
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి పట్ల భయపడొద్దని, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కరోనా బాధితులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 0866- 2428666కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారని, ఆయన మాట ఇచ్చారంటే కచ్చితంగా నిలబెట్టుకుంటారని వల్లభనేని వంశీ అన్నారు. (‘స్వలాభం కోసమే టీడీపీ కుట్రలు)