
సాక్షి, తిరుపతి : ఏడాది పాలనలో జగనన్న ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారని ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. రోజా మాట్లాడుతూ..' ఆయన పాలనలో తాము ఎమ్మెల్యేలుగా ఉండటం అదృష్టం.ఏడాది పసులనలో రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో 3 కోట్ల 50 లక్షల మందికి రూ. 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అందించారు. ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. వ్యవసాయంలో హరిత విప్లవం తెచ్చారు.రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దేశంలోనే చారిత్రాత్మకం. ఇది రైతు ప్రభుత్వం అని సీఎం జగన్ నిరూపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కానీ వైఎస్ జగన్ తన తండ్రికి మించిన తనయుడిగా పాలన అందిస్తున్నారంటూ' పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment