సాక్షి, విజయవాడ: కొన్ని దశాబ్దాలుగా పోలీస్ శాఖలో అమలుకాని వీక్లీ-ఆఫ్‌లను అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకులు శ్రీనివాసరావు అన్నారు. ఏడాది పాలనలో పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శనివారం జగన్ ఏడాది పాలనపై ఆయన విజయవాడలో మాట్లాడుతూ... విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీస్ కుటుంబాలకు చెల్లించే పోలీస్ బీమా 20 లక్షలు, ఎస్ఐలకు 25 లక్షలు, సీఐలకు 30 లక్షలు, ఆ పై స్థాయి వారికి 40 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని హోంగార్డ్‌ల జీతాలను పెంచారు. సీఐడీ, దిశ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్ క్రింద 30 శాతం మంజూరు చెశారు. ఇటీవల కోవిడ్-19 విధులలో ఉండి మరణించిన అనంతపురం జిల్లా ఏఎస్ఐ హబీబుల్లా కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం సంతోషం అని శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment