
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఉరిశిక్ష వేసిన సంగతి టీడీపీ గుర్తుంచుకోవాలని చురకలు అటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చారని ప్రశంసించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని చెప్పారు. సామాజిక పెట్టుబడి అవశ్యకతను సీఎం జగన్ గుర్తించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.