోమీటర్ల ప్రజాసంకల్ప పాదయాత్రవల్ల ఎంతో మేలు జరిగింది. ప్రతి ఇంటి తలుపు తట్టేలా... ప్రతి హృదిని స్పందింపజేసేలా చేసింది... ప్రతి నిరుపేద కష్టాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం కల్పించింది. అసలైన నాయకుడెవరో జనానికి తెలిసింది. ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రతి గుండె తపించింది. ఆ తరుణం రానే వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించింది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. జిల్లాలో ప్రతిపక్ష పార్టీని సమూలంగా ఊడ్చేసి... ఏకైక పార్టీగా రూపొందేలా చేసింది. అప్పుడే ఆ విజయానికి ఏడాది గడిచిపోయింది. మాటతప్పని... మడమతిప్పని నాయకత్వం... జిల్లా ప్రజలకు ఎంతో న్యాయం చేసింది. నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఇన్నాళ్లకు సంక్షేమ పాలన అంటే ఏమిటో జనానికి అవగతమైంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామం పండగ చేసుకుంటోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: యువజన శ్రామిక రైతు(వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శనివారానికి ఏడాది పూర్తవుతోంది. జనం కోరుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం ముగుస్తుంది. తొలి ఏడాదిలోనే ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి తనదైన ముద్ర వేసుకుంది. వీటితోపాటు అభివృద్ధిపై తనదైన శైలిలో దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు కూడా పలు వరాలు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. జిల్లా వైద్య, పారిశ్రామిక, వాణిజ్య రంగాలను మెరుగు పరిచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ అడుగుజాడల్లో ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా జిల్లాలోనిఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు నిత్యం ప్రజల్లో ఉంటూ, సంక్షేమ ఫలాలను వేరవేస్తున్నారు. జిల్లాకు అభివృద్ధి పథకాలను తీసుకువస్తున్నారు. ్చ జిల్లాపై ముఖ్యమంత్రి ముద్ర: విజయనగరంలో 200 పడకలతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేశారు. ప్రస్తుతం కాలేజీ ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోంది. కాలేజీ ఏర్పాటు చేస్తే ఎంతోమంది విద్యార్ధులకు మేలు జరగడంతోపాటు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నా యి. ♦ మిమ్స్‌లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ♦ పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేసింది. ఇందుకు స్థల సేకరణ జరుగుతోంది. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే పార్వతీపురం డివిజన్లో ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గర కానున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు మేలు జరగనుంది. ప్రస్తుతం వారు పెద్ద వైద్యం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోంది. ♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నిల్ ఇస్తూ జీవో జారీ చేశారు. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ♦ సాలూరు ప్రాంతంలో గిరిజన యూనివర్సటీ ఏర్పా టుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కొత్తవలస మండలంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకుంది. అయితే గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలో ఉండాలని భావించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సాలూరులో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పాచిపెంట మండలంలో స్థల పరిశీలన జరిగింది. ♦ భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. విమానాశ్రయానికి సంబంధించి 2500 ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో పనులు చేసేందుకు టెండర్లు ఖరారు చేసింది. జీఎంఆర్ సంస్థకు పనులు అప్పగించింది. ♦ వీటితో పాటు నవరత్న పథకాలతో జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారు. శతాబ్దాల మురికిని పారదోలి కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. -
ఆ అడుగుల సవ్వడి..
సాక్షి, కాకినాడ: ‘తూర్పు’లో ప్రజా సంక్షేమానికి బాటలు పడ్డాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేసి చరిత్ర సృష్టించింది. కోవిడ్–19 వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అయినా వాటిని లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే.. హామీలు ఇవ్వని పథకాలను సైతం ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత జగన్‌కే దక్కింది. ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధికి బాట వేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా క్షేత్ర స్థాయికి వాటి ఫలాలు చేరేలా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పారు. పోలవరం నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ గతంలో ఒక్కో రైతుకు రూ.6.5 లక్షలు ప్రకటించగా..ప్రస్తుతం దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ఏజెన్సీలో కాళ్లవాపుతో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.70 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి మనసున్న నేతగా నిలిచారు. (వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్) అన్నదాతకు అండగా.. రైతులకు తానున్నాన్న భరోసా ఇచ్చేందుకు రైతు భరోసా పేరుతో ఓ బృహత్తర పథకానికి నాంది పలికారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 పంట సాగుకు పెట్టుబడి కింద అందజేస్తున్నారు. జిల్లాలో 4,29,676 మంది రైతులు ఉండగా.. వారికి ఈ ఏడాది రూ.322.25 కోట్లు చెల్లించారు. గతేడాది 4.12 లక్షల కుటుంబాలకు రూ.311.52 కోట్లు చెల్లించారు. గతేడాదికంటే ఈ ఏడాది 17,391 మందికి అదనంగా చెల్లించారు.మత్స్యకార భరోసా : ఏప్రిల్ 14 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముంద్రంలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు ఉపాధికి దూరమవుతారు. వారికి వేట నిషేధ భృతి చెల్లిస్తున్నారు. జిల్లాలో 24 వేల మంది సముద్రంలో వేటకు వెళ్లనున్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.24.58 కోట్లు పరిహారంగా అందించారు. గతేడాదిలో 22 వేల మందికి రూ.22 కోట్లు చెల్లించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 20 రోజుల్లో నగదు చెల్లించడం ఇదే తొలిసారి. (జ(గ)న్ రంజక పాలనకు ఏడాది) అమ్మ ఒడి: నిరుపేదలు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరం కాకూడదన్న తలంపుతో అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థికసాయం అంజేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే ఒక్కో విద్యారి్థకి ఏడాదికి రూ.1500 చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,020 పాఠశాలలుండగా..4,57,222 మంది విద్యార్థులకు అర్హులుగా గుర్తించి రూ.685.83 కోట్లు జమ చేశారు. వాహనమిత్ర: వాహనమిత్ర పథకం పేరుతో ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 25,745 మందికిగాను రూ.2,57,45,000 కోట్లు అందజేశారు. వచ్చే నెలలో రెండో విడత సొమ్ము కూడా అందించనున్నారు. జగనన్న విద్యా, వసతి దీవెన జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,12,320 మందికిగాను రూ.117.73 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. రెండో విడతలో భాగంగా జగనన్న వసతి దీవెనకు 18,809 మందికి రూ.17.56 కోట్లు, విద్యా దీవెనకు 18,618 మంది విద్యార్థులకు రూ.38.75 కోట్లు చెల్లించనున్నారు. అభాగ్యులకు అండ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభాగ్యులకు అండగా నిలుస్తోంది. 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 6,35,973 మందికి రూ.154 కోట్లు అందజేస్తోంది. అది ఒక్క రోజులోనే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ నిర్వహిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,80,432 మందికి వివిధ రకాలు పింఛన్లు మంజూరు చేస్తుండగా..వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 6,35,973 మంది ఇస్తున్నారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం 55,541 మందికి కొత్తవారికి అవకాశం కల్పించారు. -
రైతుల ఇబ్బందులను చూశా
-
వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్‌ది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా శనివారం రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయని, రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని వ్యాఖ్యానించారు. ‘మనది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పాం.. చేశాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు 49 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. రైతుకు అవసరమైన సమయంలో సహాయం అందాలని, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అడుగడుగునా తోడుగా ఉంటామని భరోసానిచ్చారు. తొలి ఏడాది పాలన నిజాయితీతో, చిత్తుశుద్ధితో గడిచిందన్నారు. (ఏడాదిలో ఎన్నో సంచలన నిర్ణయాలు) భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించా ‘నా 11 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో కోట్లమందిని కలిశా. 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేశా. పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నా.. చూశా. చదివించే స్థోమత లేక పిల్లలను బడులకు పంపని పరిస్థితులను చూశా. రైతుల ఇబ్బందులను చూశా. కష్టాలు పడుతున్న అక్కాచెల్లెమ్మల పరిస్థితులు చూశా. గుడి దగ్గర, బడి దగ్గర విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చూశా. వీటన్నింటికి పరిష్కారంగా మేనిఫెస్టోను తీసుకొచ్చాం. కుల, మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్నవారందరికీ మంచి చేయాలని ఆలోచన చేశా.కేవలం రెండు పేజీల్లోనే మేనిఫెస్టో పెట్టాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించా. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం. వైఎస్ జగన్ అనే నేను.. ఏడాది కాలంగా.. మీ కుటుంబ సభ్యుడిగా.. నేను చేసిన ప్రమాణానికి అనుగుణంగా మీ కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేస్తున్నా. సీఎం కార్యాలయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హామీల్లో.. ఇప్పటికే 77 అమలు చేశాం. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే పరుగులు పెట్టిస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన అందించిన సంక్షేమ పాలన గురించి వివరించారు. ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచాం రాష్ట్రంలోని 3 కోట్ల 58 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే రూ. 40,627 కోట్లను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లలో జమ చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచి.. ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు ఇస్తున్నాం. కంటి వెలుగు ద్వారా అవ్వా, తాతాలకు, విద్యార్థులకు పరీక్షలు చేయిస్తున్నాం. వాహన మిత్ర, లా నేస్తం, నేతన్న నేస్తం వంటి పథకాలను ప్రారంభించాం. కోటి 78 లక్షల బీసీలకు రూ.19,309 కోట్లు ఖర్చు చేశాం. 18 లక్షల 40వేల మంది ఎస్టీలకు రూ.2,136 కోట్లు ఖర్చు చేశాం. 19 లక్షల 5వేల మైనార్టీలకు రూ.17,222 కోట్లు ఖర్చు చేశాం. ఎక్కడా అవినీతికి తావులేకుండా నేరుగా వారి అకౌంట్లలోనే జమ చేశాం. గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్ చేసేవారు. గత ప్రభుత్వం 600లకుపైగా హామీలిచ్చి.. 10శాతం కూడా నెరవేర్చలేదు. జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకు.. అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాలని గత ప్రభుత్వం కోరుకునేది .ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాస్పత్రులు.. చివరకు ప్రభుత్వ డెయిరీలను మూసివేసేందుకు గత ప్రభుత్వం కుట్రలు చేసింది. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దక్కాలంటే జన్మభూమి మాఫియాకు లంచాలు ఇవ్వాల్సిందే. మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. మాన ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరీ ఇంటికే వెళ్లి పథకాలు అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
జ(గ)న్ రంజక పాలనకు ఏడాది
ప్రజల సంక్షేమం కోసం నాన్న ఒక అడుగు వేస్తే నేను మరో అడుగు ముందుకు వేస్తాను. మ్యానిఫెస్టో అంటే హామీల చిట్టా కాదు..దానిని పవిత్ర గ్రంథంగా భావించాలి. అందులో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చాలి. ఇచ్చిన ప్రతి హామీకి ఉంటాను. నెరవేర్చి మీ గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంటాను– వైఎస్ జగన్మోహన్రెడ్డి,ముఖ్యమంత్రి (ఏడాదిక్రితం) నేను ఉన్నాను..నేను విన్నాను..తాను చేసిన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నోట వినిపించిన మాట..టీడీపీ పాలనలో విసిగి వేసారిన ప్రజలకు ఈ మాట కొండంత ఊరట..కరవు కాటకాలతో అల్లాడుతూ కష్టాలతో కాపురం చేస్తున్న జనానికి పెద్ద బాసట.. రాజన్న బిడ్డ మాట ఇస్తే తండ్రిలాగే నెరవేరుస్తాడనివారి నమ్మకం..ఏడాది క్రితం ఇదేరోజున అఖండవిజయం సాధించి ‘జగన్ అనే నేను..’ అని తమ ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తుంటే రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన సొంతగడ్డ ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది. బాధ్యతలు చేపట్టింది మొదలు ఆయన సారథ్యంలో సర్కారు సంక్షేమానికి బాటలు వేసింది. ప్రపంచం లో మరెవ్వరూ చేయని విధంగా రికార్డు స్థాయిలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చింది. ఎన్నికలముందు ఇవ్వని హామీలనూ అమలుచేసి అబ్బురపరిచింది. సంక్షేమానికి పట్టం కడుతూ అభివృద్ధికిఅగ్రస్థానమిస్తూ సాగిన ఏడాది ప్రస్తానంపై ప్రత్యేకకథనాలు.. సాక్షి ప్రతినిధి,కడప/నెట్వర్క్.: ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం అన్నట్లుగా బుల్లెట్ దూసుకుపోతుంది. అంతే స్పీడుగా ఇచ్చిన హామీలను జ‘గన్’ అమలు చేస్తారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా నిలుస్తారు. పేదల బతుకులు బాగుండాలని తపిస్తారు. ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని ఆశిస్తారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మంచి భవిష్యత్తుకు పునాది వేస్తారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కరోనా కష్టాల్లోనూ పథకాలు అమలు చేస్తూ ఔరా అనిపించారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టాభిషిక్తుడై మే 30వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది పాలన జనరంజకంగా ఉందంటూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో లబ్ధిపొందిన వారి అభిప్రాయాలు. రైతు రాజ్యం ♦ మనబడి నాడు నేడు కింద 1017 పాఠశాలలకు మహర్దశ. రూ. 225.93 కోట్లు ♦ 2.39 కోట్ల నిధులతో 755 యూనిట్లలో ఖరీఫ్‌లో పొలంబడి కార్యక్రమం ♦ రూ. 1.96 కోట్లతో 615 యూనిట్లలో రబీలో పొలం బడి నిర్వహణ ♦ గత ప్రభుత్వంలో ఇవ్వకుండా ఎగ్గొట్టిన 24 వేల మంది రైతులకు చెందిన రూ. 154కోట్లు బీమా మంజూరు ♦ 2014–18 మధ్య కాలంలో చనిపోయిన 37 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున 2019 నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న 53 మంది రైతులకు సంబంధించి రూ. 5.55 కోట్లు పంపిణీ ♦ 13,916 మంది రైతులకు చెందిన 4.17 లక్షల క్వింటాళ్ల బుడ్డశనగలకు సంబంధించి క్వింటాలుకు రూ. 1500 చొప్పున రూ. 28 కోట్ల బోనస్ అందించారు. ♦ రూ. 72 కోట్లతో వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు 116 ఫీడర్లలో పనులు చేపట్టారు. ♦ రైతులకు 40 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధి: ♦ 15 వేల కోట్లతో 30 లక్షల టన్నుల సామర్థ్యంతో జమ్మలమడుగు వద్ద ఉక్కు ఫ్యాక్టరీ, 25 వేల మందికి ఉద్యోగాల కల్పన ♦ సూక్ష్మ, చిన్న, మ«ధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి ఎస్సీ, ఎస్బీ, ఓబీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన 772 మందికి రూ. 48.97 కోట్లు ఇన్సెంటీవ్ రిలీజ్ 10.5 ఎంటీపీఏ సామర్థ్యంతో రెండు సిమెంటు ఫ్యాక్టరీల విస్తరణ. గాలివీడు వద్ద అల్ట్రా మెగా సోలార్ పార్కు ఏర్పాటు మైలవరం వద్ద సోలార్ పార్కు ఏర్పాటు ఎర్రగుంట్ల వద్ద శ్లాబ్ పాలిసింగ్ యూనిట్ ఏర్పాటు శ్రీకారం చుట్టుకోనున్న సాగునీటి ప్రాజెక్టులకులు ♦ రూ. 1350.10 కోట్లతో రాజోలి ఆనకట్ట నిర్మాణం. ♦ కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ. ♦ రూ. 564.60 కోట్లతో కుందూ, తెలుగుగంగ ♦ ఎత్తి పోతల పథకం...1.77 లక్షల ఎకరాల స్థిరీకరణ ♦ రూ. 312.30 కోట్లతో జోలదరాశి రిజర్వాయర్... ♦ కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ ♦ రూ.3000 కోట్లతో జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం....2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ♦ రూ. 86.50 కోట్లతో వెలిగల్లు, గాలివీడు ఎత్తిపోతల పథకం ♦ రూ. 340.60 కోట్లతో రాయచోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ♦ రూ. 40 కోట్లతో ఝరికోన లిఫ్ట్ ♦ 20 టీఎంసీల సామర్థ్యంతో కొండాపురం వద్ద ♦ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం ♦ రెండు వేల క్యూసెక్కులతో గండికోట, సీబీఆర్ లిఫ్ట్ ♦ రాబోయేకాలంలో గండికోటలో 26.85 టీఎంసీలు నీరు పెట్టేందుకు చర్యలు ♦ జీఎన్ఎస్ఎస్ ఫేజ్–1, ఫేజ్–2 పనులు పూర్తి చేసి 1.55 లక్షల ఎకరాలకు సాగునీరు ♦ 6 వేల క్యూసెక్కులకు జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ ♦ 10 వేల క్యూసెక్కులకు గండికోట టన్నెల్ విస్తరణ ♦ 30 వేల క్యూసెక్కులకు అవుకు టన్నెల్ విస్తరణ వైద్య నిర్మాణాలకు పునాదిరాళ్లు ♦ రూ. 347 కోట్లతో పులివెందులలోమెడికల్ కళాశాల ఏర్పాటు ♦ రూ. 175 కోట్లతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ♦ రూ. 107 కోట్లతో రిమ్స్‌లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం ♦ రూ. 40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు. పరిశ్రమల కోసం భూ కేటాయింపులు ♦ కొప్పర్తి మెగా ఇండస్ట్రీయల్ పార్కుకు 6500 ఎకరాల కేటాయింపు ♦ పులివెందులలో 824 ఎకరాలు ♦ యాదవపురం 272 ప్లాట్స్ ♦ ఎంఎస్‌ఎంఈఆర్ 104.67 ఎకరాలు ♦ శెట్టిగుంట 65 ఎకరాలు.....మైదుకూరు 34 ఎకరాలు వివిధ సంక్షేమపథకాల ద్వారా జిల్లాలోలబ్ధిపొందిన వారి సంఖ్య ♦ అమ్మ ఒడి పథకం 2,55,587 ♦ రైతు భరోసా 2,90,630 ♦ రైతులకు సున్నా వడ్డీ పథకం 3,69,377 ♦ జగనన్న వసతి దీవెన 70,884 ♦ జగనన్న విద్యా దీవెన 70,884 ♦ జగనన్న గోరుముద్ద 2,18,238 ♦ వైఎస్సార్ కంటి వెలుగు– 4,12,301 ♦ పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు –1.22 లక్షలు ♦ నేతన్న నేస్తం – 11,774 ♦ పోలీసులకు వీక్లీ ఆఫ్ – 4342 ♦ వైఎస్సార్ పెళ్లికానుక – 3412 ♦ ఆశా వర్కర్లకు జీతాల – 2600 ♦ వైఎస్సార్ వాహనమిత్ర – 12,116 ♦ సామాజిక పెన్షన్ల పెంపు వర్తింపు – 3,25,949 ♦ వైఎస్సార్ ఆసరా కింద 39,912 సంఘాలు ♦ సున్నా వడ్డీ కింద 12,162 సంఘాలు ♦ డ్వాక్రా యానిమేటర్లు, రీసోర్స్ పర్సన్లు 2125 ♦ వైఎస్సార్ ఆసరా కింద మెప్మా ద్వారా 8200 సంఘాలు ♦ మైనార్టీ విద్యార్థులకు వసతి, దీవెన, విద్యా దీవెన– 12,009 ♦ మౌజన్, ఇమామ్, చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం – 1400 ♦ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 43,976 సంఘాలు ♦ మధ్యాహ్న భోజన కార్మికుల జీతాల పెంపు– 6734 ♦ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు జీతాల పెంపు – 6889 ♦ రూ. 10వేలు పొందిన అగ్రిగోల్డ్ బాధితులు– 18,864 ♦ పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు – 2730 ♦ ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులు– 3700 ♦ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేలు ఆర్థికసాయం– 200 ♦ ఇంటి వద్దకే బియ్యం7.50 లక్షల కార్డుదారులు ♦ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం పొందినవారు – 6329 ♦ వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉపాధి పొందినవారు – 14,483 ♦ డయాలసిస్ పేషంట్లకు రూ. 3 నుంచి 10 వేలకు పెన్షన్ పెంపు – 557 -
90 శాతం హామీలు ఏడాదిలోనే అమలు
‘ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌లా భావిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున ప్రజలందరికీ మాట ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేసి ‘శభాష్’ అనిపించుకున్నారు. కులం చూడం.. మతం చూడం.. వర్గం చూడం.. పార్టీలు చూడం.. అన్నట్లుగా పారదర్శక పాలన అందిస్తూ.. భావితరాల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో సంక్షేమ రాజ్యంలో నవరత్నాల వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రగతి కొత్త పుంతలు తొక్కుతోంది. రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు,కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు జేజేలుపలుకుతున్నారు. నేటితో రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, కర్నూలు : ‘మీ కష్టాలు నేను విన్నాను..నేనున్నానని’ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగా ప్రతి ఒక్కరి బాధ, ఆవేదన, కష్టాలు ఆయన గుండెల్లోనే ఉన్నాయని ఆయన ఏడాది పాలన, తీసుకున్న నిర్ణయాలు చూస్తే స్పష్టమవుతోంది. తొలి కేబినెట్లోనే ఏకంగా 43 అంశాలపై తీర్మానం చేశారు. వాటి అమలు చకచకా కానిచ్చేశారు. ఈ హామీల అమలు వెనుకబడిన కర్నూలు లాంటి జిల్లాకు వరాలుగా మారాయి. ఓదార్పుయాత్ర, రైతుభరోసా యాత్ర, పాదయాత్రలో అడుగడుగునా జనం గోడు విన్నారు. వీటిని శాశ్వతంగా పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదులు, వందల సంఖ్యలో బోర్లు వేసినా నీరు పడక.. పంటలు పండక.. నష్టాల్లో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కన్నీటి చెమ్మ జననేత గుండెను తాకింది. అందుకే ‘రైతు భరోసా’తో అండగా నిలిచారు. ఉచితంగా వ్యవసాయబోర్లు వేసేందుకు నియోజకవర్గానికి ఓ రిగ్గు కొనుగోలు చేస్తున్నారు. వడ్డీలేకుండా వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. పంటనష్టం వాటిల్లితే అండగా ఉండేందుకు పంటలబీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చేశారు. పాదయాత్రలో అడుగడుగునా తమ బాధలను మొరపెట్టుకున్న పారిశుధ్యకార్మికులు, హోంగార్డులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీనియారిటీని బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకునేలా తీర్మానం చేశారు. ఇల్లులేని వారికి ఇళ్లు, ఇంటి స్థలం లేనివారికి స్థలం రిజిస్ట్రేషన్ చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 90 శాతం హామీలు ఏడాదిలో అమలు చేశారు. ఇందులో ప్రతీ హామీ అమలులో రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ మేలు జరిగేది వెనుకబడిన మన జిల్లాకే అని, ఇది శుభపరిణామమని చెప్పవచ్చు. గ్రామ స్వరాజ్యం.. సాకారం దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం ద్వారానే పల్లెల అభివృద్ధి జరుగుతుంది, తద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుందని మహాత్మాగాంధీ కలలుగన్నారు. కానీ స్వాతంత్య్రభారతంలో గ్రామస్వరాజ్య సాధన దిశగా తొలి అడుగు వేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్ సారథ్యంలోని ప్రభుత్వం పాలనను పల్లెలకు తీసుకెళ్లాలని ఏకంగా గ్రామసచివాలయ వ్యవస్థనే ఏర్పాటు చేసింది. జిల్లాలో 885 సచివాలయాలు నిర్మించారు. ఇందుకు 312.55 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో మౌలిక వసతుల కల్పనకు రూ.14 కోట్లు వెచ్చించారు. అలాగే జిల్లాలోని 9 మునిసిపాలిటీలలో 380 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. అందులో 3,040 మంది సచివాలయ ఉద్యోగస్తులు, 4,800 మంది వలంటీర్లు ఉన్నారు. గ్రామస్తులకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎటువంటి సర్టిఫికెట్ కావాలన్నా నిర్ణీత కాలపరిమితిలో అందేలా రూపలకల్పన చేసింది. అలాగే వలంటీర్ల ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజా సంక్షేమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ సేవ చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఏడాదిలోనే మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా కరోనా సమయంలో వీరి సేవలు ప్రశంసనీయం. దిశ పోలీస్‌స్టేషన్‌తో మహిళల భద్రతకు భరోసా బాలికలు, మహిళల భద్రత కోసం జిల్లాలో 79 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 158 మంది మహిళామిత్ర కోఆర్డినేటర్లు, 920 మంది సభ్యులు ఉన్నారు. మహిళల భద్రతకు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై ఒక బుక్లెట్ జారీ చేశారు. డయల్ 100 సేవలను మరింత బలోపేతం చేశారు. అలాగే స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చే స్పందన అర్జీల పరిష్కారంలో మొదటి స్థానంలో కర్నూలు జిల్లా ఉంది. ఉన్నత చదువులకు ఇంగ్లిషు మీడియం కార్పొరేట్ పాఠశాలల దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు కుదేలయ్యాయి. దీంతో పిల్లల ఉన్నత చదువులు చదివి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అని భావించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లి్లషు మీడియం ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ మీడియం చదివిస్తారనే అభిప్రాయం తీసుకుని విద్యాభోదన చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 97.67 శాతం మంది ఇంగ్లిషు మీడియంలో చదివేందుకు సిద్ధమయ్యారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి, కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించేందుకు నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. తొలివిడతలో రూ.322 కోట్లతో పాఠశాలలను ఆధునికీకరిస్తున్నారు. అలాగే జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందేలా పోషక విలువలతో కూడా ఆహారాన్ని మెనూలో చేర్చి, దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు ఉచితంగా అందజేస్తున్నారు. అలాగే జగనన్న విద్యాదీవెన ద్వారా జిల్లాలో 7,568 మందికి ఉపకార వేతనాలు చెల్లిస్తున్నారు. రైతన్నకు దన్నుగా... రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడకుండా రైతు భరోసా పేరుతో వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఏడాదికి రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500 ఇచ్చేందుకు సిద్ధమైంది. 2019–20లో జిల్లాలో 3,70,308 మంది లబ్ధిదారులకు రూ.647.06 కోట్లు రైతుభరోసా ద్వారా ఇచ్చారు. 2020–21లో 4,90,382 మందికి ఇచ్చారు. అలాగే రైతు సమస్యలు తీర్చేందుకు జిల్లాలో 862 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
సీఎం యాప్ ప్రారంభం, ఆల్‌ది బెస్ట్
-
నిరూపిస్తే రాజీనామా చేస్తా: అవంతి సవాల్
సాక్షి, విశాఖపట్నం: ఏడాది పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం తొలి ఏడాదిలోనే నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి అవంతి పూల మాలలు వేసి నివాళర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిటీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, నార్త్ ఇన్ ఛార్జి కెకె రాజు, మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కుంభా రవిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి, కొయ్యా ప్రసాద రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కోలా గురువులు పాల్గొన్నారు. (విశాఖపై అభివృద్ధి సంతకం) వినూత్న పాలనతో చెరగని ముద్ర.. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాది కాలంలోనే వినూత్నమైన పాలనతో ప్రజల్లో సీఎం జగన్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. సీఎం జగన్ చేస్తోన్న సుపరిపాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఓర్వలేకపోతున్నారని.. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికుట్రలు చేసినా సీఎం జగన్ సంకల్పాన్ని టీడీపీ అడ్డుకోలేదన్నారు. (ఏడాదిలో ఎన్నో సంచలన నిర్ణయాలు) టీడీపీ నేతలకు సవాల్.. పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సీఎం జగన్ నిధులు కూడా కేటాయించారని మంత్రి అవంతి తెలిపారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా మూడు రాజధానుల ప్రకటన చేశారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 80 శాతానికి పైగా సీట్లు, 50 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీ సాధించిందని పేర్కొన్నారు. విశాఖ భూ కబ్జాపై టీడీపీ నేతల ఆరోపణలను అవంతి శ్రీనివాస్ ఖండించారు. ఏడాది పాలనలో భూకబ్జా జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని.. కష్టించి పనిచేసిన కార్యకర్తలకు త్వరలోనే పదవులు ఇస్తామని ఆయన తెలిపారు. తనదైన మార్క్‌తో: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏడాది పాలనలోనే తనదైన మార్క్‌తో సీఎం జగన్ సంక్షేమ పాలన అందించారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఎప్పటికీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు
-
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఆన్లైన్ వీడియో ద్వారా వీక్షిస్తూ ఆరంభించారు. అంతకు ముందు సీఎం జగన్‌ను వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎమ్వీఎస్ నాగిరెడ్డి కండువా కప్పి అభినందనలు తెలిపారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్బీకేలో లభించే సేవలను పరిశీలించారు. (‘వైఎస్ జగన్ పాలన చరిత్రలో నిలిచిపోతుంది’) సీఎం జగన్ రైతు పక్షపాతి: మంత్రి కన్నబాబు అన్ని రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ ప్రతి హామీని నెరవేర్చారని, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకెళ్లే చర్యలు తీసుకున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినందకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతులే ఈ దేశానికి వెన్నుముక అని హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పేర్కొన్నారు. రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. (అందరూ నీలాగే మాట తప్పుతారని భావిస్తే ఎలా..?) సీఎం యాప్ ప్రారంభం, ఆల్‌ది బెస్ట్ మార్కెట్ ఇంటెలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన సీఎం యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. సీఎం యాప్ ప్రారంభం, ఆల్‌ది బెస్ట్ అంటూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ ముఖ్యమంత్రి మెసేజ్ పంచించారు. దీని ద్వారా పంటల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. కాగా రైతు భరోసా కేంద్రాల్లో ఒకేసారి 5 లక్షలమంది రైతులను ఉద్దేశించి సీఎం జగన్ లైవ్ వీడియో ద్వారా మాట్లాడుతున్నారు. అలాగే వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్ నెంబర్ 155251 ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందించనుంది. రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు తీర్చిదిద్దనున్నాయి. -
సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు: బొత్స
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌రావుతోపాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగి రమేష్‌లు పాల్గొన్నారు. ('చరిత్ర గతిని మారుస్తున్న నాయకుడు సీఎం జగన్') ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏడాది పాటు సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సంక్షేమ పాలనను మించి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నాడన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా నూటికి తొంబై అయిదు శాతం అన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ ఏడాది కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏ రాష్ట్రంలోని జరగని పరిపాలన అందించారని, దేశంలోని ఇతర రాష్ట్రాలు నేడు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పరిపాలన అందించారని ప్రశంసించారు. రాష్ట్రంలో అనాదిగా ఉన్న విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మెరుగైన పరిపాలన అందిస్తున్నారన్నారు. -
అందరూ నీలాగే మాట తప్పుతారని భావిస్తే ఎలా?
సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్ పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర పార్టీకార్యాలయం వద్ద ఘనంగా వేడుకలను నిర్వహించారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావడంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి, దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయ్యింది. రాష్ట్ర స్వరూపాన్ని సీఎం జగన్ మార్చేశారు. భావితరాలు మెచ్చే విధంగా ఏడాది పాలన సాగింది. మేనిఫెస్టోలో పెట్టిన 90శాతం హామీలను అమలు చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకాన్ని నిలబెట్టారు. చదవండి: రైతు ముంగిటకే సమస్త సేవలు సీఎం జగన్ విజన్ ఉన్న నేత. సంక్షేమం అనేది వైఎస్సార్ కుటుంబానికే సాధ్యం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా జగన్ తన ఏడాది పాలనలో ప్రజలకు అందించారు. చంద్రబాబులా ఇచ్చిన మాట తప్పడం జగన్‌కు అలవాటు లేదు. చంద్రబాబు గురించి ప్రజలు మర్చిపోయారు. సీఎంపై విమర్శలు చేసేందుకే మహానాడు పెట్టారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క తీర్మానం చేయకుండానే మహానాడును ముగించారు. జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయలేరని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. కానీ పదవి చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి చూపించారు. చంద్రబాబు తనలాగే అందరూ మాట తప్పుతారని భావిస్తాడు. కానీ జగన్ మాట ఇస్తే అమలు చేసి చూపిస్తాడు. చదవండి: ‘పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ’ కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య, వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చరిత్ర గతిని మారుస్తున్న నాయకుడు సీఎం జగన్. ఏడాది పాలన, అందించిన సంక్షేమ కార్యక్రమాలపై గత ఐదు రోజులుగా సమీక్షలు జరిపారు. నిపుణలు, లబ్ధిదారులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత అకుంఠిత దీక్షతో పాలన కొనసాగిస్తారని' సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి.. -
ఏడాదిలో ఎన్నో సంచలన నిర్ణయాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి( శనివారం) ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారాయన. యువజన శ్రామిక రైతు (వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. అన్ని రంగాలను మెరుగుపరిచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని వర్గాలకు పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు పెద్ద పీట వేశారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో పోల్చిన సీఎం జగన్.. తాను ఇచ్చిన హామీలను ఇప్పటికే 90 శాతం అమలు చేయడంతో ఏపీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
సీఎం జగన్ విజన్ ఉన్న నేత
-
సుభిక్షమే లక్ష్యం!
-
ఇంతలో ఎన్నెన్ని వింతలో..
జనంతో మమేకమై వారి కష్టాలను దగ్గరగా చూసినవాడు నేను విన్నాను.. నేను ఉన్నాను అని ధైర్యం చెప్పినవాడు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో 90 శాతం పనులు చేసి చూపెట్టాడు. అడిగినవే కాక అడగనివీ.. చెప్పినవే కాక చెప్పనివీ అమలు చేస్తున్నాడు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాడు. అన్నదాత గుండె చప్పుడు విన్నాడు.. ‘భరోసా’ కల్పించాడు. సామాన్యులకు సైతం అత్యున్నత విద్య, వైద్యం అందాలని తపించాడు. అందుకు అరుదైన పథకాలెన్నో ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు నాలుగేళ్లు దోచుకొని ఆఖరి సంవత్సరం వరాలు కురిపించే కాలంలో.. తొలి ఏడాదే స్వర్గం చూపించాడు.. ఇంకా ఏం కావాలో చెప్పమంటున్నాడు. మన పాలనపై మీ సూచన చేస్తే భవిష్యత్తు బంగారం చేస్తానంటున్నాడు. ప్రజల సమక్షంలో తన పనితీరును తానే సమీక్షించుకోవాలంటే ఎంతటి ధీశక్తి ఉండాలి.. ఎంతటి అంకితభావం కావాలి.. మాట తప్పని మడమ తిప్పని నైజం ఉంటేనే అది సాధ్యం. అందుకే మదిమదిలో ఆ ప్రియతమ నేతకు నీరాజనం శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రైతు రారాజును చేయాలి... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమిది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. పంటచేతికి వస్తే ఎలా అమ్ముకోవాలనే చింత లే కుండా నేరుగా రైతు వద్దకే కొనుగోలుదారులు వెళ్లి మద్దతు ధర చెల్లించి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అకాల వర్షాలు వచ్చి పంటనష్టపొతే దాని నుంచి ఉపశమనం పొందేందుకు విపత్తు నిధి ఏర్పాటు చేశారు. ఎరువుల నుంచి కొనుగోలు వరకు అన్నీ సదుపాయాలు అందేలా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. గత ఏడాది 2019–20లలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.5లక్షల హెక్టార్లు. ఆ సీజన్‌కుగాను జిల్లాలో 1.21లక్షల రైతులకు గాను విత్తనాలు 67,248 క్వింటాళ్లు పంపిణీ చేశారు. సబ్సిడీ విలువ రూ.9.07కోట్లుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 2020–2021కి గాను ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.13లక్షల హెక్టార్లలో వరి సాగుకి సిద్ధం చేశారు. దీనికి 79200 క్వింటాళ్ల విత్తనాలను గ్రామ సచివాలయాల పరిధిలో అందుబాటులో ఉంచారు. దీనికి క్వింటాకు రూ.1000 సబ్సిడీగా అందించారు. (చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..) ఆనందాల తీరం వజ్రపుకొత్తూరు: జిల్లా తీరం ఇక సిరులమయం కానుంది. ముఖ్యమంత్రి జగన్ ఫిష్ ల్యాండింగ్ కేంద్రానికి రూ.11.95 కోట్లు వెచ్చించి శంకుస్థాపన చేయగా ఇటీవల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలేంలో రూ.332.9 కోట్లతో మినీ ఫిషింగ్ హిర్బర్కు నిధులు కేటాయించారు. దీంతో జిల్లా మత్స్యకారుల్లో ఆనందం రెట్టిస్తోంది. ఈ రెండు నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో మత్స్యకారులు ఇక వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు–మంచినీళ్లపేట మధ్య 13 ఎకరాల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల భూమి పూజ సైతం చేపట్టారు. పలాస ఎమ్మె ల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు సొంత మండలం కావడం ఆయన మత్స్యకార సామాజిక వర్గం చెందిన వ్యక్తి కావడంతో ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి పరిపాలనా అనుమతులు సాధించారు. (విశాఖపై రాజముద్ర..) దీంతో మంచినీళ్లపేట వద్ద మండలానికి చెందిన 5వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరనుంది. భవిష్యత్‌లో ఇది ఫిషింగ్ హార్బర్‌గా కూడా కార్యరూపం దాల్చేందుకు ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. పారాదీప్ నుంచి విశాఖ వరకు ఎక్కడా హార్బర్ సదుపాయం లేదు. ఆ సమస్య కూడా తీరనుంది. ఎచ్చెర్ల మండగలం బుడగట్లపాలేం వద్ద 37.50 ఎకరాల్లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.332.9 కోట్లు కేటాయించింది. మరో పక్కకవిటి మండలం ఇద్దివానిపాలేం, సోంపేట మండలం బారువ కొత్తూరు, కవిటి మండలం ఇద్దివానిపాలేం, ఎచ్చెర్ల మండలం రొళ్లపేట వద్ద సై తం మినీ జెట్టీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు, సర్వేలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు కార్యరూపం దాల్చితే మ త్స్యకారుల బతుకులకు భరోసా దొరికినట్టే. బుడగట్లపాలేంలో అత్యాధునిక కోల్ట్ స్టోరేజీ, ఇస్ ప్లాంట్‌తో పాటు బెర్తింగ్ సౌకర్యం, డీప్ ఫిషింగ్ చేపట్టేందుకు అనువుగా తీర్చిదిద్దుతామని మత్స్యశాఖ అధికారులు శ్రీనివాసరావు, సత్యన్నారాయణలు చెప్పారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం ఫిష్‌ల్యాండింగ్ కేంద్రం నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. జెట్టీ అవసరాన్ని, మత్స్యకారుల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించాం. జగన్‌కు మత్స్యకారులంటే అమితమైన ప్రేమా భిమానాలు ఉన్నాయి. దశలవారీగా ఫిష్‌ల్యాండింగ్ కేంద్రంను హార్బర్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన హామీ ఇచ్చారు. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే, పలాస నియోజకవర్గం గతంలో చూడలేదు గతంలో ఎన్నడూ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. మత్స్యకారుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తెచ్చారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రం మాకు వరం వంటిది. అటు ఒంకులూరు తీరం నుంచి ఇటు భావనపాడు వరకు ఎంతో మంది మత్స్యకారులకు ఇది అనుకూలం. ఇక నుంచి ఇసుక దిబ్బలపై చేపలను ఆరబెట్టుకునే దుస్థితి ఉండదు. వర్షం వస్తే ఆరబెట్టే చేపలు తడిసి పోతాయన్న భయం ఉండదు. నిధులు మంజూరు చేసి సీఎం జగన్, ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులకు రుణపడి ఉంటాం. – జి.రామయ్య, మత్స్యకారుడు మంచినీళ్లపేట వ్యవసాయం: రైతు భరోసా.. పీఎం కిసాన్ సాయం జిల్లాలో 2019–20లలో రైతుభరోసా, పీఎం కిసాన్ పథకం కింద 3.34 లక్షల మందికి గాను మొత్తం రూ 450.98 కోట్లు రైతుల ఖాతాలో జమచేశారు. 2020–2021 కింద మొదటి విడతగా 3.64లక్షల మంది రైతులకుగాను రూ 272.94కోట్లు జమ చేశారు. ఈ పథకానికి భూ యజమానులు, కౌలురైతులు, గిరిజన రైతులు వంటి వారందరికి క్రాప్ కల్టివేషన్ సరి్టఫికెట్ ఉన్నవారందరికీ ఈ పథకం వర్తించేలా ప్రణాళిక వేశారు. వైఎస్సార్ ఉచిత బీమా జిల్లాలో 2019–20లో ఈ పథకం కింద రుణాలు తీసుకున్న, తీసుకోని రైతులకు మొత్తం 4.10 లక్షల మందికి గాను రూ.1323.65కోట్లు పంటల బీమా కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాయి. సచివాలయ ఉద్యోగాలు వ్యవసాయశాఖలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్) మొత్తం 676 ఉద్యోగాలు అందించారు. ఆర్బీకేలు ప్రారంభం రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సలహాలు సూచనలు వంటి అన్ని రకాల సేవలను రైతుభరోసా కేంద్రాల నుంచి అందించేందుకు గాను యుద్ధ ప్రాతిపదికన ఈ నెల 30న మొదటి విడతగా 820 రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ జిల్లాలో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున మొత్తం 9 అగ్రిల్యాబ్స్‌ను, ఒక్కటి కేంద్ర అగ్రిల్యాబ్ కింద జిల్లా కేంద్రం అంపోలులో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లలో విత్తనాలు, ఎరువుల నాణ్యతను, భూసార ప రీక్షలు చేసేందుకుగాను నాణ్యత పరీక్షలు చేస్తారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తి చేసి రోడ్లు, భవనాల శాఖలో ఇంజినీరింగ్ విభాగానికి నిర్మాణ పనులు అప్పగించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సముద్రమంత ప్రేమ అరసవల్లి: గంగపుత్రుల బెంగను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్థం చేసుకున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి మత్స్యకారులపై సముద్రమంత ప్రేమను చూపిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు మత్స్య సంపద ఉత్పత్తి కోసం వేట నిషేధ సమయంగా ప్ర భుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ విరామ సమయంలో మత్స్యకారులకు విరామ భృతి కింద ఏకంగా రూ.10 వేలు వారి అకౌంట్స్‌లో ఈనెల 6వ తేదీనే జమ చేసింది జగన్ ప్రభుత్వం. ఇదే సమయంలో గత ప్రభుత్వం కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేది. అది కూడా రెండేళ్లకో మూడేళ్లకో ఇచ్చే పరిస్థితులుండేవి. వీటిని పూర్తిగా మార్చేస్తూ వేట విరామ సమయంలోనే ఆ మొత్తాన్ని జమ అయ్యేలా చేసి గంగ పుత్రుల ఆకలి తీర్చారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి సొంత అకౌంట్స్‌లో రూ. 10 వేలు జమ చేశారు. జిల్లాలో ఈ మేరకు 14289 మంది మత్స్యకారులను గుర్తించి వీరి కోసం రూ.14.28 కోట్ల నిధులను కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 9 జిల్లాలకు చెందిన 1.12 లక్షల మంది మత్స్యకారులకు ఈ రకంగా భృతి అందజేశారు. శాశ్వత ఉపాధి కోసం హార్బర్లు దేశంలో అన్ని ప్రాంతాల కంటే మన జిల్లా నుంచే అధిక శాతం మంది మత్స్యకారులు వలసలు వెళ్తూ ఉపాధి పొందుతున్నారు. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో జిల్లాకు చెందిన వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. కరోనా పరిస్థితుల్లో వీరావల్, మంగళూర్, చెన్నై నుంచి సుమారు 6 వేల మంది మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చి క్వారంటైన్లో పెట్టింది. ఈ పరిస్థితులను చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్రంగా పరిగణించి ఇక మీదట జిల్లా నుంచి వలసలు వెళ్లకుండా ఉండేందుకు జిల్లాలోనే పలు చోట్ల ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల ని ర్మాణానికి చర్యలు చేపట్టారు. అలాగే ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో భావనపాడులో పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో జెట్టీ నిర్మాణానికి రూ.11.95 కోట్ల నిధులను కేటాయిస్తూ సీఎం స్వయంగా శంకుస్థాపన చేశారు. తాజా నిర్ణయాల ప్రకారం కవిటి మండలం ఇద్దువానిపాలెంలో రూ. 12 కోట్లతో మరో జెట్టీ నిర్మాణాలతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో రూ.332 కోట్లతో షిషింగ్ హార్బర్, డి.మత్స్సలేశం (రాళ్లపేట)లో రూ.21.92 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ కేంద్రం నిర్మాణానికి నిధులు కేటాయించారు. దీంతో మత్స్యకారుల జీవన ముఖచిత్రాలే పూర్తిగా మారిపోనున్నాయి. ఎక్కడ ఉంటే అక్కడికే పింఛన్ శ్రీకాకుళం పాతబస్టాండ్, నరసన్నపేట: పింఛన్ పంపిణీ అర్థాన్ని పూర్తిగా మార్చేసిన ఏడాది ఇదే. గంటల తరబడి క్యూలో ఉండడం వంటి బాధలను లబి్ధదారులు పూర్తిగా మర్చిపోయారు. 2019 ఏ ప్రిల్‌లో ఎన్టీఆర్ పింఛను పథకం కింద 3,50,268 మంది పింఛన్‌దారులకు రూ.74.49 కోట్లు జిల్లాకు అందజేయగా ప్రస్తుతం పింఛన్‌దారుల సంఖ్య 3,65,334 మందికి పెరిగింది. వీరికి ప్రస్తుతం రూ.87.38 కోట్లు అందిస్తున్నారు. పింఛన్ మొ త్తాన్ని కూడా రూ.2250కు పెంచారు. కిడ్నీ రోగులకు రూ. 10 వేలు అందజేశారు. అలాగే దీర్ఘకాలిక రో గులకు కూడా రూ.10,000 పింఛను అందజేసే కా ర్యక్రమాన్ని తీసుకువచ్చారు. వృద్ధాప్య పింఛన్ వ యో పరిమితిని 60 ఏళ్లకు కుదించారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ అందుకోలేకపోయిన అభాగ్యులను ఆదుకున్నారు. అన్నింటికీ మించి వలంటీర్ల ద్వా రా ఉన్న చోటకే పింఛన్ వచ్చేలా చేసి ప్రశంసలు అందుకున్నారు. అభాగ్యులకు అండగా ఇచ్ఛాపురం రూరల్: మీ కష్టాలను చూశాను. మీ బాధలను విన్నాను, మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ప్రతిపక్ష నేత హో దాలో ప్రతిజ్ఞ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసి ఆదుకున్నారు. మొత్తం 12 రకాల పింఛన్లు జి ల్లాలో అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛను: ఆధార్ కార్డు ప్ర కారం తెలుపు కార్డుదారులై ఉండి, దారిద్య్ర రేఖ కు దిగువ ఉండి, వయస్సు 60 ఏళ్లు నిండిన వారందరూ ఈ పింఛన్‌కు అర్హులే. ప్రస్తు తం నెలకు రూ.2,250 ఇస్తున్నారు, రెండో విడతగా రూ.250, మూడో విడతగా రూ.250, నాల్గో విడతగా రూ.250లు పెంచుకుంటూ చివరకు రూ.3 వేలు ఇస్తారు. ప్రస్తుతం జిల్లాలో 166721 మంది లబి్ధదారులకు రూ.3888.77 లక్షలు అందుతున్నాయి. దివ్యాంగులకు: వయసుతో సంబంధం లేకుండా 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లు సదరన్‌లో ప్రభుత్వ వైద్యశాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం స మరి్పంచాలి. ప్రస్తుతం నెల కు రూ.3వేలు పింఛను ప్ర భుత్వం అందిస్తోంది. జి ల్లాలో 34015 మంది లబి్ధదారులు ఉండగా, రూ.1077.17 లక్షలు అందుతున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు: మూత్రపిండాల వ్యాధి బారిన పడిన రోగులు, క్రమం తప్పకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చికత్స చేయించుకుంటున్న వారు ఈ పింఛన్ పొందడానికి అర్హులు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పింఛన్ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిస్తే ప్రతి నెల రూ.10వేలు చొప్పున వ్యాధి గ్రస్తునికి ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ చికిత్స సెంటర్లకు చెందిన వారికి మంజూరైన పింఛన్ సొ మ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు, ప్రైవేటు ఆస్పత్రిలోని డయాలసిస్ చికిత్స కేంద్రాలకు చెందిన వారికి మంజూరైన పింఛన్ సొమ్ము వైఎస్సార్ పింఛన్ కానుకలతో పాటు ప్రతి నెలా అధికారుల చేత లబ్ధిదారుల ఆధార్ ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. ప్ర స్తుతం జిల్లాలో 613 మంది ఈ పింఛన్‌ను తీసుకుంటుండగా, ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి వారి మందులకు ప్రతి నెల అయ్యే ఖర్చు రూపంలో ప్రభుత్వం జిల్లాలో 406 మందిని గుర్తించి వారికి ప్రతి నెల రూ.5000 చొప్పున్న పింఛన్ సొమ్మును అందిస్తోంది. చేనేత పింఛన్: ఆధార్ కార్డు ప్ర కారం వయస్సు 50 ఏళ్లు నిండాలి. చేనేత వృత్తి చేస్తూ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ శాఖ అధికారుల నుంచి చేనేత వృత్తి పనివారిగా ధ్రువీకరణ పత్రం తేవాలి. ఈ పింఛనుకు కులాలతో పనిలేదు. ప్రస్తుతం జిల్లాలో 5246 మంది లబి్ధదారులకు 126.48 లక్షలు అందిస్తోంది. కల్లుగీత పింఛన్: ఆధార్ కార్డు ప్రకారం వయస్సు 50 ఏళ్లు నిండినవారై ఉండాలి. కల్లుగీత వృత్తిలో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ నుంచి «ధ్రువీకరణ పత్రం పొందాలి. 1366 మంది లబి్ధదారులు ఉండగా, వారికి రూ.31.79 లక్షలు ప్రతి నెలా అందుతున్నాయి. మత్స్యకార పింఛన్, వేట నిషేధ భృతి: ఆధార్ కార్డు ప్రకా రం 50 ఏళ్ల వయ స్సు నిండాలి. మత్స్యకార వృత్తి చేస్తూ చేపలు పట్టడానికి లైసెన్స్ లేక మత్స్యశాఖ నుండి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. కులాలతో సంబంధం లేదు. సముద్ర, భూభాగ మత్స్యకారులై ఉండాలి. జిల్లాలో 6069 మంది మత్స్యకారులకు 149.60 లక్షలు ఇస్తుండగా, ఏటా ఏప్రిల్, మే నెలలో వేట నిషేధిస్తుండటంతో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.10,000 చొప్పున ప్రభుత్వం వేట నిషేధ భృతిని అందిస్తోంది. జిల్లాలో 14,289 మంది మత్స్యకారులకు ప్రభుత్వం రూ.142.890లక్షలు చెల్లిస్తోంది. వితంతువులకు : ఆధార్ కార్డు ప్రకారం వయస్సు 18 ఏళ్లు నిండి భర్త మృతి చెందిన మహిళలు ఈ పింఛన్ పొందడానికి అర్హులు. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమరి్పంచాలి. జిల్లాలో 125438 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.2979.77 లక్షలు అందిస్తోంది. ఒంటరి మహిళలకు: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వయస్సు ఆధార్ కార్డు ప్రకారం 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 35 ఏళ్లు నిండినవారు ఈ పింఛనుకు అర్హులు. భర్త నుంచి విడాకులు పొందిన వారు, భర్తతో ఏడాది పాటు ఎడబాటుగా ఉన్న ఒంటరి మహిళలు, 30 ఏళ్లు దాటినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న వారు ఈ పింఛన్ పొందడానికి అర్హులు. ఒంటరి మహిళా «ధ్రువీకరణ పత్రాన్ని తహసీల్దార్ చేత పొంది జతచేయాలి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 10364 మంది లబి్ధదారులకు రూ.248.87 లక్షలు అందిస్తోంది. హిజ్రాలకు: ఆధార్ కార్డు ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు ఈ పింఛన్లకు అర్హులు. నెలకు రూ.3వేలు చొప్పున ఇస్తారు. తప్పని సరిగా ప్రభుత్వ మెడికల్ బోర్డు నుంచి హిజ్రా అనే ధ్రువీకరణ పత్రం తేవాలి. జిల్లాలో 84 మంది హిజ్రా లబ్ధిదారులు ఉండగా వారికి నెలకి 2.64లక్షలు ప్రభుత్వం అందిస్తోంది. డప్పు కళాకారులకు: ఆధార్‌కార్డు ప్రకారం 50 ఏళ్లు నిండి డప్పు కొట్టే వృత్తిలో ఉన్నవారు అర్హులు. నెలకు రూ.3 వేలు పింఛన్ రూపంలో ఇస్తారు. డప్పుకొట్టే వృత్తిలో ఉన్నట్లు సాంఘిక సంక్షేమ శాఖచే ధ్రువీకరణ పత్రం పొందాలి. తమ ఆధార్, రేషన్ కార్డు, డప్పు కళాకారుని గుర్తింపు ఫొటో, ధ్రువీకరణతో పాటు మీసేవ కేంద్రం ద్వారా పింఛన్‌కు దరఖాస్తు పంపాలి. సాంఘిక సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 1297 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం 40.56 లక్షలు అందిస్తోంది. చర్మకారులకు: చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉన్న వారికి రూ.2,250 పింఛన్ రూపంలో ఇస్తారు. ఆధార్ కార్డు ప్రకారం 50 ఏళ్లు నిండాలి. చర్మకార, చెప్పులు కుట్టుకునే వృత్తి చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వృత్తి ధ్రువీరకణ పత్రం పొంది ఉండాలి. జిల్లాలో 366 మంది చర్మకారులకు ప్రభుత్వం నెలవారీ రూ.8.91 లక్షలు అందిస్తోంది. ఎయిడ్స్ బాధితులకు: ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2,250 పింఛన్ ఇస్తున్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేటు ఏటీఆర్ సెంటర్ల ద్వారా అమలు చేస్తారు. -
విశాఖపై రాజముద్ర..
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. విశాఖ జిల్లా అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎనలేని మక్కువ. అందుకే.. జిల్లాను అగ్రగామిగా నిలపాలని.. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ.. ఎన్నో ‘మేళ్లు’ చేసేందుకు కృషి చేశారు.. చేస్తున్నారు. ఏడాది పాలనలో జిల్లాకు అనేక వరాలు అందించి.. ప్రతి ఒక్కరూ సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. మూడు రాజధానుల నిర్ణయంలో.. విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి.. అందరి దృష్టి జిల్లాపై పడేలా చేశారు. ట్రామ్ రైలు.. పోలవరం నుంచి జలాల తరలింపు.. గిరిజనుల కోసం వైద్య కళాశాల.. మత్స్యకారుల వలసల నివారణకు ఫిషింగ్ హార్బర్.. నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయం, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1300 కోట్లతో నగరాభివృద్ధి పనులు.. పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు డీశాలినేషన్ ప్లాంట్.. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాన్సెప్ట్ సిటీ.. ఒకటి కాదు.. రెండు కాదు.. అభివృద్ధి చెయ్యాలన్న తలంపు ఉంటే.. ఇలా ఉంటుందా అన్న రీతిలో జిల్లాను నభూతో నభవిష్యత్ అన్నట్లు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. (చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..) నగరానికి రాజయోగం.. 2020 జనవరి 20.. విశాఖ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. తరతరాలుగా రాజధానులకు రాదారిగా నిలిచిపోయిన విశాఖ ఇన్నేళ్లకు అసలైన రాజధానిగా అవతరించేందుకు మార్గం సుగమమైన రోజు. నాన్నకు మించిన పాలన అందిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే చెప్పడమే కాకుండా.. దాన్ని నిజం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వెలుగొందిన విశాఖ.. ఆ తర్వాత మసకబారిపోయింది. మళ్లీ.. జిల్లాకు జీవం పోస్తూ.. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా పరిపాలన రాజధానిగా పట్టం కట్టారు. 2019 డిసెంబర్ 18న శాసనసభలో సూత్రప్రాయంగా స్వయంగా ప్రకటించిన సీఎం.. అక్కడికి నెల రోజుల్లోనే మూడు రాజధానుల ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి.. వ్యవస్థలు విశాఖకు రానున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు మిన్నంటాయి. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన వ్యవస్థ ప్రారంభం కానుంది. తాగునీటికి పోలవరం.. ప్రతి వేసవిలో నగరవాసుల నీటి కష్టాలు అడుగడుగునా దర్శనమిస్తుండేవి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు పెంచకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్న విషయాన్ని గ్రహించిన సీఎం.. గోదావరి జలాలు విశాఖకు అందించాలని సంకలి్పంచారు. విశాఖ నగరానికే కాకుండా.. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలతో పాటు పాయకరావుపేట, అనకాపల్లి రూరల్ గ్రామాలకు ఈ పైప్‌లైన్ ద్వారా తాగునీటి కష్టాలు తీరనున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి నరవకు రూ.3,600 కోట్ల అంచనా వ్యయంతో రోజుకు 190 ఎంజీడీల నీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారు చెయ్యాలని సీఎం ఆదేశించడంతో జీవీఎంసీ సన్నద్ధమవుతోంది. ఈ పైప్‌లైన్ ప్రాజెక్టు పూర్తయితే.. 24 గంటలూ నగర ప్రజలకు తాగునీరు అందనుంది. పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్ ప్లాంట్ పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టుకు సీఎం రూపకల్పన చేశారు. మంచినీరు ప్రజలకు అందించి.. ఉప్పు నీటిని మంచినీటి ప్రక్రియగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియపై దృష్టి సారించారు. ఇజ్రాయిల్ దేశం మొత్తం డిశాలినేషన్ నీటిని అన్ని అవసరాలకూ వినియోగిస్తున్న నేపథ్యంలో.. పారిశ్రామిక అవసరాలకు మంచినీటిని కాకుండా డిశాలినేషన్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇజ్రాయిల్ దేశానికి చెందిన సంస్థలు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి. పరిశ్రమలకు అందించేందుకు 45 ఎంజీడీ ప్లాంట్‌ని మింది పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖలో కాన్సెప్ట్ సిటీ విశాఖపట్నం అత్యంత ప్రాధాన్యతతో కూడుతున్న జిల్లా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందుంది. ఆ మేరకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్ని తలదన్నేలా దూసుకెళ్లే నగరాల్లో విశాఖ ది బెస్ట్ అని భావించిన సీఎం.. నగరంలో కాన్సెప్ట్ సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖ శివారులో ఐటీ సంస్థల కోసం కాన్సెప్ట్ సిటీ అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 1000 నుంచి 1500 ఎకరాల్లో అన్ని అంతర్జాతీయ ప్రధాన ఐటీ సంస్థలకు కావల్సిన సమగ్ర మౌలిక సదుపాయాలు కలి్పంచేలా ఈ సిటీ రూపుదిద్దుకోనుంది. ‘ఉత్తరాంధ్ర’ ఉరకలు ఉత్తరాంధ్ర మాగాణుల్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు తరలిరానున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టుని పట్టించుకోకుండా అంచనా వ్యయం పెంచుతూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. అన్నదాతల ఆశల్ని నీరుగార్చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ హయాంలో సంకల్పించిన బాబూ జగజ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2009 ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేశారు. వైఎస్ హయాంలో రూ.7214.10 కోట్ల అంచనాలతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు వ్యయం కాస్తా టీడీపీ హయాంలో రూ.16,568 కోట్లకు చేరింది. తొలిదశ పనుల అంచనా వ్యయం నాడు రూ.801కోట్లు కాగా.. నేడు రూ.2022 కోట్లకు చేరింది. ప్రాజెక్టు ద్వారా తొలిదశలో జిల్లాలో 8 మండలాల్లో 1.39లక్షల ఎకరాలు సాగునీరు అందేలా డిజైన్ చేశారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి అడుగు వేశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణాల కోసం తొలి బడ్జెట్లోనే రూ.170.06 కోట్లు కేటాయించారు. పొరుగు జిల్లా నుంచి విశాఖకు వచ్చే జలాలు అందించే ప్రాజెక్టుల కోసం పురుషోత్తపట్నానికి రూ.300 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతలకు రూ.55 కోట్లు, తారకరామ తీర్థ సాగరానికి రూ.21 కోట్లు కేటాయించి.. పనులు పరుగులు తీసేలా చేశారు. రూ.661 కోట్లతో స్కిల్‌డెవలప్‌మెంట్ వర్సిటీ వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో ఉపాధి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విద్యార్థులు చదివిన చదువుకు తగిన ఉద్యోగాన్ని సాధించలేకపోతున్నారు. ఈ దుస్థితిని నుంచి వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విశాఖ యువతకు అందుబాటులో ఉండేలా అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో రూ.661 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అంతేకాకుండా జిల్లాలోని ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో రూ.10 కోట్లు చొప్పున మూడ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో ట్రేడ్‌కు 30 మందికి చొప్పున 12 ట్రేడ్లలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ అందనుంది. పల్లె ప్రజలకు ‘వైద్యం’ వెలుగులు అభివృద్ధికి దూరంగా విసిరేసినట్లుండే రూరల్ జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. మన్యం ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులు రావాలంటే వైద్య సదుపాయాలు కచ్చితంగా ఉండాలని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందుకే గిరిజనులకు ఆధునిక వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో పాడేరులో వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పాడేరు ఏరియా ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తూ.. అందులోనే అదనపు భవనాలు నిర్మించి.. మెడికల్ కాలేజీని ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అలాగే రూరల్ జిల్లా ప్రజల కోసం అనకాపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. పుష్కర కాలం తర్వాత ‘మహా’పోరు జీవీఎంసీకి 2007లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత.. ఆ పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసిపోయింది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. వార్డుల పునరి్వభజన పేరుతో ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వార్డుల సంఖ్యని 98కి పెంచుతూ సరిహద్దుల విభజన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం చేసింది. మార్చి 9న ఎన్నికల నగరా మోగించింది. నోటిఫికేషన్ విడుదల కావడం.. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడం.. చకచకా సాగుతున్న తరుణంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. పట్టాల్లేని ట్రామ్ మెట్రో వ్యవస్థకు శ్రీకారం విశాఖ నగరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నగరం, జిల్లా ఎలా అభివృద్ధి చెయ్యాలనే అంశంపై నిరంతరం ఆలోచన చేస్తున్నారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు ఎన్నాళ్ల నుంచో నలుగుతున్నా.. ముందుకు వెళ్లలేదు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. మిగిలిన చోట్లలా కాకుండా.. విశాఖలో మెట్రోకు అంతర్జాతీయ లుక్ రావాలన్న కాంక్షతో.. ట్రామ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 10 దశల్లో 10 కారిడార్లుగా మొత్తం మార్గం 140.13 కిలోమీటర్లు వరకూ మెట్రో సౌకర్యాన్ని నగర ప్రజలకు అందించనున్నారు. గంగపుత్రుల సంక్షేమమే లక్ష్యంగా.. 139 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నా.. సౌకర్యాలు లేకపోవడంతో.. జిల్లాలోని మత్స్యకారులు వలసలు వెళ్లిపోతున్నారు. ఈ వలసలు నివారించేందుకు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అచ్యుతాపురం మండలం పూడిమడిక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ ఏర్పాటు చేయాలన్న కలని నెరవేరుస్తూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ మేరకు కేంద్ర నిధులతో సంయుక్తంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన వాప్కాస్(వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సరీ్వసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. భీమిలిలో ఫిష్‌ల్యాండ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. -
లాయర్లకు న్యాయం లా నేస్తం
-
అన్ని వర్గాలకు బాసటగా నిలిచిన సర్కారు
-
తొలి ఏడాదిలోనే 90 శాతం అమలు
-
రైతు ముంగిటకే సమస్త సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం నేడు (శనివారం, మే 30) శ్రీకారం చుడుతోంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకకాలంలో 10,641 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) శనివారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఆన్లైన్ వీడియో ద్వారా వీక్షిస్తూ వీటిని ప్రారంభించనున్నారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్బీకేలో లభించే సేవలను పరిశీలిస్తారు. ప్రభుత్వం తాజాగా ఆవిష్కరించనున్న ఈ వ్యవస్థను రెండో హరిత విప్లవంగా వ్యవసాయ రంగ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. ఆర్బీకేల ప్రారంభ ప్రక్రియ ఇలా ► రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని సన్నాహాలు చేసింది. ► 13 జిల్లాల నుండి 13 ఆర్బీకేలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి రైతులతో మాట్లాడతారు. ► జిల్లా కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు పాల్గొంటారు. ► వ్యవసాయ, అనుబంధ శాఖల రైతుల కోసం పెట్టిన సమీకృత కాల్ సెంటర్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారు. తొలి కాల్ చేసి మాట్లాడతారు. ► వ్యవసాయ, అనుబంధ శాఖలు ప్రచురించిన కరపత్రాలు, పోస్టర్లు, చిరు పుస్తకాలు, వీడియోలు, డిజిటల్ సామాగ్రిని ఆవిష్కరిస్తారు. సాగుకు సంబంధించిన ఈ సమాచారం అంతా ఆర్బీకేలలోని లైబ్రరీలలో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ► రైతు భరోసా కేంద్రాల్లో ప్రధాన పాత్ర పోషించే కియోస్క్ నుంచి ఎవరైనా ఒక రైతు కోసం సీఎం స్వయంగా తొలి ఆర్డర్‌ను నమోదు చేసి సమీపంలోని హబ్‌కు వెళ్లిందో, లేదో పరిశీలిస్తారు. మార్కెటింగ్ శాఖ తయారు చేసిన సీఎం యాప్‌ను ప్రారంభిస్తారు. కర్నూలు జిల్లా పాండురంగపురంలోని ఆర్బీకేలో లభించే సేవలను పరిశీలిస్తారు. ► ఉద్యాన శాఖ– వివిధ అంశాలపై రూపొందించిన– ఆరు రకాల పోస్టర్లను సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రదర్శిస్తారు. ► రాజన్న పశు వైద్యం పేరిట పశు సంవర్థక శాఖ రూపొందించిన పోస్టర్, పశు విజ్ఞాన బడి పుస్తకం, పశువుల ఆరోగ్య సంరక్షణ కార్డులను ఆవిష్కరిస్తారు. గ్రామ సచివాలయాల సమీపంలోనే సమగ్ర వ్యవసాయ కేంద్రాలుగా ఉండే రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల సమీపంలోనే ఉంటాయి. స్థలం దొరకనిచోట అద్దెకు తీసుకున్నారు. కొత్త భవనాలకు ఒక్కో భవనానికి 22 లక్షలు చొప్పున దాదాపు 10, 000 భవనాలకు రూ.2200 కోట్లు ఉపాధి హామీ పథకం నుంచి మంజూరు అయ్యాయి. అంతేకాకుండా 10, 461 ఆర్బీకేలు, 65 హబ్స్, భవనాల మరమ్మతులు, బ్రాండింగ్, అందుకు అవసరమైన సదుపాయాలు, కియోస్క్‌లు, టీవీలు, ఫర్నిచర్, శిక్షణ పరికరాలు ఇంటర్నెట్ ఇతరత్రా అవసరాల కోసం మరో రూ.267 కోట్లకు పైగా వ్యయం చేసినట్టు అంచనా. -
అపర సంజీవని
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీతో దేవుడిలా ఆదుకు న్నారు... డబ్బులేక విలవిల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించి ప్రాణభిక్ష పెట్టారు. చికిత్స అనంతరం ఇంటికే పెన్షన్లు కూడా పంపిస్తున్నారు. మా బిడ్డలను అనాథలు కాకుండా ఆదుకున్నారు. మీ మేలు జన్మజన్మలకూ మర వలేం... ఇదీ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఆనందం. ‘మన పాలన – మీ సూచన’లో భాగంగా వైద్య ఆరోగ్య రంగంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం మేధోమథన సదస్సు అనంతరం లబ్ధిదారులు, వైద్య నిపు ణులతో ముఖాముఖి నిర్వహించారు. మీకు మాత్రమే సాధ్యం... నాకు ముగ్గురు ఆడ పిల్లలు. డిసెంబరు 14వ తేదీన గుండెనొప్పి రావ డంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకున్నా. డిశ్చార్జ్ అయిన మరుక్షణమే వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.9,500 అందాయి. ఇలాంటి పథకాలు మీకు (సీఎం జగన్) మాత్రమే సాధ్యం. – ఎం. రామ్మోహన్ రెడ్డి, వేంపల్లె, వైఎస్సార్ జిల్లా థాంక్యూ మామయ్యా.. నాకు కళ్లు సరిగ్గా కనిపిం చేవి కావు. స్కూల్లో కంటి పరీక్షలు చేసి పొర ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీలో నా కంటికి ఉచితంగా ఆపరే షన్ చేశారు. ఇప్పుడు నేను బాగా చూస్తున్నాను. జగన్ మామయ్యకు థాంక్స్. – కె.మహేంద్ర, పాలచర్ల, 4వ తరగతి చిన్నారులకు కంటి వెలుగు... రాష్ట్రంలో 70 లక్షల మంది స్కూలు పిల్లలకు తొలివిడత కంటివెలుగులో 10 రోజుల్లోనే స్క్రీనింగ్ పరీక్షలు చేయడం గొప్ప విషయం. 1.58 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మూడో దశ కంటివెలుగులో అవ్వాతాత స్కీంలో 3 లక్షల మంది లబ్ధిదార్లను నాలుగు వారాల్లోపే పరీక్షించి 15 రోజుల్లోనే 6 వేల శస్త్రచికిత్సలు నిర్వహించాం. 97 మంది పిల్లలకు కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరం కాగా చాలామందికి ఇప్పటికే శస్త్రచికిత్సలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతిక భాగస్వామిగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆప్తాల్మిస్టులకు, ఆశావర్కర్లకు శిక్షణనివ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. – డాక్టర్ అరవింద్ రాయ్, కంటి వైద్య నిపుణులు, విజయవాడ అనాథలు కాకుండా ఆదుకుంది ఆరోగ్యశ్రీ ద్వారా భీమ వరంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా. మా పిల్లలు అనాధలవుతారని భయపడిన సమయంలో మీరిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డే ఆదుకుంది. చాలా సంతోషంగా ఉంది. – జే.నాగరాజు, ఆకివీడు దేశానికే దారి చూపుతుంది మీరు (సీఎం జగన్) కోవిడ్ –19 సమస్యను చక్కగా విశ్లేషించారు. ఇ ప్పుడు ప్రపంచం మొత్తం దీన్ని అనుసరి స్తోంది. తిరుపతిలో సెంటర్ ఫర్ ఎక్సెలెన్సీ ఇన్ వైరాలజీని ఏర్పాటు చేయాలి. ఇది వైరల్ సమస్యలకు పరిష్కారం చూపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ముందడుగు వేస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. – ప్రొఫెసర్ బీ జే రావు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , డీన్, తిరుపతి వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి దీనిపై చర్చిస్తారని సీఎం జగన్ తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అందుతోంది.. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద మా చిన్న పాపకు నెలంతా పాలు, గుడ్లు, బాలామృతం ఇస్తున్నారు. మా పెద్దపాపకు పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. సాయంత్రం స్నాక్స్ కింద బాలామృతంతో తయారు చేసిన లడ్డు, పాయసం ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. 50 శాతం రిజర్వేషన్లు తెచ్చినందుకు ప్రతి మహిళా తరపున మీకు కృతజ్ఞతలు. – లక్ష్మీ తిరుపతమ్మ, ఎర్రగుంట పల్లె గ్రామం. చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా సమాచార లోపాన్ని సరిదిద్దాలి... దివంగత వైఎస్సార్ కృషితో చిత్తూరులో ఏర్పాటైన ‘సీఎంసీ’ 140 పడకలతో అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను కలిగి ఉంది. రోజుకు కనీసం 700 మంది ఔట్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం. 104 సిబ్బంది పీహెచ్సీ డాక్టర్లతో కలిసి బృందంగా పనిచేస్తే బాగుంటుంది. చాలా పథకాలు విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం సరైన సమాచార వ్యవస్థ లేకపోవడం. ఎలక్ట్రానిక్ సిస్టంను వాడుకుని దీన్ని మనం మెరుగుపర్చుకోవచ్చు. 1990లో తమిళనాడు మందుల కొనుగోలు, పంపిణీపై మంచి విధానాన్ని అమలు చేసింది. తద్వారా డబ్బుల ఆదాతో పాటు నాణ్యమైన ఔషధాలు అందించవచ్చు. సామాజిక అవగాహనలో భాగంగా విద్యార్ధులు మూడు వారాల పాటు గ్రామాల్లో ఉండేలా మేం కార్యక్రమాలను రూపొందించాం. – డాక్టర్ అబ్రహం జోసెఫ్, సీఎంసీ వెల్లూరు దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ దీనిపై మీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి మీతో చర్చిస్తారని చెప్పారు. రెండుసార్లు ఆదుకున్న ఆరోగ్యశ్రీ మా ఆయన చనిపోవ డంతో ఇద్దరు పిల్లలను నేనే పోషిస్తున్నా. సొంత ఇల్లు కూడా లేదు. 2018లో నాకు కేన్సర్ సోకడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేశారు. అయితే 7 నెలలకు మళ్లీ రావడంతో మరోసారి ఆరోగ్యశ్రీ ఆదు కుంది. కీమోథెరపీ చేస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి. కేన్సర్ పేషెంట్లకు పింఛన్ లేదంటు న్నారు. మాక్కూడా పింఛన్ ఇప్పించాలి. – షేక్ గౌసియా, నెల్లూరు జిల్లా దీనిపై స్పందించిన సీఎం జగన్.. మీరు చెప్పిన దానిపై ఆలోచన చేద్దామని హామీ ఇచ్చారు. నా పెద్దబిడ్డ ప్రాణం పోశాడు... నాకు గుండె జబ్బు ఉంది. రూ.5 లక్షలు ఖర్చవు తుందన్నారు. విశాఖ ఇండస్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. నా పెద్దబ్బాయే (సీఎం జగన్) ఆపరేషన్ చేయించాడని భావిస్తున్నా. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా నా కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. – మృత్యుంజయరావు, సాలూరు, విజయనగరం అద్భుతమైన నిర్ణయం.. కాక్లియర్ ఇంప్లాంట్ కార్యక్రమాన్ని వైఎస్సార్ ప్రవేశపెట్టినప్పుడు దేశంలోని ఈఎన్టీ డాక్టర్లంతా నమ్మలేకపో యారు. ఇప్పటివరకు సుమారు 2 వేల మందికి మేలు చేశారు. మరో అద్భుతం ఏమిటంటే దీన్ని కాక్లియర్ ఇంప్లాంట్‌ను రెండు చెవులకు వర్తింపచేయాలని మీరు నిర్ణయించడం. దేశమంతా దీన్ని అనుసరిస్తుంది. – డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు, ఈఎన్టి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, గుంటూరు ప్రజల్లోకి పథకాలు ఏఎన్ఎంగా మీరు ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. కరోనా వల్ల టెలిమెడిసిన్ ద్వారా మందులు ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నాం. గతంలో పది వేల మందికి ఒక ఏఎన్ఎం సర్వే చేయగా గ్రామ సచివాలయాల ద్వారా రెండు వేల మంది జనాభాకి సర్వే చేస్తున్నాం. – లత, పెనమలూరు, కృష్ణా జిల్లా లక్షలు ఖరీదు చేసే మిషన్ ఉచితంగానే... వినికిడి సమస్యకు వైద్య పరీక్షలు, ఆపరేషన్ ఉచి తంగా చేశారు. రూ.లక్షలు ఖర్చయ్యే మిషన్ కూడా ఉచితంగా ఇచ్చారు. అంతే కాకుండా ఒక సంవత్సరం స్పీచ్ థెరపీ ఫ్రీగానే ఇస్తున్నారు. ఒక్క పైసా కూడా మాకు ఖర్చు కాలేదు. – పఠాన్ ఆరీఫ్ ఖాన్, ఆరోగ్యశ్రీ (కాక్లియర్ ఇంప్లాంట్) లబ్ధిదారుడు, గుంటూరు మధ్యాహ్నానికే చెక్కు వచ్చేది... రాష్ట్రంలో తలసేమియా రోగులు 1,500 మంది, హీమోఫిలియా రోగులు 1,500 మంది ఉన్నారు. వీరంతా వైఎస్సార్‌ను తలుచుకుంటారు. ఎందుకంటే.. నిమ్స్ ఆసుపత్రిలో మేం పొద్దున్న చికిత్స విధానాన్ని రాస్తే 11 గంటలకల్లా చెక్కు అందేది. అది రూ.30 వేలైనా, 40 వేలైనా సీఎంవో నుంచి ఇచ్చేవాళ్లు. ఆరోగ్యశ్రీ వచ్చాక తలసేమియా, హీమోఫిలియా బాధితులను చికిత్స పరిధిలోకి తెచ్చారు. మీరు వచ్చిన తర్వాత వారికి పింఛన్ కూడా ఇచ్చారు. – డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్, తలసేమియా నిపుణులు -
‘ఆరోగ్య’ అభయం
నాకే కాదు.. ప్రధాని స్థానంలో ఉన్న వారికి బాగా లేకున్నా మన ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే మంచి మందులు దొరుకుతాయని గర్వంగా చెబుతున్నా. పేదలు అప్పుల పాలయ్యే పరిíస్థితి రెండు సందర్భాల్లో వస్తుంది., ఒకటి అనారోగ్యం కాగా.. రెండోది పిల్లల ఫీజులు. అందుకే దివంగత వైఎస్సార్ ఈ రెండిటికీ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆయన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరకడంతో పిల్లలు చనిపోయారు. సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో డాక్టర్లు ఆపరేషన్లు చేశారు. అంత దారుణమైన స్థితిలో ఆస్పత్రులు పని చేశాయి. వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల్లో కాంట్రాక్టుల రూపంలో డబ్బులిచ్చినా సేవలు మాత్రం అందలేదు. ఆ పరిస్థితిని మార్చాలని నిర్ణయం తీసుకున్నాం – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చికల్లా రూ.2,600 కోట్ల వ్యయంతో 13,000కిపైగా గ్రామ, వార్డు వైఎస్సార్ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు 9712 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది నియామకం చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 బోధనాస్పత్రులకు తోడు కొత్తగా 16 టీచింగ్ ఆసుపత్రులు, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు, అవ్వా తాతలందరికీ వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా పరీక్షలు, చికిత్సలు చేయించడం తన మనసుకు ఎంతో నచ్చిన విషయమని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తెస్తున్నామని, ఏడాదిలోనే మేనిఫెస్టోలో 90 శాతానికి పైగా అమలు చేశామని సీఎం జగన్ వివరించారు. ‘మన పాలన–మీ సూచన’లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య రంగంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. లబ్ధిదారులు, వైద్య రంగ నిపుణులతో ముఖాముఖి నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ... వైద్యరంగంపై మేధోమథన సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. సదస్సుకు హాజరైన వైద్యరంగ నిపుణులు, లబ్ధిదారులు, ఉన్నతాధికారులు ఆరోగ్యంపై అడుగులు ముందుకు.. గత ఏడాది కాలంలో వివిధ పథకాలు అమలు చేస్తూనే ఆరోగ్య రంగంలో రెండు అడుగులు ముందుకు వేశాం. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టినా ముందుకు వెళ్లాం. ఆరోగ్య రంగం అనగానే గతంలో 108, 104 సర్వీసులు, కుయ్ కుయ్ శబ్దం వినిపించేది. అప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది నాన్న వైఎస్సార్. బహుశా ఆయన గుర్తుకొస్తారనే గత పాలకులు నిర్లక్ష్యం చేశారేమో. ఆరోగ్యశ్రీ విస్తరణ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి కూడా వర్తింప చేశాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 2 వేల వ్యాధులకు విస్తరిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. జూలై 8న వైఎస్సార్ పుట్టిన రోజున మరో 6 జిల్లాలకు దీన్ని విస్తరిస్తాం. మిగిలిన 6 జిల్లాల్లో దీపావళి నుంచి అమలు చేస్తాం. ఇప్పటికే 1,200 జబ్బులకు పథకం వర్తింపచేస్తున్నాం. క్యాన్సర్‌కు కూడా చికిత్స అందిస్తున్నాం. గతంలో వినికిడి లోపం ఉంటే (మూగ చెవుడు) సింగిల్ కాక్లియర్ ఆపరేషన్ చేయించాలన్నా కష్టంగా ఉండేది. పాదయాత్రలో నన్ను చాలా మంది అడిగితే సొంత ఖర్చుతో ఆపరేషన్లు చేయించా. ఇవాళ డబుల్ కాక్లియర్ ఆపరేషన్లు, బ్యాటరీతో పాటు స్పీచ్ థెరపీ కూడా పథకంలోకి తెచ్చాం. దాదాపు 132 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. రూ.682 కోట్ల బకాయిలు చెల్లించాం.. గత ప్రభుత్వ హయాంలో నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వకపోవడంతో చికిత్సకు నిరాకరిం చాయి. రూ.682 కోట్ల బకాయిలు నెట్వర్క్ ఆస్ప త్రులకు చెల్లించాం. ఫలితంగా ఇప్పుడు ఆ ఆస్ప త్రులు గౌరవంగా స్వాగతిస్తూ చికిత్సలు అందిస్తున్నాయి. బి–గ్రేడ్ ఆస్పత్రులన్నీ 6 నెలల్లో ఏ–కేటగిరీలోకి రావాలని, లేదంటే ఆరోగ్య శ్రీ పరిధి నుంచి తప్పిస్తామనడంతో సౌకర్యాలు మెరుగుపర్చుకుంటున్నాయి. రెండు వారాల్లో సర్టిఫికెట్లు.. గతంలో వికలాంగులు, అంగవైకల్యం వారికి సదరమ్ క్యాంప్‌ల్లో (వికలాంగుల కోసం) సర్టిఫికెట్ కోసం 4 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. గతంలో 57 చోట్ల సదరమ్ క్యాంప్‌లు జరగ్గా వాటిని 167కు పెంచాం. ప్రతి సీహెచ్‌సీలో సదరమ్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. రెండు, మూడు వారాల్లోనే సర్టిఫికెట్లు జారీ చేయగలుగుతున్నాం ఆస్పత్రులు–నాడు–నేడు నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తున్నాం. ఫొటోల ద్వారా తేడాను చూపిస్తాం. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం.. ఇలా ప్రజారోగ్యంపై రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. ఆపోలో ఆసుపత్రితో సమానంగా సర్కారీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తాం. విలేజ్, వార్డు క్లినిక్‌లు ప్రతి ఊరి రూపురేఖలు మార్చబోతున్నాం. 2 వేల జనాభా ఉన్న గ్రామంలో సచివాలయం, వలంటీర్ల సేవలు, ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఒక విలేజ్ క్లినిక్ ఉంటాయి. ఆ క్లినిక్‌లో ఆశా వర్కర్లు రిపోర్టు చేస్తారు. ఏఎన్ఎం నర్సు ఉంటారు. 54 రకాల మందులు ఉంటాయి. విలేజ్ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్‌గా పని చేస్తాయి. కాల్ చేసిన వెంటనే 108, 104 సర్వీసులు 20 నిమిషాల్లో చేరుకుంటాయి. దాదాపు 13 వేలకు పైగా విలేజ్ క్లినిక్‌లు, వార్డు క్లినిక్‌ల నిర్మాణానికి రూ. 2,600 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టాం. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అవి పూర్తి అవుతాయి. ఆరోగ్య కేంద్రాలు: నాడు– నేడు నాడు–నేడులో కొత్తగా 149 పీహెచ్‌సీలు నిర్మించడంతో పాటు, దాదాపు 1,138 పీహెచ్‌సీల్లో మార్పులు చేస్తున్నాం., ఇందు కోసం రూ.671 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. వాటిని కూడా మార్చి నాటికి పూర్తి చేస్తాం. 52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం కోసం రూ.695 కోట్లతో టెండర్లు, 169 సీహెచ్‌సీల రూపురేఖల మార్పు కోసం రూ.541 కోట్లతో టెండర్లను 15 రోజుల్లో పిలుస్తారు. టీచింగ్ ఆస్పత్రులు ఇప్పుడున్న 11 టీచింగ్ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం, కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తాం. రూ.12,270 కోట్ల ఖర్చుతో ఆ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తాం. 1,060 కొత్త అంబులెన్సులు.. 108, 104 సర్వీసులు కూడా మారుస్తున్నాం.. జూలై 1న విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఒకేసారి 1,060 కొత్త అంబులెన్సులను (108, 104 సర్వీసులు) జెండా ఊపి ప్రారంభిస్తాం. వైఎస్సార్ టెలి మెడిసిన్.. కోవిడ్ సమయంలో ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వైఎస్సార్ టెలి మెడిసిన్‌కు శ్రీకారం చుట్టాం. 14410 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఈ సేవల కోసం దాదాపు 300 మంది వైద్యులు పని చేస్తున్నారు. మిస్డ్ కాల్ రాగానే, సెంటర్ నుంచి తిరిగి ఫోన్ చేస్తారు. రోగి వివరాలు తెలుసుకుని వెద్యులు మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మందులను మర్నాడే రోగి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. జూలై 1 నుంచి ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్, థర్మో బ్యాగ్ కూడా సమకూరుస్తున్నాం. దీంతో రోగి ఇంటికే వెళ్లి వేగంగా మందులు ఇస్తారు. వారంలో నోటిఫికేషన్ ఆస్పత్రుల్లో మెరుగైన సేవల కోసం సిబ్బందిని నియమిస్తున్నాం. 9712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకానికి వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుంది. నెలన్నర వ్యవధిలో నియామకాలు పూర్తవుతాయి. సదస్సులో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా గతంలో చేయి విరిగితే ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తారా? అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేయడంతో పాటు విశ్రాంతి అవసరమైన సమయంలో కూడా ఆర్థిక సహాయం ఇస్తున్నాం బాధితులకు పెన్షన్లు తొమ్మిది రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్ ఇస్తున్నాం. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేలు ఇస్తున్నాం. బోదకాలు, పక్షవాతం, గుండె ఆపరేషన్, కిడ్నీ మార్పిడి, తలసేమియా, డయాలసిస్ రోగులు, హీమోఫీలియా, సికిల్‌సెల్ ఎనీ మియా బాధితులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛను వలం టీర్ల ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ చేస్తున్నాం. రెండు వారాల్లో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో 1.42 కోట్ల మందికి కార్డులు ఇవ్వా ల్సి ఉండగా ఇప్పటికే 1.33 కోట్ల మందికి ఇచ్చాం. మిగిలిన వారికి మరో 2 వారాల్లో అందజేస్తాం. కోవిడ్ వల్ల జాప్యం జరిగింది. ఆస్పత్రుల్లో ఔషధాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో మందులు తీసుకోవాలంటే భయంగా ఉండేది. గతంలో ఆస్పత్రుల్లో 230 రకాల మందులు ఉంటే 500 రకాలకు పెంచాం. గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ్య హెచ్ఓ) ప్రమాణాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచాం. ఎన్ఈబీఎల్ ల్యాబ్‌లు 4 నుంచి 6కు పెంచాం. మూడు ప్రాంతీయ డ్రగ్ స్టోర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశాం. వైఎస్సార్ కంటి వెలుగు.. ఈ ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీకి మెరుగు దిద్దిన కార్యక్రమాల్లో నా మనసుకు నచ్చింది కంటి వెలుగు. రాష్ట్రంలో ఉన్నవారందరికీ కంటి వైద్య పరీక్షల కోసం రూ.560 కోట్లతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తొలుత దాదాపు 70 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశాం. 4.36 లక్షల మంది పిల్లలకు దృష్టి లోపం ఉందని గుర్తించారు. 1.58 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరమని తేల్చగా 1.29 లక్షల మందికి పంపిణీ చేశాం. స్కూళ్లు తెరవగానే మిగిలిన వారికి ఇస్తాం. దాదాపు 46 వేల మంది పిల్లలకు దసరా సెలవుల్లో ఆపరేషన్లు చేయిస్తాం. ఇంటింటి సర్వేతో కరోనా కట్టడి.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హోదాలో వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన, అమలులో పాలుపంచుకున్నా. కోవిడ్ విస్తరించకుండా మీరు తీసుకున్న చర్యలు బాగున్నాయి. ఇంటింటి సర్వే ద్వారా ఏపీ అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా వ్యవహరించింది. – డాక్టర్ ఐవీ రావు, మాజీ వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఖరీదైన మందులిచ్చి కాపాడుతున్నారు.. వైఎస్సార్ చొరవతో ఏర్పాటైన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా 270 రకాల కేన్సర్లకు చికిత్స చేయగలుగుతున్నాం. త్రీడీసీఆర్టీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ట్యూమర్ బోర్డును మన రాష్ట్రంలో ప్రప్రథమంగా తెచ్చాం. బ్రెస్ట్ కేన్సర్‌లో రూ.25 లక్షలు ఖర్చయ్యే ట్రాస్టిజమేబ్ అనే మందు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇస్తున్నాం. లింఫోమాస్, రిటెక్స్మాబ్ అనే మందులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఇస్తున్నాం. ప్రపంచంలో ఎవరికీ ఈ అవకాశం దక్కదు. – డాక్టర్ రఘునాధరావు, ఫౌండర్ డైరెక్టర్, హోమీబాబా కేన్సర్ ఆసుపత్రి, విశాఖపట్నం. బాలింతలకు బాసట.. మా ఏజెన్సీలో శిశుమరణాలు, బాలింత మరణాలు గతంలో ఎక్కువగా ఉండేవి. మీరు వచ్చిన తర్వాత వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డకు జన్మనిస్తున్నారు. – సత్యవాణి, అడ్డతీగల, రాజవొమ్మంగి, ఐసీడీఎస్ వర్కర్ తలసేమియా చిన్నారికి భరోసా మా పాప హాసిని తలసే మియా బాధితురాలు. పింఛన్ వస్తోంది. ఉచిత వైద్యం మాత్రమే కాకుండా నేనున్నానని భరోసా ఇచ్చారు. మీరు మా ఆశాజ్యోతి. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మం దులు విరివిగా దొరికేలా చూడాలి’ – హేమ దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ థలసేమియా పేషెంట్లకు మందులు హోం డెలివరీ చేసే దిశగా ఆలోచించడం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను ఆదేశించారు. -
చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..
‘‘జగన్ అనే నేను..’’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి సరిగ్గా సంవత్సరమయ్యింది. ప్రమాణస్వీకారం నాడు ప్రారంభమైన సంక్షేమ రథం విరామంలేకుండా పరుగులు తీస్తోంది. పేదల కోసం రెండడుగులు ముందుకే వేస్తున్నాడని అడుగడుగునా నిరూపితమయ్యింది. అనుభవజ్ఞులను మించిన ‘మంచి ముఖ్యమంత్రి’ అంటూ దేశమంతా కితాబులిచ్చింది. పథకాల అమలులోనే కాదు పాలనలోనూ ఓ కొత్త శైలి.. ప్రతి అడుగులో ఓ కొత్త ఒరవడి... నేటి కంటే రేపు బావుండటాన్ని.. అభివృద్ధి అంటాం. ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక కలెక్టరో వచ్చినప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు, అభివృద్ధి చెందినట్లు లెక్క. ఈ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి ఏడాదిలోనే బలంగా అడుగులు ముందుకు వేశారు. అన్ని వర్గాల వారికి భరోసా ఇచ్చేలా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ సంతకం చేశారు. ఏడాది పాలనలో వినూత్న, విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం ద్వారా చరిత్ర గతిని మార్చారు. ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో తనపై అత్యధిక శాతం ప్రజల్లో వ్యక్తమైన విశ్వాసం మరింతగా పెంపొందించేలా.. అత్యల్ప శాతం ప్రజల్లో వ్యక్తమైన అనుమానాలను నివృత్తి చేసేలా.. అన్ని వర్గాల ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా ఏడాది పాలన జనరంజకంగా సాగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను రూ.2,250కి పెంచుతూ మొదటి సంతకం చేసి ‘ఎన్నికల మేనిఫెస్టో’ అమల్లో తొలి అడుగే బలంగా వేశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సరి కొత్త చరిత్రను లిఖించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సూచిక(ఇండెక్స్)గా నిర్దేశించుకున్న వైఎస్ జగన్.. అన్ని రంగాల్లోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాణ్యమైన విద్య నుంచి ఉపాధి దాకా.. ► విద్యార్థులకు బంగారు భవిత కోసం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణల అమలుకు నడుం బిగించారు. పిల్లలందరినీ బడులకు పంపేలా తల్లులకు ఆర్థికంగా ఊతమిచ్చేలా ‘అమ్మ ఒడి’ కింద రూ.15 వేలు అందజేయడంతోపాటు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ► పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు తదితరాలు సమకూర్చేలా ‘విద్యా కానుక’.. ఉన్నత చదువులను నిరుపేద విద్యార్థులకు అందించే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్ చేయడానికి ‘విద్యా దీవెన’.. ఉన్నత చదువులు చదివే విద్యార్థుల వసతి, హాస్టల్ ఖర్చుల కోసం ‘వసతి దీవెన’ పథకాలు ప్రారంభించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి పరీక్షలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ అమలులో భాగంగా తొలి ఏడాదే గ్రామ సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులను, 2.75 లక్షల మందిని వలంటీర్లుగా నియమించారు. ► పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసి– ఉపాధికి ఢోకా లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం నుంచి ఉపాధికి భరోసా కల్పించేలా సంస్కరణలను అమలు చేస్తూ విద్యారంగంలో సరి కొత్త చరిత్ర సృష్టించారని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం ► వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకూడదన్నది సీఎం వైఎస్ జగన్ అభిలాష. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టారు. ► డాక్టర్లు, నర్సులు తదితర ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు. ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. వైద్య చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే.. వాటిని ఆరోగ్యశ్రీ కింద చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యానికి భరోసా కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి బాటలు వేశారంటూ వైద్య నిపుణులు, సామాజికవేత్తలు అభినందిస్తున్నారు. ► మద్యపాన నియంత్రణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారని.. ఇప్పటికే బెల్ట్ షాపులు మూతపడ్డాయని.. మద్యం దుకాణాల సంఖ్య గణనీయంగా తగ్గించారని.. మద్యం సీసాను ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారని, ఇది ప్రజల జీవన ప్రమాణాలపై గణనీయమైన ప్రభావం చూపుతోందని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ► విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి, వైద్య సేవలు అందించడం.. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా బాధితులను గుర్తించి ఆసుపత్రుల్లో చికిత్స అందించడం ద్వారా కరోనా వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయడంలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారని వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు. మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ► ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర నిర్వహించిన పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని భరోసా ఇస్తూ ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో.. 86 శాతం శాసనసభ.. 92 శాతం లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ► ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని.. మరింతగా పెంపొందించేలా అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా అమలు చేయడం ద్వారా వైఎస్ జగన్.. ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ► టీడీపీ సర్కార్ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినప్పటికీ, సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ వేయకుండా.. నిధులు విడుదల చేయడాన్ని బట్టి చూస్తే సామాజిక భద్రతకు సీఎం జగన్ ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారన్నది విశదమవుతుందని సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ► నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం తీసుకొచ్చారు. మహిళల భద్రత కోసం దేశం యావత్తు మనవైపు చూసేలా ‘దిశ’ చట్టం చేశారు. పండగలా వ్యవసాయం ► పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడకుండా ‘రైతు భరోసా’ కింద ఏటా రూ.13,500ను ప్రభుత్వం అందజేస్తోంది. రాయితీపై విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తోంది. వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల సాగులో సలహాలను అందజేస్తోంది. ► పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం సర్కారే కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులు కనీస మద్దతు ధర మేరకు పంటలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి నుంచి పంట కొనుగోలు వరకూ.. రైతుకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుండటంతో వ్యవసాయం పండగలా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. సుపరిపాలన.. పారదర్శకత.. ► సుపరిపాలన అందించడానికి విప్లవాత్మక సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడం కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ► టీడీపీ సర్కార్ ఇంజనీరింగ్ పనుల్లో పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేసి.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.2,080 కోట్లను ఖజానాకు మిగిల్చారు. సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు ► రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా, నాగావళి నదీ జలాలను ఆయకట్టుకు అందించడంలో సర్కార్ విజయవంతమైంది. ► ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు.. రబీలో 20.77 లక్షల ఎకరాలకు నీళ్లందించడం వల్ల రికార్డు స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ► రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం.. నదీ వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములను సుభిక్షం చేసి.. రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉన్న నామధేయానికి సార్థకత చేకూర్చడం కోసం పంచశీల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ► పారిశ్రామికాభివృద్ధికీ పెద్దపీట వేస్తున్నారు. తొలి ఏడాదిలోనే 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేలా చేశారు. దీనివల్ల 34,822 మందికి ఉపాధి దొరికింది. కొత్తగా ఏడాదిలో 13,122 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి వల్ల రూ.2503 కోట్ల పెట్టుబడితో 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఏడాది పాలనపై నిజాయితీగా సమీక్ష ఏడాది పాలనపై గత ఐదు రోజులుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీగా సమీక్షించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబులా నేల విడిచి సాము చేయలేదన్నారు. తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలోని హామీలు దాదాపు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారికి చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు తెలియజేసి నిజాయితీగా, వినమ్రతతో సలహాలు సూచనలు తీసుకున్నారని వివరించారు. ఏడాది కాలంలో సీఎం వైఎస్ జగన్ పూర్తిగా పని మీదే దృష్టి పెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసి కొత్త ఒరవడికి పునాదులు వేశారన్నారు. వీటి అమలును పటిష్టం చేసుకుంటూ నీటిపారుదల, పారిశ్రామికరంగం, విద్యా వైద్య రంగాల్లో మౌలికసదుపాయాల కల్పనతో దేశంలోనే నంబర్–1 చేసే దిశలో అడుగులేస్తున్నారని చెప్పారు. -
జనం కంటిరెప్ప జగన్
సంక్షేమ పాలనే తన అభిమతంగా, సంస్కరణలే ప్రజాబలంగా సాగుతోన్న వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన జననీరాజనాలు అందుకుంటోంది. 2019 మే 30న నవ్యాంధ్రప్రదేశ్‌కు యువ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రోజు వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ ఆయన తొలి సంతకం చేశారు. నాటి నుంచి నేటి ఇంగ్లిష్ మీడియం విద్య ప్రవేశపెడుతూ తీసుకొచ్చిన చట్టాల వరకు ఆయన ఆలోచనా విధానాన్ని పరిశీలిస్తే గొప్ప సంస్కర్తగా సాక్షాత్కరిస్తారు. తెలుగు ముఖ్యమంత్రులందరి కంటే ఆయన గొప్ప సామాజిక చైతన్యానికి నాంది పలికిన సీఎంగా తారసపడతారు. అన్ని వర్గాల ప్రజానీకం అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి శ్రేయోపాలకునిగా ముద్రవేసుకున్నారు. చేతివృత్తులవారికి, కులవృత్తులవారికి, రైతులకు, రైతు కూలీలకు, చిరువ్యాపారులకు, వృద్ధులకు, యువజనులకు, మహి ళలకు, దివ్యాంగులకు, పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు ఒక్కరికి కాదు. అన్ని సామాజిక, ఆర్ధిక శ్రేణులకు చెందిన ప్రజానీకాన్ని అక్కునచేర్చుకుని రాష్ట్రాన్ని మునుముందుకు నడిపిస్తున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమపాలన కంటే రెట్టింపు ఉత్సాహాన్ని ఆయన మదినిండా నింపుకున్నారు. అందుకే ఆయన ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని తీసుకొచ్చి రైతుల్లో నూత నోత్సాహాన్ని కలిగించారు. వ్యవసాయం చేయడమే దండగగా భావించిన రైతులు ప్రభుత్వం కల్పించిన రాయితీలను, సహకారాన్ని చూసి మళ్ళీ పొలాల్లో అడుగుపెట్టి వ్యవసాయ క్షేత్రాల్ని తీర్చిదిద్దారు. మరో హరితవిప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ను సంసిద్ధం చేస్తున్న ఘనత జగన్‌దేనని రైతులు సగర్వంగా చాటుతున్నారు. ‘వైఎస్సార్ ఆసరా’ మహిళా పొదుపు సంఘాల్లో గతం కంటే విశ్వాసపూరితమైన పరపతి పెంచింది. ఎక్కువ పర్యాయాలు రుణాలు, సున్నావడ్డీ రుణాలు నిరాటంకంగా ఆర్ధిక స్వావలంభన వైపు అడుగులు వేయిస్తుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘అమ్మఒడి’ పథకం ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యతా ఉద్యమానికి నాందిపలికిందని చెప్పవచ్చు. ‘ప్రతి పేదవాడికి ఇల్లు’ పథకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. పేదలకు ఇంటి స్థలం మంజూరు చేసి ఆపై ఇల్లు నిర్మించుకోవడానికి తగిన రాయితీతో కూడిన రుణ సదుపాయం, మరికొంత మందికి ఉచిత ఇల్లు నిర్మాణం చేయడం వంటి నిర్ణయాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక ‘ఆరోగ్యశ్రీ’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమైన ప్రభుత్వ పథకంగా పేరొందింది. అటువంటి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి బతుకు భరోసా ఇచ్చే ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ శక్తివం తంగా నేటి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. అలాగే గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని మరిన్ని మెరుగులుదిద్దుతూ ఉన్నతవిద్యలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సంచలనాత్మకంగా జగన్ ప్రభుత్వం కార్యాచరణకు నిర్ణయం తీసుకుంది. అపర భగీరథునిగా రాజశేఖరరెడ్డి తలపెట్టిన అనేక నీటి ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తిచేయడానికి జగన్ అవిశ్రాంతమైన కృషి చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు సాధించి అపురూపమైన విధులు నిర్వహిసున్నారు. పోలవరం ప్రాజెక్టు చుట్టూ అలుముకున్న అనేక అడ్డంకులను అధిగమించి సక్రమంగా నిర్మాణం జరగడానికి తగిన పరిస్థితుల్ని ఏర్పర్చడం ఆయన పాలనాప్రతిభను వెల్లడించే విషయమే. ఇక ఎన్నో కుటుంబాలను వీధిన పడేస్తున్న మద్యపాన వ్యసనం మీద చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి నిలుస్తారు. రాష్ట్ర ప్రజలను కాపాడే విధంగా అంచలంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇస్తూ ఎన్నికలకు వెళ్లడం సాహసోపేత నిర్ణయం. అధికారం సాధించిన అనంతరం ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలో మొదటిసారిగా బెల్ట్‌షాపులు మూయించారు. రాష్ట్ర ఖజానాకు చేరే ఆదాయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజారోగ్యాన్ని కాపాడటమే పరమావధిగా చిత్తశుద్ధితో మద్యనిషేధాన్ని అమలు దిశగా పయనించడం ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఏ ప్రమాదం సంభవించినా ప్రభుత్వం వైపునుంచి ఎంత సహాయం చేయొచ్చో అంత సహాయాన్ని అందిస్తున్నారు. ప్రత్యక్షంగా సందర్శించి ఎల్జీ పాలీమర్స్ స్టై్టరిన్ గ్యాస్‌లీక్ ఘటనలో చనిపోయిన బాధితులకు రూ. కోటి, మిగతా సహాయక చర్యలకు ఆయన ప్రకటించిన నష్టపరిహారాలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇంగ్లీషు మీడియం విద్య విషయంలో ఎన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా తొణకలేదు, బెణకలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజాతీర్పుకు పట్టంకట్టారు. ఆ ప్రజాతీర్పును కోర్టులు గౌరవించేదిశగా ఆంగ్లమాధ్యమ విద్యను అమల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. నేడు కరోనా మహమ్మారి అలుముకున్న సమయంలో కూడా ఆయన వీరోచితమైన పటిమ ప్రదర్శించారు. ఆంధ్ర ప్రజానీకానికి కష్టాలు ఎదురు కాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ‘నేనున్నాను’ అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శక్తివంతమైన నినాదం ప్రజాహృదయాల్లో ఎన్నటికీ పదిలమే. వ్యాసకర్త : డాక్టర్ జీకేడీ ప్రసాద్, ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్‌మాస్ కమ్యూనికేషన్ విభాగం, ఏయూ,విశాఖపట్నం 93931 11740 -
సమర్థతకూ, సంక్షేమానికి చిరునామా
అలుపెరగని పోరాటయోధుడిగా, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సంకోచించని సాహసిగా, ఉద్యమకారుడిగా, పట్టుదలకు మారుపేరుగా జన హృదయాల్లో సుస్థిర స్థానం సంపా దించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ సారథ్య బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాదవుతోంది. వేలాదిమంది సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజే తన పాలన ఎలా వుండబోతున్నదో, తన లక్ష్యాలేమిటో, ప్రాథమ్యాలేమిటో సూటిగా, స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ ఏడాదికాలంలో వాటిని తుచ తప్పకుండా ఆచరించి చూపడం మాత్రమే కాదు...ఎప్పటికప్పుడు ఎదురవుతూ వచ్చిన సవాళ్లను సైతం అవలీలగా ఎదుర్కొని సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. పాలనలో ఎంతో అనుభవమున్న పలు వురు ముఖ్యమంత్రులను అధిగమించి మున్ముందుకు దూసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులెత్తిస్తున్నారు. కొత్తగా అధికారంలోకొచ్చిన ప్రభుత్వంపై అందరి దృష్టీ వుంటుంది. అధికార పక్షం ఎన్నికల సమయంలో ఎలాంటి వాగ్దానాలు చేసిందో, వాటి విషయంలో ఏం చేస్తున్నదో అనే ఆరా సర్వ సాధారణం. అందులోనూ 151 స్థానాలు గెల్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పై ప్రజానీకం అంచనాలు కూడా భారీగా వున్నాయి. దానికితోడు పదవీ భ్రష్టత్వం ఖాయమని నిర్ధారణకొచ్చిన టీడీపీ ప్రభుత్వం పోతూపోతూ దుష్ట చింతనతో ఖజానాను దాదాపు ఖాళీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ తడబడలేదు. 341 రోజులపాటు రాష్ట్రమంతటా సాగించిన 3,684 కిలోమీటర్ల ‘ప్రజా సంకల్ప యాత్ర’లో తనకు తారసపడిన బాధాతప్త జీవితాల వేదనలను మరచిపోలేదు. ఆ జీవితాల చీకట్లలో వెలుగులు నింపాలన్న దృఢ సంకల్పాన్ని చెదరనీయలేదు. మేనిఫెస్టో అమలుకు అయిదేళ్ల వ్యవధి వుందన్న అలసత్వాన్ని అసలే ప్రదర్శించలేదు. ఎవరో అడిగారని కాదు, మరెవరో గుర్తు చేశారని కాదు... ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే పవిత్ర కర్తవ్యంగా ఆయన భావించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక చేసిన ప్రసంగం సందర్భంగా మేనిఫెస్టోను చూపుతూ... దీన్ని తాను ఖురాన్‌లా, భగవద్గీతలా, బైబిల్లా భావించి అందులోని వాగ్ధానాలను నెరవేర్చడానికి త్రిక రణశుద్ధిగా పనిచేస్తానని ప్రకటించారు. చెప్పినట్టే ఆ వాగ్దానాల్లో 90 శాతం అమలు చేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ ఏడాదికాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిపడిన సమస్యలేమిటో ప్రజానీకానికం తకూ తెలుసు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక వ్యవస్థను ఎంత కుంగదీసిందో వారికి అవగాహన వుంది. అందుకే ప్రభుత్వం నుంచి ఎవరూ పెద్దగా ఆశించలేదు. ఈ కష్టకాలం కడతేరాక అన్నీ నెరవేరతాయని వారనుకున్నారు. కానీ మాట తప్పని, మడమ తిప్పని వారసత్వాన్ని కొనసా గిస్తూ ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికే జగన్ నిశ్చయించుకున్నారు. సమస్యలను సాకుగా చూపడం కాదు... అటువంటి సమయంలో అండగా నిలవడమే నిజమైన పాల కుడి కర్తవ్యమని భావించారు. అందుకే వివిధ సంక్షేమ పథకాల అమలుకు కేలండర్ రూపొందిం చుకుని, దానికి అను గుణంగా మునుముందుకు సాగుతున్నారు. ఏడాది వార్షికోత్సవం జరుపుకునే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? ఊరూ వాడా పార్టీ శ్రేణులను సమీకరించి జెండా ఆవిష్కరణలు జరపడం, బాణసంచా కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం, స్వోత్కర్షలకు పోవడం మాత్రమే ఇన్నాళ్లూ ప్రజలు చూశారు. కానీ జగన్ ఈ సంస్కృతిని పూర్తిగా మార్చారు. వరసగా అయిదురోజులపాటు ‘మన పాలన–మీ సూచన’ పేరుతో తన ఏడాది పాలన పైనా, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనా మేధో మథనం జరపాలని నిర్ణయించారు. వచ్చే నాలు గేళ్ల పాలనలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసుకోవాలని తీర్మానిం చుకున్నారు. ఇందులో పథకాల లబ్ధిదారులతోపాటు, భిన్న రంగాల నిపుణులు, సమాజంలోని ప్రముఖులు పాల్గొని అభిప్రాయాలు చెప్పారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సదస్సుకు ఎంపిక చేసుకున్న అంశాలు జగన్ హృదయాన్ని ఆవిష్కరిస్తాయి. పాలనా వికేంద్రీకరణ, వ్యవ సాయం, అనుబంధరంగాల తీరుతెన్నులు, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల స్థితిగతులు, విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పులు, పరిశ్రమలు, వాటికి సంబంధించిన మౌలిక వసతులు, ఆరోగ్య వ్యవస్థలో వచ్చిన, రావలసిన మార్పులు తదితరాల గురించి ప్రతిరోజూ ముఖ్యమంత్రి వివరిం చడం, అందరి సూచనలు, సలహాలు తీసుకోవడం రాష్ట్ర ప్రజలను మాత్రమే కాదు...దేశ ప్రజలను సైతం అబ్బురపరిచాయి. సదస్సులో వచ్చిన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు స్వయంగా రాసుకోవడం, కొన్ని సందర్భాల్లో తక్షణ నిర్ణయం తీసుకోవడం, మరింత అధ్యయనం చేయాల్సి వుంటే ఆ సంగతిని అధికారులకు చెప్పడం జగన్ విలక్షణ శైలికి, ఆయన నిర్మాణాత్మక వైఖరికి అద్దం పట్టింది. ఈ ఏడాదికాలంలో ప్రభుత్వానికి అడుగడుగునా అవరోధాలు సృష్టించడానికి టీడీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. అన్ని వ్యవస్థలనూ ‘మేనేజ్’ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఇప్పుడు కూడా తన టక్కుటమార విద్యల్ని ప్రదర్శించడం మానుకోలేదు. ఈమధ్య ఆన్లైన్ మహా నాడు జరిపిన సందర్భంగా ఈ ఏడాదిగా పడిన కష్టాలు జీవితంలో ఎప్పుడూ పడలేదని ఆయన గారు వాపోయారు. జగన్ ఉక్కు సంకల్పం ముందు తనకు తెలిసిన విద్యలన్నీ బదాబదలు కావడమే బాబు ఆవేదనకు మూలం. తాను నిష్కళంకమైన, సమర్థవంతమైన పాలన అందిస్తానని జగన్ తొలి రోజునే వాగ్దానం చేశారు. అందుకనుగుణమైన వ్యవస్థలను నెలకొల్పి ఆ వాగ్దానాన్ని నిలుపుకు న్నారు. ఖజానాకు వందలకోట్ల రూపాయలు మిగిల్చారు. ఆత్మ విశ్వాసంతో, ప్రజలకు మరిన్ని మంచిపనులు చేయాలన్న సంకల్పంతో రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి జనం నీరాజనాలు పడుతున్నారు. -
‘సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి’
సాక్షి, పశ్చిమగోదావరి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఏడాది పాలనలోనే మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారని కొనియాడారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నపటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా సున్నా వడ్డీ పథకంతో పాటు అమ్మ ఒడి పథకాలు ప్రారంభించారని తెలిపారు. కేబినెట్లో ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం ఇవ్వడంతోపాటు దళిత మహిళని హోంమంత్రిని చేశారని తానేటి వనిత అన్నారు. నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం మహిళలకు కేటాయించి మహిళాపక్ష ప్రభుత్వంగా నిరుపించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు ధైర్యంగా తిరిగేందుకు.. వారికి భద్రత కల్పిస్తూ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దిశ పోలీస్ స్టేషన్లను నిర్మించారని చెప్పారు. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన దశలవారీ మధ్యపాన నిషేధం అమలు చేసి.. బెల్టు షాపులు పూర్తిగా నిషేదించడంతోపాటు.. షాపుల సంఖ్య తగ్గించారని తెలిపారు. -
ఆ రెండు పథకాలే మా పార్టీకి బంగారు ఫ్లాట్‌ఫామ్
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని తెలిపారు. తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే ప్రభుత్వాలు, రాజకీయాలపైన విశ్వాసం సన్నగిల్లిపోతుందని సీఎం జగన్ చెప్పెవారని గుర్తుచేశారు. టీడీపీలా మేము 640 హామీలు ఇచ్చి పదో పదిహేనో అమలు చేసి మిగతా వాటిని గాలికి వదిలేయలేదని విమర్శించారు. చేయగలిగే తొమ్మిది నవరత్నాలను వైఎస్ జగన్ ప్రకటించి అమలు చేశారని అన్నారు. కేవలం నవరత్నాలే కాకుండా ఇంకా కొన్ని పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందారని అన్నారు. ఒకవైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమ పధకాలను సమాంతరంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాకు రూ. 40 వేల కోట్లు బకాయిలు, రూ.3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారగానే దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టలేదని విమర్శించారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ అద్బుతమైన ఆర్ధిక పాలనను అందిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌కు హై కమాండ్ పెత్తనం ఉండేదని.. అయినా దివంగత నేత వైఎస్ఆర్ నిరంతరం పేదల గురించే ఆలోచించేవారని తెలిపారు. ఆయన ఆలొచనలో సిఎం జగన్ ఇంకో అడుగు ముందుకు వేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ లాంటి సంక్షేమ పధకాలు వైఎస్ఆర్ మానస పుత్రికలని.. ఆ రెండు పథకాలే ఇవాళ మా పార్టీకి బంగారు ఫ్లాట్ ఫామ్ వేశాయని అన్నారు. పేద ప్రజలకు చేయందించి వారి కన్నీరు తుడవగలిగిన వారే పరిపాలకులుగా ఉండాలని సీఎం జగన్ తన పాలన తీరుతో చూపించారని పేర్కొన్నారు. -
‘సీఎం జగన్ దేవుడిలా ఆదుకుంటున్నారు’
సాక్షి, అమరావతి: ఒకప్పుడు డబ్బులు లేక వైద్యం చేయించుకోలేకపోయామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడి రూపంలో తమని ఆదుకుంటున్నారని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు ఎన్.నారాయణ కొనియాడారు. సీఎం ఉచితంగా వైద్యసాయం అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రితో తమ అనుభవాలను పంచుకున్నారు. (ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్) వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు : కె.నరేష్, పూడివలస, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా ‘ప్రతినెలా ఒకటో తేదీ కల్లా వాలంటీర్ వచ్చి తెల్లవారు ఆరోగంటకే నా ఇంటిగుమ్మం దగ్గరకి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. దాంతో నేను నా భార్యా, పిల్లలు చాలా సంతోషంగా బతుకున్నాం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నా. నాకు ఒంట్లో ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రికి వెళితే డాక్టర్లు నీకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను, కానీ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ చేస్తారని చెప్పారు. అంతే కాకుండా ఉచితంగా రూ.పదివేలు పింఛన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు’ ఎం. రామ్మోహన్ రెడ్డి, వేంపల్లె, కడప జిల్లా ‘ముఖ్యమంత్రిగారికి పాదాభివందనాలు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. డిసెంబరు 14వ తేదీన గుండెనొప్పి వచ్చింది, కడప వెళ్తే హైదరాబాద్ పోవాలన్నారు. హైదరాబాద్ పోయి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేపించుకున్నాం. ఆపరేషన్ చేపించుకున్న తర్వాత డిశ్చార్జ్ అయినంక ఎలా బతకాలని నాకు నిద్రపట్టేది కాదు. డిశ్చార్జ్ అయిన మరుక్షణమే రూ.9500 వైయస్సార్ ఆసరా కింద డబ్బులు పడ్డాయి. చాలా సంతోషం అనిపించింది. ఇట్టాంటి పథకాలు మీకు(శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి) మాత్రమే వస్తాయనిపించింది. ఇలాంటి పథకాలు ఇంకా చేయాలని కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను’ ఏఎన్ఎమ్ లత : ‘ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. మీరు ప్రవేశపెట్టిన పథకాలనుప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. కరోనా టైంలో టెలిమెడిసన్ ద్వారా మేం మందులు ఇంటికి తీసుకెళ్లి రోగులకు ఇస్తున్నాం. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా సర్వే ఇంటింటికీ చేశాం. ఇప్పుడు ఐదో విడత చేస్తున్నాం. సిటిజన్ యాప్అని స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లకి ఆ యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్నాం. గతంలో పదివేల మందికి ఒక ఏఎన్ఎం సర్వే చేసేవారం. ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా వచ్చిన ఏఎన్ఎంల సహాయంతో రెండు వేల మంది జనాభాకి సర్వే చేస్తున్నాం. మీకు ధన్యవాదములు’ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారు హేమ : ‘నా పాప పేరు హాసిని, పాపకి తలసేమియా, తనకి పింఛన్ వస్తుంది. దాన్ని నేను మాటల్లో చెప్పలేను, మా కుమార్తెకు పింఛన్ ఇచ్చి మా జీవితాల్లో మీరు వెలుగును చూపించారు. ఉచిత వైద్యం మాత్రమే కాదు నేనున్నానని భరోసా కల్పించారు. మీరు మాకు ఆశాజ్యోతి సార్. నా కృతజ్ఞతను ఎలాగైనా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మందులు విరివిగా దొరికేలా చేస్తారని నా మనవి. మా జగనన్నకి శతకోటి ప్రణామాలు’ వెంటనే జోక్యం చేసుకున్న సీఎం జగన్.. తలసేమియా వంటి పేషెంట్లకు పీరియాడికల్‌గా మందులు హోం డెలివరీ చేసే దిశగా ఆలోచించడమో.. లేక వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూడమని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సత్యవాణి, అడ్డతీగల, రాజవొమ్మంగి, ఐసీడీఎస్ వర్కర్ ‘మా ఏజెన్సీలో శిశుమరణాలు, బాలింత మరణాలు గతంలో ఎక్కువగా ఉండేవి. మీరు వచ్చిన తర్వాత వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం తీసుకోవడం వల్ల గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డకు జన్మనిస్తుంది. గర్భం దాల్చిన నుంచి వాళ్లు పుట్టిన తర్వాత పిల్లలకు కూడా పోషకాలు మీరు అందిస్తున్నారు. ఏజెన్సీలో పనులుకు వెళ్తే గాని పూటగడవని స్ధితిలో ఉంటే ప్రభుత్వం మాకు ఉచితంగా రేషన్ ఇచ్చి ఆదుకున్నారు. మీకు ధన్యవాదములు. మాకు చాలా చోట్ల అద్దె భవనాలున్నాయి. అంగన్వాడీ సెంటర్లకి కూడా శాశ్వత భవనాలు ప్రభుత్వం నిర్మించి ఇస్తే బాగుంటుంది. ఆసుపత్రులు నాడు–నేడు తరహాలో చేస్తే బాగుంటుంది. పేదవాడి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను.. మీరే పదికాలాలు పాటు సీఎంగా ఉండాలి సార్’ -
ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఈ ఏడాదికాలంలో ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన మరణం తర్వాత ఆ రెండూ పేదవాడికి దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ, 104.. 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి వర్తింపజేశాం. 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. 2 వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. జులై 8 నుంచి మరో 6 జిల్లాలో అమలు చేస్తాం. నవంబర్ 8 నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తాం. క్యాన్సర్ రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. స్పీచ్ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాం. నెట్వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించా’’మని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్ నెట్వర్క్ ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇచ్చాం. బి గ్రేడ్‌లో ఉన్న ఆస్పత్రులు 6 నెలల్లో అన్ని వసతులు సమకూర్చుకోవాలి. 9 రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్ 3వేల నుంచి 10 వేలకు పెంచాం. 1.33 లక్షల మందికి క్యూఆర్ కోడ్ కలిగిన ఆరోగ్యశ్రీ కార్డులిచ్చాం. మరో రెండువారాల్లో మిగిలినవారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులిస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇచ్చే మందుల సంఖ్యను 230 నుంచి 500లకు పెంచాం. మందులను కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా అందిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రికి ధైర్యంగా వెళ్లేలా ఆధునికీకరిస్తున్నాం. 70 లక్షల మంది విద్యార్థులకు కంటివెలుగు పరీక్షలు నిర్వహించాం. లక్షా 29వేల విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశాం. రాబోయే రోజుల్లో 46వేల మంది విద్యార్థులకు శస్త్ర చికిత్సలు చేయిస్తాం. రెండో విడతలో అవ్వా, తాతలకు కంటి పరీక్షలు నిర్వహిస్తాం. దివ్యాంగులు సదర్ సర్టిఫికెట్ కోసం గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. ఇప్పుడు వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా "నాడు-నేడు" ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా "నాడు-నేడు" చేపట్టాం. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. కొత్తగా మరో 16 టీచింగ్ ఆస్పత్రులతోపాటు... ఐటీడీఏ పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. 24 గంటలు వైద్యసహాయం అందుబాటులో ఉండేలా విలేజ్ క్లినిక్‌లు. రూ.2,600 కోట్లతో విలేజ్, వార్డు క్లినిక్‌లు. రూ.671 కోట్లతో పీహెచ్‌సీలను కూడా ఆధునీకరిస్తున్నాం. జులై 1 నుంచి 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తాం. ఆరోగ్య సమస్యలపై 14410పై టెలీమెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చాం. వైద్యులు సూచించే మందులను కూడా డోర్‌డెలివరీ చేసేలా చర్యలు. ఇంటివద్దకే వైద్యం అందించేలా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ను అందుబాటులో ఉంచుతాం. 9,712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని కొత్తగా నియమిస్తున్నాం. కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ అగ్రస్థానం కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికన అడుగులు వేశాం. 70 రోజుల్లోనే 13 జిల్లాల్లో ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. రోజుకు 11వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకున్నాం. మిలియన్‌కు 6,627 పరీక్షలు చేస్తూ.. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. దేశంలో పాజిటివిటీ రేటు 4.71శాతం కాగా.. ఏపీలో 0.97 మాత్రమే. దేశంలో రికవరి రేటు 42.75 శాతం కాగా.. ఏపీలో 65.49 శాతం. దేశంలో మరణాల రేటు 2.86 శాతం కాగా.. ఏపీలో 1.82శాతం. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే మనం అగ్రస్థానంలో ఉన్నాం. కరోనా రోగులను వివక్షతతో చూడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రస్థాయిలో 5 కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. 65 జిల్లాస్థాయి ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తెచ్చాం. -
పరిశ్రమాంధ్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్: గత సర్కారు మాదిరిగా అవాస్తవాలు, లేనివి ప్రచారం చేయడం, గ్రాఫిక్స్ చూపించి అన్యాయం చేయడం మాకు సాధ్యం కాదు. రాష్ట్రం నుంచి కియా వెళ్లిపోయిందని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మీడియా దుష్ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వస్తోందని, బుల్లెట్ రైలు వస్తోందని, రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ గత ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ అంటూ గ్రాఫిక్స్ చూపించింది. అలాంటి అవాస్తవాలను మా ప్రభుత్వం ప్రచారం చేయదు. సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు నాలుగు పోర్టులు, ఆరు విమానాశ్రయాలున్నాయని మంచి రహదారులు, రైల్వే లైన్లు మన బలమని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యం పెంచేలా ఈ కేంద్రాలు పని చేస్తాయన్నారు. టెక్స్టైల్స్ రంగానికి గత సర్కారు రూ.1,100 కోట్లు బకాయిలు పెట్టిందని, వాటిపై కూడా త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. గత సర్కారు కేంద్రంతో కలసి కాపురం చేసినా ప్రత్యేక హోదా తేలేదని, ఎప్పటికైనా హోదా సాధిస్తాననే నమ్మకం తమకు ఉందని సీఎం అన్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే సత్తా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకే ఉందన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక రంగం–మౌలిక సదుపాయాలపై మేధోమ«థన సదస్సు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. విభజనతో చాలా నష్టపోయాం మన ఆర్థిక రథం నడవాలంటే వ్యవసాయం ఒక చక్రం అయితే, రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగం. వాటిలో అభివృద్ధి కనిపిస్తేనే ఆర్థిక రథం పరుగెత్తుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వలేదు. దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పారిశ్రామికంగా పలు రాయితీలు ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ లాంటి రాయితీలు వచ్చేవి. వాటివల్ల రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి. హోదాను ఎప్పటికైనా సాధిస్తాం 2014–19 వరకు కేంద్రంతో కలసి కాపురం చేసినా గత ప్రభుత్వం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీ సాధించింది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకవేళ కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకుండా ఉండి ఉంటే వాళ్లతో బేరం పెట్టే అవకాశం ఉండేది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో వారు మా మద్దతు కోరే అవకాశమే లేకుండా పోయింది. గత సర్కారులా అసత్యాలు చెప్పం మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగానే మేం కూడా రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని మాట్లాడితే అర్ధం లేదు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి, 40 లక్షల ఉద్యోగాలు అని ఒకరోజు. నెలకో విదేశీ కంపెనీ అంటూ హడావుడి, రూ.50 వేల కోట్లతో సెమీ కండక్టర్ పార్కు, బుల్లెట్ రైలు వస్తుందని ఒకరోజు, ఎయిర్‌బస్ వచ్చేస్తుందని ఇంకోరోజు, మైక్రోసాఫ్ట్ వచ్చేస్తోందని మరొక రోజు, హైపర్ లూప్ వస్తుందని ఇంకొక రోజు ప్రచారం.. ఇవన్నీ సరిపోవని ఈ మధ్యనే దివాలా తీసిన బీఆర్ «శెట్టి ఈ పక్కనే 1,500 పడకలతో రూ.6 వేల కోట్లతో దిగుతున్నాడని చెప్పారు. ఇవన్నీ నేను కూడా చెబితే అర్ధం ఉండదు. అదేనా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’? గత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేది. 2014 – 2019 వరకు పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. వాటిలో దాదాపు రూ.968 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఇవ్వాల్సినవి. పరిశ్రమలు పెట్టించిన తర్వాత రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటి? ఇక్కడ అంతా బాగుందని ఎలా చెబుతాం? గతంలో పారిశ్రామిక రాయితీలు కూడా అమ్ముకున్నారు. ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టచెబితే తప్ప రాయితీలు ఇచ్చేవారు కాదు. అలా నేను చెప్పలేను.. డిస్కమ్‌లకు కూడా గత ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్లు బకాయి పెట్టింది. ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఏటా క్రమం తప్పకుండా దావోస్ వెళ్లారు. ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలు, చెప్పిందే చెప్పారు కానీ ఏమీ సాధించలేదు. అన్నీ అబద్ధాలు చెప్పారు. మీడియా వారికి అనుకూలంగా ఉండడం వల్ల అలా అబద్ధాలు చెబుతూ పోయారు. అవన్నీ నేను చెప్పలేను. పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే. చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. నిజాయితీ, నిబద్ధత మాలో ఉన్నాయి. మాది 4వ అతి పెద్ద పార్టీ 175 సీట్లకు గానూ 151 సీట్లు, 86 శాతం స్థానాలను గెల్చుకుని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. ప్రో యాక్టివ్‌గా ఉన్నాం. 22 ఎంపీ స్థానాలను గెల్చి దేశంలోనే 4వ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. అవినీతికి తావే లేదు ఇక్కడ ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడా అవినీతికి తావు లేదు. వ్యవస్థలో మార్పు తెస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. సంస్కరణలు చేపట్టి రివర్స్ టెండరింగ్ విధానం. తెచ్చారు. టెండర్లలో ఎల్–1 వచ్చినా అంతకంటే ఎవరైనా తక్కువకు వస్తే రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నాం. దేశంలో అత్యున్నత పోలీసు వ్యవస్థ ఏపీలో ఉంది. గ్రామ స్థాయిలో సచివాలయాల్లో మహిళా పోలీసులున్నారు. ఆ స్థాయిలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. శాంతి భద్రతలకు ఢోకా లేదు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల విలువైన చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, పొగాకు, కాఫీతోపాటు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేశాం. మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్ నెట్వర్క్ ఉంది. అవసరాలకు తగినట్లుగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాగు, సాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్స్, కాలువల నుంచి ఢోకా లేకుండా నీరు ఇచ్చేవిధంగా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. పదేళ్లలో అద్భుతమైన మానవ వనరులు.. ► ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో తెలుగు తప్పనిసరి సబ్జెక్‌గా ఉంటుంది. దీనివల్ల వచ్చే 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరులు అందించే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ► గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో కూడా మన స్థానం మారుతుంది. ఇంటర్ తర్వాత కాలేజీలో చేరుతున్న వారి నిష్పత్తి చూస్తే.. రష్యాలో 82 శాతం, చైనాలో దాదాపు 51 శాతం, బ్రెజిల్లో కూడా దాదాపు 51 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం అది కేవలం 26 నుంచి 28 శాతం వరకు మాత్రమే ఉంది. ► ఈ పరిస్థితి మారాలని 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. 34 దేశాల రాయబారులను పిలిచాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర నెలలు కూడా గడవకముందే డిప్లొమాటిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించి దాదాపు 34 దేశాల రాయబారులను కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఆహ్వానించాం. ఇక్కడ పెట్టుబడి అవకాశాలను వివరించాం. ఇవన్నీ చేస్తుంటే, గత సర్కారు పెద్దమనుషులు, వారి అనుకూల మీడియా దుష్ప్రచారం చేసింది. కియా మోటర్స్ వెళ్లిపోతోందని ప్రచారం చేశారు. అప్పుడు కియా మోటర్స్ ఎండీ స్పందించి ఇక్కడ ఇంత సానుకూలంగా ఉంటే ఎందుకు వెళ్లిపోతామని లేఖ ఇచ్చారు. పరిశ్రమలు–పెట్టుబడులు–ఉద్యోగాలు ► పరిశ్రమల పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం ఉంది కాబట్టే గత ఏడాది 34,322 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెట్టాయి. ► 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. వాటి ద్వారా రూ.2503 కోట్లు పెట్టుబడి రాగా, 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కోవిడ్ వల్ల కాస్త మందగించినా పుంజుకుంటున్నాయి. ► ఇంకా రూ.11,548 కోట్ల పెట్టుబడికి 1,466 కంపెనీలు రెడీగా ఉన్నాయి. వాటికి ఏపీఐఐసీ 1,600 ఎకరాల భూమి కేటాయించింది. మరో 20 ప్రముఖ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయూత ► సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రాష్ట్రంలో దాదాపు 98 వేల యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వాటిని కాపాడుకుంటేనే వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందుకే వైఎస్ఆర్ నవోదయం పథకం ద్వారా 81 వేల ఎంఎస్ఎంఈలకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగేలా బ్యాంకులతో మాట్లాడి ప్యాకేజీలు రెడీ చేసి అండగా నిలిచాం. ► కోవిడ్‌తో చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు మూతబడే స్థితికి చేరుకున్నాయి. వాటికి గత ప్రభుత్వం రూ.968 కోట్ల ప్రోత్సాహక రాయితీలు బకాయి పెడితే మేం ఇస్తామని చెప్పాం. ఇప్పటికే రూ.450 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తం కూడా జూన్ 29న ఇవ్వబోతున్నాం. ఇది నిజమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ► ఇవే కాకుండా ఏప్రిల్ నుంచి జూన్ వరకు పవర్‌పై ఫిక్స్డ్ ఛార్జీలు రూ.188 కోట్లు రద్దు చేశాం. కేంద్రం ఇచ్చేవి కూడా పంపిణీ చేసి తోడుగా ఉంటాం.ప్రభుత్వం ఇంకా వాటికి రూ.1200 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటోంది. పెద్ద కంపెనీలకు చాలా చేయాలి.. పెద్ద కంపెనీలకు ఇంకా ఆశించిన స్థాయిలో చేయలేకపోతున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందుకోసమే సూచనలు, సలహాలు తీసుకుందామని మిమ్మల్ని ఆహ్వానించాం. ఏంచేస్తే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలలో విశ్వాసం కలుగుతుందో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడేళ్లలో చేయాల్సిన ప్రాజెక్టులు.. ► రాష్ట్రానికి మూడేళ్లలో కొన్ని ప్రాజెక్టులు తప్పనిసరిగా చేయాల్సినవి ఉన్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు నిర్మాణం, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావాలి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. అక్కడ మెట్రో రైలు రావాలి. ► ఇంకా 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లతో పాటు 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉన్నాం. ప్లాంట్‌కు ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం కోసం డీఆర్డీవోతో ఒప్పందం చేసుకున్నాం. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ విశాఖలో హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. టైర్–1 సిటీ కాబట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో విశాఖ పోటీ పడగలుగుతుంది. అక్కడ నిపుణులైనసాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందుబాటులోకి వస్తారు. రాబోయే రోజుల్లో అది కార్యరూపం దాల్చనుంది. సదస్సులో మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, నిపుణులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు -
ఆ సత్తా విశాఖకు మాత్రమే ఉంది : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని సీఎం జగన్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై సీఎం జగన్ చర్చించారు. పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. పరిశ్రమలు వచ్చేవి. జీఎస్టీతోపాటు అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవి. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా హోదా రాలేదు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేది. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగా నేను అబద్ధాలు చెప్పను. గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 40 లక్షలు ఉద్యోగాలంటూ ప్రచారం చేసింది. అన్ని విదేశీ సంస్థలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేశారు. గత ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ గ్రాఫిక్స్‌తో కాలం గడిపింది. గత ప్రభుత్వం రాయితీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. 2014-19 వరకు రూ.4వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టింది. వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం.. గత ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటూ క్రమం తప్పకుండా విదేశీ పర్యటనలు చేశారు తప్ప.. చేసిందేమీ లేదు. వారి అనుకూల మీడియా కూడా అబద్ధాలు ప్రచారం చేసింది. మాట ఇచ్చిందే చేస్తామని చెప్పాం. నిజాయితీ, నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం, ఇదే విషయాన్ని పరిశ్రమలకు చెప్పాం. మౌలిక సదుపాయల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉంది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ సీపీ ఉంది. ఏపీకి 972 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది.. మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ ఉంది. నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్టులున్నాయి. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుంది.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదు. వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడాలేని విధంగా జ్యుడిషీయల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేశాం. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీని ద్వారా పారదర్శకత పెరిగింది. దేశంలోనే అత్యున్నత పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉంది. కియా వెళ్లిపోయిందని ప్రచారం చేశారు.. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు.. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. పరిశ్రమలకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమలకు నీరు ఇచ్చేందుకు బలమైన వ్యవస్థ ఉంది. ప్రాథమికస్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నాం. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. పరిశ్రమలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాం. కియా వెళ్లిపోతుందంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా దుష్ప్పచారం చేసింది. చివరికి కియా యాజమాన్యం ముందుకొచ్చి.. ఏపీలో మంచి ప్రభుత్వం ఉంది.. మేమెందుకు వెళ్తామని చెప్పింది. కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. రూ. 11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరో 23 ప్రముఖ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 90వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టుకోవాల్సి ఉంది. ఈ పరిశ్రమలను కాపాడుకుంటేనే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. 2014-19 వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతోపాటు.. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు రూ.968 కోట్లు కేటాయించాం. మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేశాం. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సుమారు రూ.1200 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం. రూ.15వేల కోట్లతో కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తే... వారితో కలిసి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ సత్తా విశాఖకు మాత్రమే ఉంది.. హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉంది. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై వేగంగా స్పందించాం. రూ.50 కోట్లు విడుదల చేసి బాధితులకు 10 రోజుల్లోనే ఇచ్చాం. సంఘటన జరిగిన గంటలోపే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కమిటీలు విచారణ జరుపుతున్నాయి. కమిటీల నివేదిక తర్వాత బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
నేడు పారిశ్రామిక రంగంపై సదస్సు
సాక్షి, అమరావతి: ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా గురు వారం పారిశ్రామిక రంగంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి మాట్లాడతారు. లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రవేశపెట్టిన, చేపట్టా ల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చి స్తారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడానికి చేపట్టిన కార్యక్రమాలు, తిరిగి కొత్త పెట్టు బడులను ఆకర్షించ డంపై కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు భరోసా కల్పించే విధంగా తీసుకున్న నిర్ణయాలు, వలస కూలీలను స్థానిక పరిశ్రమల్లో వినియో గించుకునేందుకు వారికి కల్పించాల్సిన నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. త్వరలో తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై పారిశ్రా మిక సంఘాలు, పారిశ్రామికవేత్తల సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ సదస్సుకు పరిశ్ర మలు, పెట్టుబ డులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ సమన్వయకర్తగా వ్యవహరి స్తారు. పరిశ్ర మల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితోపాటు పరిశ్రమలు, రహదారులు, వాటర్‌గ్రిడ్, మారిటైమ్ బోర్డు, స్కిల్ డెవలప్మెంట్, హౌసింగ్, ఫైబర్ నెట్ వంటి వివిధ శాఖలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరవుతారు. -
నీకు జగన్ మామయ్య ఉన్నాడని అమ్మ చెప్పింది
సాక్షి, అమరావతి: ‘మా అమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడు తోంది. ఇలాంటి కష్టకాలంలో నేను మా అమ్మను మీరిచ్చే పింఛన్‌తో చూసుకుంటున్నాను. నేను లేకపోయినా నీకు మామయ్య (జగన్) ఉన్నాడని మా అమ్మ నాకు చెపుతుందని కృష్ణాజిల్లా కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రమ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద కన్నీటిపర్యంతమైంది. దీంతో చలించిన ముఖ్యమంత్రి.. బాలిక తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యా రంగంపై జరిగిన మేధోమథన సదస్సుకు వచ్చిన రమ్య ఏం మాట్లాడిందంటే.. ► సీఐడీ ఆఫీసర్ కావాలన్నది నా కల. దాన్ని చేరుకోలేనేమోనని భయపడేదాన్ని. ► మామయ్యలా మాకు అండగా ఉంటానన్న మీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. మా నాన్నగారు లేరు. అమ్మ కూలి పనిచేసుకుని నన్ను చదివించేది. ► మీరిచ్చిన ‘అమ్మఒడి’ డబ్బులు వచ్చాయి. నాలాంటి పేదవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ► అమ్మ ప్రేమ ముద్ద మా జగనన్న గోరుముద్ద. ► ఇలాంటి ఫుడ్ పక్కవాళ్లు తింటుంటే.. పెళ్లిళ్లలో చూశాం. కానీ, మేం ఇప్పుడు తింటున్నాం. ► వియ్ ఆర్ లక్కీ సార్. ఐ యామ్ ప్రౌడ్ టు బి లివింగ్ ఇన్ ఏపీ అండర్ యువర్ రూల్ సార్. ► కంటివెలుగు ద్వారా మా స్కూల్లో కంటి పరీక్షలు చేయించుకున్నాం. ► నాడు–నేడు ద్వారా నాడు పాఠశాల వేదనను చూశాం.. నేడు జగనన్న పాలనలో హరివిల్లును చూస్తున్నాం. బాత్రూంలు ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది.. అని రమ్య తన ప్రసంగం ముగించింది. అనంతరం జోక్యం చేసుకున్న సీఎం జగన్.. రమ్య తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు అడిగి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఆంగ్లమే అవసరం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని, ఆంగ్లంలో చదివితేనే ప్రపంచంతో పోటీ పడగలమని విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యా వేత్తలు పేర్కొన్నారు. అమ్మ ఒడితో పేదల చదువులకు భరోసా కల్పించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యకు అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాగా చదువుకుంటామని విద్యార్థులు చెప్పారు. జగనన్న గోరు ముద్ద అమృతమని, రోజుకో మెనూతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదువులపై ముఖ్యమంత్రికి ఉన్న స్పష్టత, అవగాహన అభినందనీయమని విద్యావేత్తలు పేర్కొన్నారు. విద్యారంగంపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం నిర్వహించిన మేధోమథన సదస్సుల్లో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని రకాలుగా సాయం... నేను స్కూల్లో కుకింగ్ హెల్పర్‌గా పనిచేస్తా. ఈ సంవత్సరమే ఉద్యోగంలో చేరా. మొన్నటి దాకా పిల్లలకు భోజనంలో ఒట్టి సాంబారు పోశాం. ఇప్పుడు స్కూల్లో చిక్కీలు ఇస్తుంటే ఇష్టంగా తింటున్నారు. నా పిల్లలు నలుగురూ ప్రభుత్వ పాఠశాలలోనే తింటారు. బాగా చదువుతున్నారు. నాకు అమ్మఒడి డబ్బులు వచ్చాయి. డ్వాక్రా డబ్బులు ఇచ్చారు. నాకు ఇల్లు కూడా వచ్చిందని వలంటీరు ఫోన్ చేశారు. మా అత్తయ్యకు పింఛన్ కూడా వస్తోంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. –జరీనా, పేరెంట్, గుంటూరు ఇష్టంగా తింటున్నాం మామయ్యా..! సీఎం జగన్ మామయ్యకు నమస్కారం. ‘జగనన్న గోరు ముద్ద’ గురించి చెబుతా. గతంలో ఒకటి రెండు కూరలే పెట్టేవారు. ఇప్పుడు ఎన్నో రకాల కూరలు. వారానికి ఐదు గుడ్లు, మూడు చిక్కీలు స్వీట్ పొంగల్, పాయసం, పులిహోర, కోడిగుడ్డు కూర, సాంబారు, ఆలూ కుర్మా, తోటకూర పప్పు ఇవన్నీ పెడుతుంటే ఎంతో ఇష్టంగా తింటు న్నాం. 8వ తరగతి చదివే మా అన్నయ్య కూడా స్కూల్లోనే తింటున్నాడు. ఇవన్నీ సమ కూర్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. –ఎం.రాజేశ్వరి, 5వ తరగతి, కోలవెన్ను, కృష్ణా జిల్లా. అమ్మ ఒడితో పాఠశాల ఫుల్! రెండేళ్ల క్రితం మా పాఠశాలలో 16 మంది విద్యార్ధులే ఉండేవారు. జగనన్న అమ్మఒడి కారణంగా విద్యార్ధుల సంఖ్య 165కి పెరిగింది. పేదవాళ్లను ఉన్నత స్ధితికి చేర్చే క్రమంలో మీరు బోయీలుగా పనిచేస్తున్నారు. మా బతుకుల్లో కొత్త దేవుడు ఉదయించాడని విద్యార్థులు, తల్లిదండ్రులు మీకు (సీఎం జగన్) చెప్పమన్నారు. ఆ చదువులయ్యే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. – రామ్మోహన్, సెకండరీ గ్రేడ్ టీచర్, వైయస్సార్ నగర్,నెల్లూరు. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది.. యావత్ దేశమంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తున్నారు. శార్వరి నామ సంవత్సరాన్ని మేం విద్యా సంవత్సరంగా భావిస్తున్నాం. నవకాయ పిండివంటల్లో ఏది బాగుందంటే ఎలా చెప్పలేమో మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు కూడా అలాంటివే. ఈ ఏడాది సంక్రాంతి 14వ తేదీన కాకుండా 9వ తేదీనే వచ్చిందని అమ్మ ఒడి పథకంతో లబ్ధిపొందిన తల్లులు పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో చెప్పటాన్ని మరచిపోలేం. జగనన్న విద్యా కానుక ద్వారా పేద పిల్లలకు ఇచ్చే కిట్ ఎంతో ఉపయోగపడుతుంది. –కే.ఎస్.ఆర్.వి. శాస్త్రి, టీచర్, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి. అమ్మలా వచ్చిన అన్న...! నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ పేదలకు మేలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం మాకు ఎంతో మేలు చేసింది. ఇప్పటిదాకా అక్షరాభ్యాసం సమయంలో అమ్మ అని రాసేవారు ఇప్పుడు అన్న అని రాస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినం దుకు పేరెంట్స్ కమిటీల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. – టి.ప్రకాష్, పేరెంట్, పెనమలూరు,కృష్ణా జిల్లా ఐరోపాలోనూ ఇలా లేదు.. మీ ప్రసంగం విన్న తరువాత విద్యారంగంపై మీకున్న స్పష్టత అర్థమైంది. విద్యాశాఖ అంశాలపై సాధారణంగా కమిషనర్, సెక్రటరీ లేదా మంత్రి రివ్యూ చేస్తారు. కానీ ఒక సీఎం ఇంత క్లారిటీగా రివ్యూ చేయడం నా సర్వీసులో చూడలేదు. అద్భుతం. విద్యా శాఖకు మీరు కేటాయించిన బడ్జెట్ చూస్తుంటే ఐరోపా దేశాల్లో కూడా ఇలాలేదు. ఈరోజు ప్రపంచ దృష్టంతా విద్యారంగంపైనే ఉంది. – ఉపేందర్ రెడ్డి, నిపుణుడు, అడ్వైజర్,అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా. వర్సిటీల స్థాయిలో నాణ్యత పెరగాలి.. విద్యాసంస్ధల పరంగా మన రాష్ట్రంలో 16 స్టేట్ వర్సిటీస్, 5 డీమ్డ్ వర్సిటీస్, 5 ప్రైవేటు వర్సిటీలున్నాయి. 14 సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంస్థలు లేవు. కొత్త సంస్ధలను నెలకొల్పడం కంటే మనం ఉన్నవాటిని అభివృద్ధి చేసుకుని అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచిది. విశ్వవిద్యాలయాల స్థాయిలో నాణ్యత పెంచాలి. కనీసం ఐదు విశ్వవిద్యాలయాలను జాతీయ స్ధాయిలో మొదటి 50 ర్యాంకుల లోపు ఉండేలా చూడాలి. అప్పుడే మనం దేశానికి ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతాం. –కే.ఎన్.సత్యన్నారాయణ, డైరెక్టర్, ఐఐటీ, తిరుపతి. విద్యా దీవెన ఆదుకుంది మా తల్లిదండ్రులకు మేమిద్దరం ఆడపిల్లలం. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పొందాం. నాన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆరోగ్యశ్రీతో బతికించు కున్నాం. నాన్నకు వికలాంగుల పింఛన్ వస్తోంది. దేవుడే మీ రూపంలో దిగివచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. నేను బాగా చదివి మీ దగ్గర మంత్రిగా పనిచేయాలని కోరుకుంటున్నా. – చంద్రిక, విద్యార్థిని, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజి, విజయవాడ రెండు అడుగులు ముందుకు.. మీ నాన్న గారు (వైఎస్సార్) ఒక అడుగు ముందుకేసి గ్రామీణ పేద విద్యార్థుల కోసం ఆర్జీ యూకేటీలను స్ధాపిస్తే మీరు రెండు అడుగులు ముందుకేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. మీకు ధన్యవాదాలు. – నాగలావణ్య, ఆర్జీయూకేటీ, విద్యార్థిని, నూజివీడు -
పేదింట్లో వెలగాలి విద్యాదీపాలు
నన్ను చాలా మంది అంటున్నారు. అమ్మ ఒడిలో అన్ని డబ్బులు పెడుతున్నానని, నాడు–నేడుకు ఇంత ఖర్చు పెడుతున్నానని, ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన అంటున్నానని, ఇంతింత డబ్బు ఖర్చు పెడుతున్నానని అన్నారు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే... నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడుతున్నా. పేదవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడంటే.. ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ కావాలి. అప్పుడు వారు మంచి ఉద్యోగం చేసి ఎంతో కొంత పంపితే ఆ కుటుంబాలు బాగుపడి పేదరికం నుంచి బయటపడతాయి. వారి జీవితాలు బీపీఎల్ నుంచి మధ్య తరగతికి ఎదుగుతాయి. అలా చదివించలేకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ పేదరికంలోనే ఉండిపోతారు. పేదరికానికి ఏకైక పరిష్కారం ఉన్నత విద్య. దిస్ ఈజ్ వాట్ ఛేంజ్ ది లైఫ్ ఆఫ్ పీపుల్. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటారు. అందుకే మధ్యాహ్న భోజనంలోనూ సమూల మార్పులు చేశాం. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ రోజుకో వెరైటీతో మెనూ అమలు చేస్తున్నాం. నా పాదయాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగుతుండగా ఓ ఇంటి ముందు ఒక పిల్లవాడి ఫ్లెక్సీ ఉంది. ఆ ఇంటి యజమాని గోపాల్ నన్ను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంజనీరింగ్ చదివే కుమారుడు ఫీజులు కట్టేందుకు తండ్రి పడే కష్టాన్ని చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు, ఆ తండ్రి బాధను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదీ గత ప్రభుత్వ హయాంలో విద్యా రంగం పరిస్థితి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతీ పేద ఇంట్లో చదువుల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, నాడు–నేడు పథకాలపై వెచ్చిస్తున్న ఖర్చంతా మన పిల్లల భవిష్యత్తు కోసం తాను పెడుతున్న పెట్టుబడిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే వెలకట్టలేని ఆస్తి చదువు మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరికీ ఈ ఏడాది మార్చి 31 వరకు ఫీజులు పూర్తిగా చెల్లిస్తూ ఒకేసారి రూ.4,200 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,880 కోట్లు కూడా చెల్లించామని చెప్పారు. ‘మన పాలన–మీ సూచన’లో భాగంగా బుధవారం మూడోరోజు విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మేధోమథన సదస్సు నిర్వహించారు. విద్యారంగ నిపుణులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు, లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. పాదయాత్రలో స్వయంగా చూశా.. మా ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు విద్యా రంగం ఎలా ఉండేదో గమనిస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితులు కనిపించాయి. ఎన్నికల ముందు సుదీర్ఘంగా సాగిన నా పాదయాత్రలో చాలా మంది చిన్నారులు నాతో కలిసి అడుగులు వేశారు. అక్టోబర్, నవంబర్ వరకు కూడా వారికి పుస్తకాలు అందలేదని తెలిసింది. మధ్యాహ్న భోజన పథకం ఆయాలు చాలా మంది ఏడెనిమిది నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని, రూ.1,000 గౌరవ వేతనాలు కూడా చెల్లించడం లేదని చెప్పినప్పుడు ఆవేదన చెందా. అధ్వాన స్థితిలో స్కూళ్లు నాడు అధ్వాన పరిస్థితిలో స్కూళ్లున్నాయి. బాత్రూమ్లు లేవు. ఒకవేళ ఉన్నా నీళ్లు రావు. పాఠశాలల భవనాలు బాగు చేయాలన్న ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వానికి లేదు. టీచర్లు ఎంత మంది ఉండాలో స్పష్టత లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల వైపు చూడకుండా ఖర్చు ఎక్కువైనా సరే పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలోనే చేర్పించాలని తల్లిదండ్రులు భావించే పరిస్థితి ఉండేది. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఉంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం తెలుగు మీడియంలోనే ఉన్నాయి. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా విద్యారంగంపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సదస్సుకు హాజరైన విద్యార్థులు, తల్లి దండ్రులు, టీచర్లు, విద్యారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు కాంపిటేటివ్‌గా ఉండాలి పిల్లలు చదవాలి అంటే కాంపిటేటివ్‌గా ఉండాలి. ముఖ్యంగా పేద పిల్లలు కాంపిటేటివ్‌గా ఉండాలి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, సెల్ఫోన్లలో మెసేజ్‌లు అన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటున్నాయి. డ్రైవర్లు లేని కార్లు కూడా రానున్నాయి. మన కళ్ల ముందే ఇవన్నీ కనిపిస్తున్నా కొందరు ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటున్న ఈ పెద్దమనుషులు ఎవరూ వాళ్ల పిల్లలను తెలుగు మీడియం స్కూళ్లకు పంపడం లేదు. ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. ఈ కాంపిటేషన్‌లో పేదవాడు బతకాలంటే, తమ కాళ్ల మీద తాము బతికే పరిస్థితి రావాలంటే వారికి మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువు మాత్రమే. ఇంటర్‌తోనే ఆగిపోతున్నారు.. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యులు 33 శాతం ఉండగా దేశంలో 27 శాతం మంది ఉన్నారు. ఇంటర్ తర్వాత ఎంత మంది పిల్లలు ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరుతున్నారో ఇతర దేశాలతో పోల్చినప్పుడు.. బ్రిక్స్ దేశాల జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) చూస్తే రష్యాలో 82 శాతం ఎన్రోల్ అవుతుండగా, బ్రెజిల్లో 51 శాతం, చైనాలో కూడా దాదాపు అదే శాతం ఎన్రోల్ అవుతుండగా, భారత్‌లో మాత్రం కేవలం 25.8 శాతం మంది మాత్రమే ఎన్రోల్ అవుతున్నారు. అంటే 74 శాతం విద్యార్థులు అక్కడితోనే చదువు ఆపేస్తున్నారు. చదవడం ఇష్టం లేక కాదు, కేవలం తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చదువు మానిపిస్తున్నారు. స్కూళ్ల స్వరూపం మారుస్తాం రాష్ట్రంలో 47,656 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలున్నాయి. నాడు–నేడు కార్యక్రమం ద్వారా తొలివిడతగా 15,715 స్కూళ్ల రూపు రేఖలు జూలై నాటికల్లా మారుస్తాం. ప్రతి స్కూల్లో టాయిలెట్లు, మంచినీరు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్ (కొత్త బల్లలు), పెయింటింగ్ ఫినిషింగ్, ప్రహరీ, ఇంగ్లిష్ మీడియం ల్యాబ్ లాంటి 9 రకాల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది మరో 15 వేల స్కూళ్లు, కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మిగిలిన వాటి రూపురేఖలు మార్చబోతున్నాం. అమ్మ ఒడి ఇవన్నీ చేస్తూ నిరుపేద కుటుంబాలు పిల్లలను బడికి పంపించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,350 కోట్లు జమ చేశాం. అప్పుడు అమ్మలకు ఒక మాట చెప్పా. వచ్చే ఏడాది కూడా ఈ మొత్తాన్ని తీసుకోవాలంటే పిల్లలకు కనీసం 75 శాతం హాజరు ఉండాలని చెప్పా. వచ్చే ఏడాది కూడా జనవరి 9న అమ్మ ఒడి డబ్బులిస్తాం. పారశాలలు తెరిచే రోజే విద్యా కానుక పిల్లలు ఇంకా బాగా చదవాలని ఆగస్టు 3న పాఠశాలలు తెరిచే రోజే జగనన్న విద్యా కానుక ఇస్తున్నాం. స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్టు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్స్ ఇస్తాం. దీనికి దాదాపు రూ.660 కోట్లు ఖర్చవుతున్నా వెనుకాడకుండా అమలు చేస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం పిల్లలు స్కూల్‌ను ఇష్టపడాలంటే అందించే ఆహారం కూడా బాగుండాలి. మధ్యాహ్న భోజనం ఆయాల జీతాన్ని రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచాం. వారి జీతాలు, సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్ చానల్లో పెట్టించాం. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే మెనూపై గతంలో ఏ సీఎం కూడా ఆలోచించని విధంగా నేను ఆలోచన చేస్తే విద్యాశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు 20 రోజులు కసరత్తు చేసి మెనూ ఖరారు చేశాం. డైటీషియన్లతో కూడా మాట్లాడాం. పులిహోర, వెజిటబుల్ రైస్, బెల్లం పొంగలి, కిచిడీ, చిక్కీలు ఇస్తూ జగనన్న గోరుముద్దను జనవరి 21న ప్రారంభించాం. దీనికోసం అదనంగా ఏటా రూ.425 కోట్లు ఖర్చయినా అమలు చేస్తున్నాం. మండలానికో జూనియర్ కాలేజీ పిల్లలు ఇంటర్ తర్వాత చదువుకునేందుకు మండలానికి కనీసం ఒక జూనియర్ కాలేజీ కూడా లేదని తెలియడంతో ఒక హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా మార్చాలని నాడు–నేడులో చేర్చాం. పూర్తి ఫీజుల చెల్లింపు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడం కోసం ప్రక్షాళన చేపట్టాం. అందులో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం రూ.1,880 కోట్లు బకాయి పెట్టింది. దీంతో పాటు ఈ ఏడాది మార్చి 31 వరకు ఒకేసారి దాదాపు రూ.4,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం. దీనివల్ల 10 లక్షల మంది బీసీలకు రూ.1,800 కోట్లు, 4లక్షల మంది ఎస్సీలకు రూ.800 కోట్లు, 80 వేల మంది ఎస్టీలకు రూ.130 కోట్లు, 1.45 లక్షల మంది మైనారిటీలకు రూ.300 కోట్లకు పైగా లబ్ధి కలిగింది. 3.5 లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.1,200 కోట్లు ఫీజుల కోసం ఇచ్చాం. బకాయి పడిన పిల్లలతో కలిపి చూస్తే దాదాపు 19 లక్షల మందికి రూ.4,200 కోట్లు ఫీజుల కోసం చెల్లించాం. ఇక తల్లుల ఖాతాల్లోనే... వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి త్రైమాసికం పూర్తి కాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తం జమ చేస్తాం. అప్పుడు ఆ తల్లి కాలేజీకి వెళ్లి వసతులు పరిశీలించి విద్యా బోధనపై ఆరా తీశాకే ఫీజులు చెల్లించాలి. అవి సరిగా లేకపోతే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ విద్యా దీవెన కార్యక్రమం ఉంటుంది. నేనే స్వయంగా ఏడాదికి నాలుగు సార్లు తల్లులతో మాట్లాడి డబ్బులు విడుదల చేస్తా. వసతి దీవెన వసతి దీవెన ద్వారా కాలేజీల్లో చదివే పిల్లలకు హాస్టల్, మెస్ చార్జీల కింద ఏటా రూ.20 వేల వరకు ఇస్తాం. ఇది రెండు దఫాల్లో తల్లుల ఖాతాల్లో వేస్తాం. తొలిదఫా రూ.10 వేలు జనవరి, ఫిబ్రవరిలో.. మిగిలిన రూ.10 వేలు సెప్టెంబరులో తల్లుల ఖాతాల్లో వేస్తాం. చదువు కాగానే ఉపాధి చదువు పూర్తయ్యే సరికి ఉపాధి లభించేలా ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నాం. కోర్సులు యథావిధిగా ఉంటాయి. చివరి సెమిస్టర్, వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వైఎస్సార్ కంటి వెలుగు ఈ ఏడాది నాకు చాలా సంతోషం కలిగించిన పని.. ‘వైఎస్సార్‌కంటి వెలుగు’. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశాం. 1.58 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం కాగా ఇప్పటికే 1.29 లక్షల మందికి పంపిణీ చేశారు. త్వరలోనే మిగతావి కూడా పంపిణీ చేస్తారు. స్కూళ్లు తెరిచిన తర్వాత 46 వేల మంది పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తుంది.కార్యక్రమంలో మంత్రులు సురేష్, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ నీలం సాహ్ని, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు ‘కార్పొరేట్’తో పోటీ పడతాం ఆంగ్ల భాషను నేర్చుకోవడం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంది. మాతృభాషను కంటితో పోల్చితే ఇంగ్లిష్ కళ్లజోడు లాంటిది. దీని సహాయంతో మరింత బాగా చూడగలం. ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల మాలాంటి పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో చదివే వారితో పోటీపడగలుగుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇంగ్లిష్ మీడియం తెచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మా మేనమామగా మీరు పక్కనుంటే గెలుపు మాదే. – కె.గౌతం, పదో తరగతి, జెడ్పీహెచ్, నిడమానూరు తరతరాలకూ గుర్తుంటారు.. అన్నా.. నాకు ముగ్గురు ఆడపిల్లలు. కన్నది మేమే అయినా వారిని మేనమామలా ఆదుకుంటున్న మీకు ధన్యవాదాలు. అమ్మ ఒడి డబ్బులు రాగానే సుకన్య పథకం కింద ఇద్దరికీ చెరొక ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేశాం. తరతరాలకూ మీ పేరు చెప్పుకుంటాం. మా ఆయుష్షు కూడా పోసుకుని మీరు నిండు నూరేళ్లూ జీవించాలి. – కె.సరిత, విద్యార్థినుల తల్లి -
నాకు మా అమ్మ కావాలి సార్..
సాక్షి, విజయవాడ/అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన రమ్య అనే 10వ తరగతి విద్యార్థిని మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కదిలించాయి. కృష్ణా జిల్లా కానూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న యు. రమ్య అనే విద్యార్థిని తనకు అందుతున్న పథకాలకు సంబంధించిన విషయాలను చక్కగా వివరించింది. తన తల్లికి ఆరోగ్యం బాలేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను మామయ్య అని సంబోధిస్తూ .. 'నాకు మా నాన్న లేరు సార్.. మా అమ్మ నన్ను కూలీ పని చేస్తూ చదివిస్తోంది. నేను సీఐడీ ఆఫీసర్ కావాలనే లక్ష్యం ఉండేది.. కానీ పేదవాళ్లం కావడంతో అది నెరవేరుతుందనే నమ్మకం లేదు. కానీ మీరు నాకు మామయ్యలాగా అండగా ఉంటూ నా చదువుకు భరోసా కల్పించారు సార్.. దీంతో నేను లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం వచ్చింది సార్.. మీలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా అదృష్టం సార్.. వీ ఆర్ లక్కీ అండర్ యువర్ రూల్ సార్.. ఒక మామయ్యగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్.. నా తల్లి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు.. ఆమె ఎప్పుడు చనిపోతుందో కూడా నాకు తెలియదు. ఒక వారం ఉంటుందో.. నెల ఉంటుందో తెలియదు కానీ.. నాకు మా అమ్మ కావాలి సార్.. ఎలాగైనా ఆమెను బతికించండి సార్' అంటూ కన్నీటి పర్యంతమైంది. రమ్య మాటలకు చలించిపోయిన సీఎం జగన్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రమ్య తల్లిని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన హెల్త్ ఆఫీసర్ వైద్య సిబ్బందితో రమ్య ఇంటికి చేరుకొని ఆమె తల్లిని ఆసుపత్రికి తరలించారు. తన తల్లిని ఆస్పత్రికి తరలించడానికి సీఎం జగన్‌కు రమ్య కృతజ్ఞతలు తెలిపింది. (సీఎం జగన్ పండుగలా దిగివచ్చారు)