
సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్ పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర పార్టీకార్యాలయం వద్ద ఘనంగా వేడుకలను నిర్వహించారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావడంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి, దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయ్యింది. రాష్ట్ర స్వరూపాన్ని సీఎం జగన్ మార్చేశారు. భావితరాలు మెచ్చే విధంగా ఏడాది పాలన సాగింది. మేనిఫెస్టోలో పెట్టిన 90శాతం హామీలను అమలు చేశారు. ప్రజలు జగన్‌మోహన్ రెడ్డి మీద నమ్మకాన్ని నిలబెట్టారు. చదవండి: రైతు ముంగిటకే సమస్త సేవలు
సీఎం జగన్ విజన్ ఉన్న నేత. సంక్షేమం అనేది వైఎస్సార్ కుటుంబానికే సాధ్యం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా జగన్ తన ఏడాది పాలనలో ప్రజలకు అందించారు. చంద్రబాబులా ఇచ్చిన మాట తప్పడం జగన్‌కు అలవాటు లేదు. చంద్రబాబు గురించి ప్రజలు మర్చిపోయారు. సీఎంపై విమర్శలు చేసేందుకే మహానాడు పెట్టారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క తీర్మానం చేయకుండానే మహానాడును ముగించారు. జగన్‌మోహన్ రెడ్డి హామీలు అమలు చేయలేరని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. కానీ పదవి చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి చూపించారు. చంద్రబాబు తనలాగే అందరూ మాట తప్పుతారని భావిస్తాడు. కానీ జగన్ మాట ఇస్తే అమలు చేసి చూపిస్తాడు. చదవండి: ‘పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ’
కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య, వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చరిత్ర గతిని మారుస్తున్న నాయకుడు సీఎం జగన్. ఏడాది పాలన, అందించిన సంక్షేమ కార్యక్రమాలపై గత ఐదు రోజులుగా సమీక్షలు జరిపారు. నిపుణలు, లబ్ధిదారులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత అకుంఠిత దీక్షతో పాలన కొనసాగిస్తారని' సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..
Comments
Please login to add a commentAdd a comment