welfare schemms
-
నగదు బదిలీతో ఆర్థిక వ్యవస్థకు మేలే!
ఏపీలో ఇప్పుడున్న పాలక పక్షానికి (వైఎస్సార్సీపీ) గత మూడున్నర ఏళ్ల క్రితం ఎకాఎకిన 151 అసెంబ్లీ సీట్లను ప్రజలు కట్టబెట్టారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వం – నూతన పరి పాలనా సంస్కరణలతో, తాను చేసిన వాగ్దానాల మేరకు... సంక్షేమ పథకాలు, ఉద్యోగకల్పన, పరిపాలనా వికేంద్రీ కరణతో శరవేగంగా దూసుకపోతూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాల్లోకెల్లా బాగా ప్రాచుర్యం పొందినవి రెండు – ఒకటి యువతకు భారీ ఉద్యోగ కల్పన. రెండు – నగదు బదిలీ పథకం. నగదు బదిలీ పథకం విషయంలో ‘పేదల్ని కూర్చోబెట్టి పోషిస్తున్నా’ రంటూ అనేకమంది అక్కసు వెళ్ళగక్కుతూ వస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు చేస్తున్న ఈ నగదు బదిలీ వల్ల ఖజానాకు ఒక్క పైసా నష్టం రాకపోగా; నగదు బదిలీ జరిగిన మరుసటి వారంలోపే దానిలో అత్యధిక భాగం తిరిగి చిల్లర వ్యాపారులకు – తద్వారా రాష్ట్ర ఖజానాకే చేరుతుంది ఆ డబ్బంతా! ఈ ద్రవ్య సంచయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నిత్యం ఆదాయం వస్తూనే ఉంటుంది. నగదు బదిలీ పథకం వల్ల ప్రజలకు కొత్తగా తెలిసిందేమంటే – ఇంత భారీగా ప్రజ లకు ఇవ్వగలిగిన సొమ్ము – ఇప్పటి వరకు గత పాలకులు తమకు దక్కకుండా చేశారనే విషయం. ఇక ఉద్యోగ కల్పన విషయానికి వస్తే... గత ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా; ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేసి, దళారీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచాయి. ఇంతే కాదు, ఇలాంటి అస్థిర ఉద్యోగాల వల్ల అటువంటి ఉద్యో గులు – ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ఉద్యోగాలతో రాజీ పడలేక, నాణ్యమైన సేవలు అందించలేక అస్థిర జీవనం కొనసాగించే వారు. అలాంటి తరుణంలో – వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన భారీ ఉదార ఉద్యోగ కల్పన వల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ ఉద్యోగాల కల్పన వల్ల యువతకు సుస్థిర జీవనం సాగించే అవకాశంతో పాటు; తమ మీద తమకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వీరికిచ్చే జీతాల వల్ల రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుందన్న ప్రతిపక్షాల చీకటి ప్రచారాలు కూడా సరైన వాదనకు నిలబడేవి కావు. కారణం – ఇన్ని లక్షల మందికి చెల్లించే వందల కోట్ల జీతాల మొత్తాలు మరుసటి రోజే మార్కెట్లోకి వెళ్ళి పోతున్నాయి ఖర్చుల రూపంలో. ఖర్చులోనే ఆదాయ ముంటుందన్న ఆర్థిక సూత్రం మేరకు మళ్ళీ వీరి ఖర్చు ప్రభుత్వ ఖజానాలకు ఆదాయంగా మారుతోంది. అందువల్ల వీరి జీతాలను ఖర్చుగా భావించనక్కర్లేదు. పై పెచ్చు ఈ భారీ ఉద్యోగిత వల్ల పాలనా, సేవా సౌకర్యాలు అత్యంత సామాన్యుని ఇంటి ముంగిట వరకు చేరటంతో – పౌర సమాజానికి సమయం, డబ్బు ఆదా అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత నిచ్చి, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు చదువుకొనే విద్యార్థులకు అనేక ఫీజు రాయితీలు కల్పిస్తూ; ప్రభుత్వ రంగ విద్యా సంస్థ ల్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తూ గ్రామీణ నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవటం వల్ల... సమీప భవిష్యత్తులో నాణ్యమైన ప్రమాణాలు కల విద్యార్థి సమూహం సమాజంలోకి ధీమాగా అడుగు పెడుతుంది. ఇక వైద్య రంగాన్ని గమనిస్తే – వైద్య, ఆరోగ్య రంగాలలో భారీ ఉద్యోగితను కల్పించటం; ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సంస్థలను అభివృద్ధి పరచడం... తద్వారా అందని ద్రాక్షగా తయారైన వైద్యాన్ని సామాన్యుని ముంగిటకు తెచ్చినట్టయింది. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలూ, గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఫలితంగా మిగిలిన అప్పులూ... వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణను భారం చేశాయి. అంతకు ముందు ఐదేళ్లల్లో ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని అంతగా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సంవత్సరంలో మాత్రం ఎడాపెడా రాష్ట్రమంతటా రోడ్లు వేయించ పూనుకున్నాడు. వేగుల ద్వారా – ప్రభుత్వంపై ఉన్న తారాస్థాయి అసంతృప్తి సమాచారాన్ని తెలుసుకొన్న తాను దోమలపై దండయాత్ర అంటూ, పంచాయితీలకు ఎన్నికల సంవత్సరం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులిచ్చాడు. ఈ ‘ఆఖరు క్షణం ఖర్చుల’ వల్ల రాష్ట్రానికి మూడు విధాల నష్టం వాటిల్లింది. కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో చేతులు కలిపి భారీగా అవినీతికి పాల్పడటం మొదటిది కాగా; ఈ అవినీతి వల్ల పనుల్లో నాణ్యత తగ్గటం రెండోది. ఈ పర్యవసానాల వల్ల రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ అవ్వడం మూడోది. ఫలితంగా జగన్ తన పాలనను ‘మైనస్ జీరో బడ్జెట్’ నుండి మొదలు పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే – అప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పు – 2 లక్షల 64 వేల, 451 కోట్లు కాగా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ కావటం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వానికి తొలిరోజు నుండే ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కనీసంగా వెయ్యి కోట్ల రూపాయిలు వడ్డీ ప్రతి నెలా చెల్లించాల్సి వస్తోంది. అయినా కూడా పేదల కోసం మొద లెట్టిన నగదు బదిలీ పథకం అప్రతిహతంగా కొనసాగించే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే! (క్లిక్ చేయండి: ఆస్తుల విభజన చేసేది ఎన్నడు?) - మాకా రాజేంద్రన్ సామాజిక విశ్లేషకుడు -
అర్హత ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదు: సీఎం జగన్
-
AP: ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు
తాడేపల్లి: అందరికీ సంక్షేమంలో భాగంగా.. ఏపీలో మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కల్గింది. సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి అందని వారికి తాజాగా రూ. 137 కోట్ల నిధులను విడుదుల చేసింది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా తమకు అందుతున్న సంక్షేమ పథకాలు, సీఎం జగన్ పాలనపై పలువురి లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది లబ్ధిదారులు తాము పొందుతున్న లబ్ధిని సీఎం జగన్‌కు వివరించారు. ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు మాలాంటి వాళ్ల కోసం ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు ఇలాంటి ఆలోచన చేయలేదు. మొదటిసారిగా మీరు చేశారు. మీరు ఈబీసీ పథకం కోసం డిసెంబర్లో అప్లై చేశాను. కానీ నా ఆధార్ కార్డు లింక్ అప్ కాలేదు. ఆధార్ కార్డు లింక్ అప్ చేసుకుని ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరడం ఆనందంగా ఉంది. మా పెద్ద అమ్మాయికి విద్యా దీవెన, వసతి దీవెన అందుతోంది. మా చిన్నమ్మాయికి అమ్మ ఒడి పథకం అందుతోంది. దాంతో నా పిల్లల్ని ఆనందంగా చదివించుకుంటున్నా. నాకు విడో పెన్షన్ అందుతోంది. మీరిచ్చిన భరోసాతో నా కుటుంబం ఆనందంగా బ్రతక గల్గుతోంది.అందరి పేద జీవితాల్లో వెలుగులు నింపుతున్నార్ సార్. మామిడిపాటి లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా ఓసీలకు కూడా పథకాల్ని వర్తింపచేసిన ఏకైక సీఎం మీరే అన్నా జగనన్న తోడు ద్వారా రెండు విడతలుగా 10 వేల చొప్పున పొందాను. డ్వాక్రా మహిళా సంఘంలో కూడా ఉన్నాను.దాని ద్వారా లబ్ది పొందుతున్నాను.మా అత్త గారికి వితంతు పించన్ వస్తుందన్నా. మీ నాన్నగారు వైఎస్సార్ ఉన్నప్పుడు ఇంటి పట్టాను పొందాము. వైఎస్సార్ ఆసరా కూడా మా కుటుంబానికి అందుతుందన్నా. పార్టీలకతీతంగా పథకాల్ని వర్తింపు చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్నా. ఓసీలకు కూడా పథకాల్ని వర్తింప చేసిన ఏకైక సీఎం మీరే అన్నా. జ్యోతి, అనంతపురం జిల్లా మీలాంటి నాయకుడ్ని ఇంతకముందు చూడలేదు మీరు పాదయాత్రలో మత్యకారులు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా కింద రూ. 10 వేలు సాయం అందిస్తానన్నారు. ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా బాధలు గుర్తించి వేట నిషేధ కాలంలో మాకు సాయం అందిస్తున్నారు. మత్యకార భరసా, అమ్మ ఒడి, జగనన్న చేయూత ఇలా నాకు రూ. 70 వేల భరోసా అందుతుందన్నా. నా ఒక్కడికే 70 వేల రూపాయలు అందితే కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని ఇంకా ఎంతమందిని ఆదుకున్నారో అన్నా మీరు. మీలాంటి నాయకుడ్ని ఇంతకుమందు చూడలేదన్నా. మీరు మా పట్ల చూపించిన అభిమానం గొప్పగా అనిపిస్తుందన్నా ఉడిపి సైమన్, కాకినాడ జిల్లా -
అధికారం అంటే ప్రజలపై మమకారం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు . ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా.. తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింది. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. ‘ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. మరో 3 లక్షలకు పైగా కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడద’’ని ఈ సందర్బంగా పేర్కొన్నారు ఆయన. దరఖాస్తు చేసిన 3,39, 096 మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్ పింఛన్ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేసినట్లు.. అదే విధంగా కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. న్యాయంగా.. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంకల్పమని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. -
అర్ధసత్యాల ఆంధ్రజ్యోతి
ఆదోని రూరల్: అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆంధ్రజ్యోతి లబ్ధిదారుల్ని తప్పుదారిపట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. వారితో ఏదో ఒకటి ఆవేశంగా మాట్లాడించి అక్కడేదో గందరగోళం జరిగిందన్నట్లు రాసి ప్రజల్ని మభ్యపెడుతోంది. కులమతాలు చూడం.. పార్టీలు చూడం.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తాం.. అని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేని పచ్చమీడియా ఏదో ఒక వంక పెట్టాలనే ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతి చేసిన ఇటువంటి ప్రయత్నమే వికటించింది. ఆవేశంగా మాట్లాడినవారు వెంటనే తప్పు తెలుసుకుని ఆ పత్రిక తమను తప్పుదారి పట్టించిందని ఆవేదన చెందుతున్నారు. ఢణాపురం సుశీలమ్మ గతంలో విడో పింఛన్ పొందినట్లు నివేదికను తయారు చేసి పంపిన దృశ్యం ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లా ఆదోని రూరల్ మండలం ఢణాపురం గ్రామంలో సోమవారం ఎంపీడీవో గీతావాణి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన సుశీలమ్మ అనే మహిళ తనకు పెన్షన్ రావడంలేదని, బియ్యం కార్డు తీసేశారని, అమ్మఒడి కూడా పడడంలేదని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చింది. అదే గ్రామానికి చెందిన రైతు వెంకోబా కుమారుడు వీరేష్ తమకు రూ.40,500 రైతుభరోసా నిధులు పడలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. వీటిని మాత్రమే ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. వారు ఎమ్మెల్యేను నిలదీసిన తరువాత అధికారులు వారికి వాస్తవాలు ఏమిటో ఆధారాలతో చూపించారు. పదెకరాల భూమి ఉండటంతో విడో పింఛను, రేషన్ కార్డు తొలగించినట్లు.. అందుకే అమ్మ ఒడి పడలేదని సుశీలమ్మకు అధికారులు తెలిపారు. పంటల బీమా మూడేళ్లలో రూ.13,500 వంతున మొత్తం రూ.40,500 బ్యాంకు ఖాతాలో పడినట్లు చూపించడంతో రైతు వీరేష్, ఆయన తండ్రి వెంకోబా అంగీకరించారు. వీటిని మాత్రం ఈ పచ్చమీడియా విస్మరించడం చూస్తుంటే పనిగట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని ఇట్టే తెలుస్తోంది. -
పేదల అభివృద్ధిని చూసి బాబు ఓర్వలేకపోతున్నాడు: నారాయణ స్వామి
సాక్షి, తాడేపల్లి: నిరుపేదల కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. సంక్షేమ పధకాలని నిరుపేదల అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని అన్నారు. శంకరన్ అనే ఐఎఎస్ కృషితో దేశంలో 20 సూత్రాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, వైఎస్సార్‌లు పేదల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేశారని గుర్తుచేశారు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ ఆరోపణలని నారాయణ స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ ఇద్దరు ఐఎఎస్‌లు పేదవాళ్లకి ఆగర్బ శత్రువులగా కనపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్‌ను ఎలా ఏటిఎంలా ఉపయోగించుకున్నారో చూశామని తెలిపారు. చంద్రబాబుకి పొరపాటున ఓటేస్తే ఈ సంక్షేమ పధకాలని ఆపేస్తామని స్పష్టం చేసినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అప్పులు చేసినపుడు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్‌లు ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు ప్రజల కోసం ఏ రోజూ తపన పడలేదని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఈ ఇద్దరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా కట్టి చూపించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నిర్మాణమైన రోడ్లు వర్షాలకి కొట్టుకుపోవడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో ఈ ఇద్దరు అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయగలరా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. పేదలకోసం సీఎం వైఎస్ జగన్ ఖర్చు చేస్తే వృధా ఖర్చా? చంద్రబాబు ఎలా ఖర్చు చేసినా మాట్లాడరా? అని నారాయణ స్వామి ధ్వజమెత్తారు. -
డేటాతో పురోగతికి బాట: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వాటిల్లో డేటాను సేకరించడంతో పాటు క్రోడీకరించి విశ్లేషించాలని సూచించారు. ఆర్బీకేలు, సచివాలయాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా సమాచారం ఉండాలన్నారు. కాకి లెక్కలు కాకుండా వాస్తవాలను వెల్లడించేలా ఈ సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించాలని ఆదేశించారు. దీనిపై పర్యవేక్షించే బాధ్యతలను మండల స్థాయి ఉద్యోగికి అప్పగించాలని సూచించారు. ప్రణాళికా శాఖ అధికారులతో సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో చేపట్టే ఇ–క్రాపింగ్ లాంటి డేటాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, దీనివల్ల ఇ– క్రాపింగ్ సక్రమంగా జరుగుతోందా? లేదా? అనే అంశంపై దృష్టి సారించవచ్చన్నారు. కేవలం డేటాను సేకరించడమే కాకుండా విశ్లేషించడం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం? లోపాలేమిటి? తదితర అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద మరింత సహకారం అందేలా కృషి చేయాలన్నారు. ఉగాది రోజు వలంటీర్లకు సత్కారం.. వలంటీర్లను ఉగాది రోజు సత్కరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలన్నారు. సేవారత్న, సేవామిత్ర లాంటి అవార్డులతో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లను సత్కరించాలని సూచించారు. సమీక్షలో ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్ సీఈవో జె.విద్యాసాగర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐరాస లక్ష్యాలను సాధించేలా సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల్లో ఇంటర్నెట్ సరిగా పనిచేస్తోందా? లేదా? అనే వివరాలు ఎప్పటికప్పుడు అందాలని, దీనివల్ల పాలన సమర్థంగా ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐరాస, అనుబంధ విభాగాలు సహా ప్రపంచస్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో లాంటి సంస్థలతో కలసి పని చేయాలని సూచించారు. -
లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకాల్లో రుణాల మంజూరును మార్చిలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంగళవారం నాడు ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంచి వ్యవస్థ ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రెండో విడత చేయూత అందించే సమయానికి మరింత మంది సంక్షేమ పథకాల్లో వచ్చేట్లు చూడాలని సూచించారు. పశువులకు సంబంధించి పూర్తి హెల్త్‌కార్డులను కొనసాగించాలన్నారు. పశువుల ఆస్పత్రులను నాడు-నేడు తరహాలో ఆధునీకరించాలని తెలిపారు. అన్ని సేవలు ఆర్బీకేల్లో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిని సీఎం జగన్ ఆమోదించారు. (చదవండి: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్) -
మైనార్టీలకు సంక్షేమ నజరానా
సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా రూ.3,428 కోట్ల మేర లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే మైనార్టీలకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. ఇంత భారీ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయూత అందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నేరుగా నగదు బదిలీ... అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, వైఎస్సార్ ఆసరా, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2,585 కోట్లు ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ పథకాల ద్వారా కూడా ఆదుకుంటోంది. త్వరలో ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాలు, మరికొన్ని పథకాల ద్వారా రూ.843 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. తద్వారా 17 నెలల వ్యవధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనారిటీలకు రూ.3,428 కోట్ల మేర లబ్ధి కలగనుంది. మదర్సాల్లోనూ మధ్యాహ్న భోజనం రాష్ట్రంలోని 900 మదర్సాలలో చదువుతున్న 33 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. మదర్సాలకు కూడా అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలు అమలవుతున్నాయి. వక్ఫ్ ఆస్తులపై రీ సర్వేలు వక్ఫ్‌బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేసి ఆస్తులు కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో విడత సర్వే ద్వారా ఇప్పటికే దాదాపుగా ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చింది. ప్రత్యేకించి సర్వే కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రీ సర్వే జరుగుతోంది. హజ్ యాత్రికులకు సాయం పెంపు హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, అంతకు మించి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. ఇటీవలే వారికి బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించింది. మరోవైపు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంచిన మొత్తం త్వరలోనే అమలులోకి రానుంది. టీడీపీ పాలనలో.... టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు అందించిన సాయం వేళ్ల మీద లెక్కించవచ్చు. మొత్తం 5 ఏళ్లలో కలిపి ఇచ్చింది కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే. ఇవి అప్పటి ప్రభుత్వ లెక్కలు కాగా సాయం లబ్ధిదారుల చేతికందేలోపు జన్మభూమి కమిటీలు, దళారులు కాజేసింది పోగా లబ్ధిదారులకు అందింది చాలా స్వల్పమే. ఒక కుటుంబంలో మూడు పథకాలు.. ‘నా భర్తకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా సాయం అందుతోంది. నా మనవరాలికి జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 అందాయి. గతంలో మాకు ఎప్పుడూ ఇలా సాయం అందలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా’ - షేక్ హసన్బీ, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా. చదివిస్తూ డబ్బులివ్వడం గొప్ప పని... ‘చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చదువులకు డబ్బులు ఇవ్వడం గొప్ప పని. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు. ప్రభుత్వం 1వ తరగతి నుంచే పిల్లల చదువుల కోసం డబ్బులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు, బట్టలు, చెప్పులు కూడా సమకూరుస్తోంది. మూడో తరగతి చదువుతున్న నా కూతురు పేరుతో అమ్మ ఒడి డబ్బులు అందాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా మా అప్పులను కూడా ప్రభుత్వం తీరుస్తోంది’ - ఎస్కే సబియా, వన్‌టౌన్, విజయవాడ చెప్పినట్లుగా సాయం చేస్తున్నారు.. ‘వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 అందాయి. వైఎస్సార్ ఆసరా తొలి విడత సాయాన్ని సెప్టెంబరులో అందించారు. నాలుగు విడతల్లో మొత్తం రుణం తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? చెప్పినట్లు సాయం చేసిన ముఖ్యమంత్రి జగనన్న ఒక్కరే’ - షేక్ కరీమున్నీసా, వన్‌టౌన్, విజయవాడ -
‘జగన్ మాట ఇచ్చారంటే.. నిలబెట్టుకుంటారు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి పట్ల భయపడొద్దని, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కరోనా బాధితులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 0866- 2428666కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారని, ఆయన మాట ఇచ్చారంటే కచ్చితంగా నిలబెట్టుకుంటారని వల్లభనేని వంశీ అన్నారు. (‘స్వలాభం కోసమే టీడీపీ కుట్రలు) -
ఏడాదిలో ఎన్నో సంచలన నిర్ణయాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి( శనివారం) ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారాయన. యువజన శ్రామిక రైతు (వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. అన్ని రంగాలను మెరుగుపరిచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని వర్గాలకు పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు పెద్ద పీట వేశారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో పోల్చిన సీఎం జగన్.. తాను ఇచ్చిన హామీలను ఇప్పటికే 90 శాతం అమలు చేయడంతో ఏపీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
6 లక్షల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఖర్చయిన మొత్తం అక్షరాలా రూ. 6 లక్షల కోట్లపైనే. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రగతికి బాటలు పడడం, హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందుతుండటంతో ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల రూపంలో కలిసొచ్చాయి. దీంతో 2016–17లోనే రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లు దాటాయి. ప్రభుత్వం కూడా మిగులు బడ్జెట్ గురించి ఆలోచన చేయకుండా రాబడులను దాదాపు పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంతో ఇప్పటివరకు రూ. 6.35 లక్షల కోట్లకుపైగా ఖర్చయింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2014–15లో రూ. 61,840 కోట్లు ఖర్చుకాగా ఆ తర్వాతి ఏడాది రూ. 90 వేల కోట్లు దాటింది. ఇక మూడో ఏడాది నుంచి రూ. లక్ష కోట్లు దాటిన ప్రభుత్వ ఖర్చు ప్రస్తుత ఏడాదికి వచ్చే సరికి రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి 100 శాతంకన్నా ఎక్కువకు చేరిందన్నమాట. గత ఆరేళ్లలో రూ. 6.6 లక్షల కోట్ల రాబడులు రాగా అందులో 96 శాతం మేర అంటే రూ. 6.3 లక్షల కోట్లను ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఖర్చు ప్రతి వ్యక్తిపై రూ. 1.81 లక్షలకుపైగా కావడం విశేషం. -
ప్రజాశేఖరుడు.. వైఎస్ రాజశేఖరరెడ్డి
ప్రతి తెలుగువాడి గుండెచప్పుడు వైఎస్సార్... పల్లె తలుపు తట్టినా.. పేదవాడి ముంగిటకెళ్లినా.. వైఎస్సార్ మార్కు జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. జలసిరుల జలయజ్ఞంలో,బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీలో, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లయిన నిరుపేదల ఫీజురీయింబర్స్‌మెంట్ అనుభవాల్లో పెద్దాయనే కనిపిస్తారు. ఏ ఊరికెళ్లినా రాజన్న మాటలే.ఏ వాడకెళ్లినా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీపిగుర్తులే. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం -
రాజన్న అంటే.. నడిచొచ్చిన నమ్మకం
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టుతో.. రాజసమైన నడకతో రాజన్న నడిచొస్తుంటే ప్రజలంతా తమ జీవితాలు బాగు చేసేందుకు నమ్మకమే నడిచొస్తున్నట్లుగా భావించేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. ప్రజాప్రస్థాన యాత్రలో రాజన్నతో కలిసి నాలుగు జిల్లాల్లో నడిచిన సత్తి రామకృష్ణారెడ్డిని వైఎస్సార్ జయంతి సందర్భంగా పాదయాత్ర విశేషాల్ని చెప్పమంటే తీపి గురుతులు జ్ఞాపకం చేసుకున్నారు. ‘‘నేనప్పుడు విశాఖ నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. గతంలో వైఎస్సార్‌ను అడపా దడపా కలిస్తుండేవాడిని. ప్రజాప్రస్థాన యాత్ర ప్రారంభించినప్పటి నుంచి.. పలు జిల్లాల్లో కలిసి ఒక రోజు నడిచి వచ్చేసేవాడిని. కానీ.. తూర్పుగోదావరిలోకి ప్రవేశిస్తోందనగా ఆయనకు స్వాగతం చెప్పి వచ్చేద్దామని అనుకుని వెళ్లా. ఆ రోజు రాజన్నను చూశాక ఆశ్చర్యపోయా. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభమైనప్పుడు ఆయన ముఖంపై ఎలాంటి చిరునవ్వు ఉందో.. వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా అదే చిరునవ్వు చూసి మంత్ర ముగ్థుడినైపోయా. స్వాగతం చెప్పి వచ్చేయాలనుకున్న నేను.. ఆయనతో కలిసి నడక ప్రారంభించా. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 31 రోజుల పాటు 630 కిలోమీటర్లు వైఎస్సార్‌తో కలిసి పాదయాత్ర ముగిసిన వరకూ ఉన్నాను. ఆయన వేసిన ప్రతి అడుగుకో సమస్య వినిపించేది. రాజన్న వస్తున్నాడంటూ పంటపొలాల నుంచి కూలీలు పరిగెత్తుకొచ్చి తమ సమస్యలు చెప్పేవారు. అందరికీ చిరునవ్వుతో సమాధానమిచ్చే వైఎస్సార్ సహనమే ఆయనకు ఆభరణంగా మారింది. నేను విన్న చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో లబ్ధి కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనలోని గుణాల్ని దగ్గరినుంచి చూశాక రాజన్న అడుగుజాడల్లో నడవాలనీ, ఆయన ఆశయ సాధనకు కృషిచెయ్యాలని నిర్ణయించుకున్నా. వైఎస్సార్ మరణించారన్న వార్త విని ఎంతో మనోవేదనకు గురయ్యాను. అలాంటి నేత మళ్లీ రారని అనుకున్నాను. కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో వెఎస్సార్ మళ్లీ వచ్చారని ముఖ్యమంత్రి పాలనతో ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.’’ అని సత్తి రామకృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రస్థానంలో వైఎస్సార్‌తో కలిసి నడుస్తున్న సత్తి రామకృష్ణారెడ్డి బెల్లం తీయన..ఆయన మనసు చల్లన మునగపాక(యలమంచిలి): మహానేత రాజన్నతో మునగపాకకు విడదీయరాని అనుబంధం ఉంది. 17 ఏళ్ల క్రితం రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో 2002 ఏప్రిల్ 4న డ్వాక్రాసదస్సుకు హాజరయ్యేందుకు పరవాడ నుంచి అచ్యుతాపురం మీదుగా మునగపాకకు వచ్చారు. ఈ సందర్బంలో మునగపాకకు చెందిన ఆడారి పోలయ్య క్రషర్వద్ద బెల్లం తయారీ జరుగుతుండడంతో తన వాహనం నుంచి కిందకు దిగి రైతు తయారు చేస్తున్న బెల్లాన్ని పరిశీలించారు. బెల్లం తయారీ ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే వ్యవసాయ రంగానికి 7గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలంటూ రైతులు రాజన్న దృష్టికి తీసుకువచ్చారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్‌రెడ్డి మొదటి సంతకంగా ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేయడం, అలాగే 7గంటల పాటు ఏకధాటిగా విద్యుత్ సరఫరా అందజేయడంతో రైతుల నుంచి నాడు హర్షాతిరేకాలు వినిపించాయి. బెల్లం తయారీని ఆసక్తిగా తిలకిస్తున్న రాజన్న(ఫైల్‌ఫొటో) ప్రతి ఇంట్లో మహానేత ఫొటో అరకులోయ: వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో గిరిజనులకు చెప్పలేనంత అనుబంధం ఉంది. ముఖ్యంగా కోడిపుంజువలస గిరిజనులకు రాజన్న ఆరాధ్య దైవమనే చెప్పాలి. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో రాజన్న ఫొటో ఉంటుంది. గిరిజనుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభా రవిబాబు గత ఏడాది కొడిపుంజువలసలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2005 సంవత్సరం ఆగస్టు నెలలో కొడిపుంజువలసలో వరద బీభత్సం సృష్టించింది. కొండదిగువున గ్రామం కావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. 36 ఇళ్లు కొట్టుకుపోయాయి. నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో 19 గల్లంతయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రాత్రికి రాత్రే సహాయక బృందాలను పంపి అప్రమత్తం చేశారు. అప్పటి ఎస్.కోట ఎమ్మెల్యే కుంభా రవిబాబు కూడా కొడిపుంజువలసలో జరిగిన అపార నష్టాన్ని వైఎస్సార్‌కు ఫోన్లో వివరించారు. గ్రామ గిరిజనులు నిరాశ్రయులవ్వడంతో చలించిన వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కొడిపుంజువలసకు చేరుకున్నారు. గిరిజనులకు ఏర్పడిన నష్టం, 19మంది గల్లంతు సంఘటనపై మహానేత వైఎస్సార్ కన్నీళ్లు పెట్టారు. బాధిత గిరిజన కుటుంబాలను ఓదార్చి, తాను ఉన్నాననే దైర్యాన్ని ఇచ్చారు. మోడల్ కాలనీ నిర్మాణం : సర్వస్వం కొల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన కొడిపుంజువలస గ్రామంలో 36 కుటుంబాలతో పాటు, సమీపంలోని మరో వీధిలో నివసిస్తున్న మిగిలిన కుటుంబాలను వైఎస్సార్ ఆదుకున్నారు. గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించి,78 పక్కా గృహాలతో యుద్ధప్రాతిపదికన మోడల్ కాలనీని నిర్మించారు. గుండెల్లో గుడి కట్టారు పెందుర్తి: సబ్బవరం మండలం జోడుగుళ్లు కూడలి వద్ద నివాసం ఉంటున్న ముర్రు రామునాయుడుకి నలుగురు కుమారులు. రామునాయుడు చిన్నపాటి మెకానిక్, విద్యుత్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకునే ఆర్థిక స్తోమత లేదు. ఆ సమయంలో మహానేత డాక్టర్ వైఎస్సార్ అధికారంలోకి రావడం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో వీరికి వరమైంది. పెద్దకుమారుడు మధనశేఖర్ పెందుర్తి మండలం నరవలోని ఓ ప్రవేటు కళాశాలలో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఏడాదికి రూ.37 వేలు ఇతని చదువు నిమిత్తం చెల్లించింది. ప్రస్తుతం అదే కళాశాలలో మధనశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్థిరపడ్డారు. రెండో కుమారుడు డిగ్రీ చదివి బ్రాండిక్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో కుమారుడు ఫణీంద్రకుమార్ భీమిలిలోని ఓ కళాశాలలో ఐటీ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. నాలుగేళ్లూ అతని చదువు పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించింది. అదే కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.60 వేలు పైబడిన వేతనంతో స్థిరపడ్డారు. ఆఖరి కుమారుడు రాజశేఖర్ నరవలోని ఓ కళాశాలలో ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కొలువు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలా తమ పిల్లలను ఆ మహానేత ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా చదివించినందుకు కృతజ్ఞతగా తన ఇంట్లో పూజగదిలో వైఎస్సార్ చిత్రపటాన్ని ఉంచి నిత్యం పూజిస్తున్నారు. -
'టీ'కొట్టు.. ఓటు పట్టు
సిద్దిపేటరూరల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో ప్రజల పార్టీగా మారిందని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. టీ అమ్ముకునే దుకాణం వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కమాలరామచంద్రం, ఎంపీటీసీలు, దేవేందర్, ఏకాంభరం, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి
గంగవరం: సంక్షేమపథకాలు అర్హులకు అందాలని మండల టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్‌నాయుడు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రసాద్‌నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్యకర్తలు ప్రజల్లోనికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్, నాయకులు శ్రీనివాసులు నాయుడు, వెంకటరమణారెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.