సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి( శనివారం) ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారాయన. యువజన శ్రామిక రైతు (వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. అన్ని రంగాలను మెరుగుపరిచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని వర్గాలకు పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు పెద్ద పీట వేశారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో పోల్చిన సీఎం జగన్.. తాను ఇచ్చిన హామీలను ఇప్పటికే 90 శాతం అమలు చేయడంతో ఏపీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment