లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించాలి: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Meeting On Welfare Schemes | Sakshi
Sakshi News home page

ఆ పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్ ‌సిగ్నల్‌

Published Tue, Jan 19 2021 6:52 PM | Last Updated on Wed, Jan 20 2021 4:11 PM

YS Jagan Mohan Reddy Meeting On Welfare Schemes - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకాల్లో రుణాల మంజూరును మార్చిలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంగళవారం నాడు ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంచి వ్యవస్థ ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రెండో విడత చేయూత అందించే సమయానికి మరింత మంది సంక్షేమ పథకాల్లో వచ్చేట్లు చూడాలని సూచించారు. పశువులకు సంబంధించి పూర్తి హెల్త్‌కార్డులను కొనసాగించాలన్నారు. పశువుల ఆస్పత్రులను నాడు-నేడు తరహాలో ఆధునీకరించాలని తెలిపారు. అన్ని సేవలు ఆర్బీకేల్లో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిని సీఎం జగన్‌ ఆమోదించారు. (చదవండి: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement