జ(గ)న్‌ రంజక పాలనకు ఏడాది | YS Jagan Mohan Reddy One Year Rule Special Story YSR Kadapa | Sakshi
Sakshi News home page

జ(గ)న్‌ రంజక పాలనకు ఏడాది

Published Sat, May 30 2020 11:41 AM | Last Updated on Sat, May 30 2020 11:41 AM

YS Jagan Mohan Reddy One Year Rule Special Story YSR Kadapa - Sakshi

ప్రజల సంక్షేమం కోసం నాన్న ఒక అడుగు వేస్తే నేను మరో అడుగు ముందుకు వేస్తాను. మ్యానిఫెస్టో అంటే హామీల చిట్టా కాదు..దానిని పవిత్ర గ్రంథంగా భావించాలి. అందులో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చాలి. ఇచ్చిన ప్రతి హామీకి ఉంటాను. నెరవేర్చి మీ గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంటాను– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,ముఖ్యమంత్రి (ఏడాదిక్రితం)

నేను ఉన్నాను..నేను విన్నాను..తాను చేసిన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోట వినిపించిన మాట..టీడీపీ పాలనలో విసిగి వేసారిన ప్రజలకు ఈ మాట కొండంత ఊరట..కరవు కాటకాలతో అల్లాడుతూ కష్టాలతో కాపురం చేస్తున్న జనానికి పెద్ద బాసట.. రాజన్న బిడ్డ మాట ఇస్తే తండ్రిలాగే నెరవేరుస్తాడనివారి నమ్మకం..ఏడాది క్రితం ఇదేరోజున అఖండవిజయం సాధించి ‘జగన్‌ అనే నేను..’ అని తమ ప్రియతమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తుంటే రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన సొంతగడ్డ ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది. బాధ్యతలు చేపట్టింది మొదలు ఆయన సారథ్యంలో సర్కారు సంక్షేమానికి బాటలు వేసింది. ప్రపంచం లో మరెవ్వరూ చేయని విధంగా రికార్డు స్థాయిలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చింది. ఎన్నికలముందు ఇవ్వని హామీలనూ అమలుచేసి అబ్బురపరిచింది. సంక్షేమానికి పట్టం కడుతూ అభివృద్ధికిఅగ్రస్థానమిస్తూ సాగిన ఏడాది ప్రస్తానంపై ప్రత్యేకకథనాలు..

సాక్షి ప్రతినిధి,కడప/నెట్‌వర్క్‌.: ట్రిగ్గర్‌ నొక్కడమే ఆలస్యం అన్నట్లుగా బుల్లెట్‌ దూసుకుపోతుంది. అంతే స్పీడుగా ఇచ్చిన హామీలను జ‘గన్‌’  అమలు చేస్తారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా నిలుస్తారు. పేదల బతుకులు బాగుండాలని తపిస్తారు. ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని ఆశిస్తారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మంచి భవిష్యత్తుకు పునాది వేస్తారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కరోనా కష్టాల్లోనూ పథకాలు అమలు చేస్తూ ఔరా అనిపించారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టాభిషిక్తుడై మే 30వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది పాలన జనరంజకంగా ఉందంటూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో లబ్ధిపొందిన వారి అభిప్రాయాలు.

రైతు రాజ్యం
మనబడి నాడు నేడు కింద 1017 పాఠశాలలకు మహర్దశ. రూ. 225.93 కోట్లు
2.39 కోట్ల నిధులతో 755 యూనిట్లలో ఖరీఫ్‌లో పొలంబడి కార్యక్రమం
రూ. 1.96 కోట్లతో 615 యూనిట్లలో రబీలో పొలం బడి నిర్వహణ
గత ప్రభుత్వంలో ఇవ్వకుండా ఎగ్గొట్టిన 24 వేల మంది రైతులకు చెందిన రూ. 154కోట్లు బీమా మంజూరు
2014–18 మధ్య కాలంలో చనిపోయిన 37 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున 2019 నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న 53 మంది రైతులకు సంబంధించి రూ. 5.55 కోట్లు పంపిణీ
13,916 మంది రైతులకు చెందిన 4.17 లక్షల క్వింటాళ్ల బుడ్డశనగలకు సంబంధించి క్వింటాలుకు రూ. 1500 చొప్పున రూ. 28 కోట్ల బోనస్‌ అందించారు.
రూ. 72 కోట్లతో వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌ అందించేందుకు 116 ఫీడర్లలో పనులు చేపట్టారు.
రైతులకు 40 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తున్నారు.

పారిశ్రామికాభివృద్ధి:  
15 వేల కోట్లతో 30 లక్షల టన్నుల సామర్థ్యంతో జమ్మలమడుగు వద్ద ఉక్కు ఫ్యాక్టరీ, 25 వేల మందికి ఉద్యోగాల కల్పన
సూక్ష్మ, చిన్న, మ«ధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి ఎస్సీ, ఎస్బీ, ఓబీసీ, జనరల్‌ కేటగిరీలకు చెందిన 772 మందికి రూ. 48.97 కోట్లు ఇన్సెంటీవ్‌ రిలీజ్‌ 10.5 ఎంటీపీఏ సామర్థ్యంతో రెండు సిమెంటు ఫ్యాక్టరీల విస్తరణ. గాలివీడు వద్ద అల్ట్రా మెగా సోలార్‌ పార్కు ఏర్పాటు మైలవరం వద్ద సోలార్‌ పార్కు ఏర్పాటు ఎర్రగుంట్ల వద్ద శ్లాబ్‌ పాలిసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు

 శ్రీకారం చుట్టుకోనున్న సాగునీటి ప్రాజెక్టులకులు
రూ. 1350.10 కోట్లతో రాజోలి ఆనకట్ట నిర్మాణం.
కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ.
రూ. 564.60 కోట్లతో కుందూ, తెలుగుగంగ
ఎత్తి పోతల పథకం...1.77 లక్షల ఎకరాల స్థిరీకరణ
రూ. 312.30 కోట్లతో జోలదరాశి రిజర్వాయర్‌...
కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ
రూ.3000 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్‌–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనుసంధానం....2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
రూ. 86.50 కోట్లతో వెలిగల్లు, గాలివీడు ఎత్తిపోతల పథకం
రూ. 340.60 కోట్లతో రాయచోటి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ
రూ. 40 కోట్లతో ఝరికోన లిఫ్ట్‌
20 టీఎంసీల సామర్థ్యంతో కొండాపురం వద్ద
బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం
రెండు వేల క్యూసెక్కులతో గండికోట, సీబీఆర్‌ లిఫ్ట్‌
రాబోయేకాలంలో గండికోటలో 26.85 టీఎంసీలు నీరు పెట్టేందుకు చర్యలు
జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌–1, ఫేజ్‌–2 పనులు పూర్తి చేసి 1.55 లక్షల ఎకరాలకు సాగునీరు
6 వేల క్యూసెక్కులకు జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ విస్తరణ
10 వేల క్యూసెక్కులకు గండికోట టన్నెల్‌ విస్తరణ
30 వేల క్యూసెక్కులకు అవుకు టన్నెల్‌ విస్తరణ

వైద్య నిర్మాణాలకు పునాదిరాళ్లు
రూ. 347 కోట్లతో పులివెందులలోమెడికల్‌ కళాశాల ఏర్పాటు
రూ. 175 కోట్లతో రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌
రూ. 107 కోట్లతో రిమ్స్‌లో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం
రూ. 40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు.

పరిశ్రమల కోసం భూ కేటాయింపులు
కొప్పర్తి మెగా ఇండస్ట్రీయల్‌ పార్కుకు 6500 ఎకరాల కేటాయింపు
పులివెందులలో 824 ఎకరాలు
యాదవపురం 272 ప్లాట్స్‌
ఎంఎస్‌ఎంఈఆర్‌ 104.67 ఎకరాలు
శెట్టిగుంట 65 ఎకరాలు.....మైదుకూరు 34 ఎకరాలు

 వివిధ సంక్షేమపథకాల ద్వారా జిల్లాలోలబ్ధిపొందిన వారి సంఖ్య 
అమ్మ ఒడి పథకం 2,55,587
రైతు భరోసా   2,90,630
రైతులకు సున్నా వడ్డీ పథకం 3,69,377
జగనన్న వసతి దీవెన   70,884
జగనన్న విద్యా దీవెన   70,884
జగనన్న గోరుముద్ద  2,18,238
వైఎస్సార్‌ కంటి వెలుగు– 4,12,301
పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు –1.22 లక్షలు
నేతన్న నేస్తం   – 11,774
పోలీసులకు వీక్లీ ఆఫ్‌   – 4342
వైఎస్సార్‌ పెళ్లికానుక   – 3412
ఆశా వర్కర్లకు జీతాల   – 2600
వైఎస్సార్‌ వాహనమిత్ర  – 12,116
సామాజిక పెన్షన్ల పెంపు వర్తింపు – 3,25,949
వైఎస్సార్‌ ఆసరా కింద 39,912 సంఘాలు
సున్నా వడ్డీ కింద 12,162 సంఘాలు
డ్వాక్రా యానిమేటర్లు, రీసోర్స్‌ పర్సన్లు 2125
వైఎస్సార్‌ ఆసరా కింద మెప్మా ద్వారా 8200 సంఘాలు
మైనార్టీ విద్యార్థులకు వసతి, దీవెన, విద్యా దీవెన– 12,009
మౌజన్, ఇమామ్, చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం – 1400
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 43,976 సంఘాలు
మధ్యాహ్న భోజన కార్మికుల జీతాల పెంపు– 6734
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు జీతాల పెంపు – 6889
రూ. 10వేలు పొందిన అగ్రిగోల్డ్‌ బాధితులు– 18,864
పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు   – 2730
ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులు– 3700
న్యాయవాదులకు నెలకు రూ. 5 వేలు ఆర్థికసాయం– 200
ఇంటి వద్దకే బియ్యం7.50 లక్షల కార్డుదారులు
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం పొందినవారు – 6329
వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉపాధి పొందినవారు – 14,483
డయాలసిస్‌ పేషంట్లకు రూ. 3 నుంచి 10 వేలకు పెన్షన్‌ పెంపు – 557

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement