సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీతో దేవుడిలా ఆదుకు న్నారు... డబ్బులేక విలవిల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించి ప్రాణభిక్ష పెట్టారు. చికిత్స అనంతరం ఇంటికే పెన్షన్లు కూడా పంపిస్తున్నారు. మా బిడ్డలను అనాథలు కాకుండా ఆదుకున్నారు. మీ మేలు జన్మజన్మలకూ మర వలేం... ఇదీ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఆనందం. ‘మన పాలన – మీ సూచన’లో భాగంగా వైద్య ఆరోగ్య రంగంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం మేధోమథన సదస్సు అనంతరం లబ్ధిదారులు, వైద్య నిపు ణులతో ముఖాముఖి నిర్వహించారు.
మీకు మాత్రమే సాధ్యం...
నాకు ముగ్గురు ఆడ పిల్లలు. డిసెంబరు 14వ తేదీన గుండెనొప్పి రావ డంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకున్నా. డిశ్చార్జ్ అయిన మరుక్షణమే వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.9,500 అందాయి. ఇలాంటి పథకాలు మీకు (సీఎం జగన్) మాత్రమే సాధ్యం.
– ఎం. రామ్మోహన్ రెడ్డి, వేంపల్లె, వైఎస్సార్ జిల్లా
థాంక్యూ మామయ్యా..
నాకు కళ్లు సరిగ్గా కనిపిం చేవి కావు. స్కూల్లో కంటి పరీక్షలు చేసి పొర ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీలో నా కంటికి ఉచితంగా ఆపరే షన్ చేశారు. ఇప్పుడు నేను బాగా చూస్తున్నాను. జగన్ మామయ్యకు థాంక్స్.
– కె.మహేంద్ర, పాలచర్ల, 4వ తరగతి
చిన్నారులకు కంటి వెలుగు...
రాష్ట్రంలో 70 లక్షల మంది స్కూలు పిల్లలకు తొలివిడత కంటివెలుగులో 10 రోజుల్లోనే స్క్రీనింగ్ పరీక్షలు చేయడం గొప్ప విషయం. 1.58 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మూడో దశ కంటివెలుగులో అవ్వాతాత స్కీంలో 3 లక్షల మంది లబ్ధిదార్లను నాలుగు వారాల్లోపే పరీక్షించి 15 రోజుల్లోనే 6 వేల శస్త్రచికిత్సలు నిర్వహించాం. 97 మంది పిల్లలకు కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరం కాగా చాలామందికి ఇప్పటికే శస్త్రచికిత్సలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతిక భాగస్వామిగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆప్తాల్మిస్టులకు, ఆశావర్కర్లకు శిక్షణనివ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది.
– డాక్టర్ అరవింద్ రాయ్, కంటి వైద్య నిపుణులు, విజయవాడ
అనాథలు కాకుండా ఆదుకుంది
ఆరోగ్యశ్రీ ద్వారా భీమ వరంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా. మా పిల్లలు అనాధలవుతారని భయపడిన సమయంలో మీరిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డే ఆదుకుంది. చాలా సంతోషంగా ఉంది.
– జే.నాగరాజు, ఆకివీడు
దేశానికే దారి చూపుతుంది
మీరు (సీఎం జగన్) కోవిడ్ –19 సమస్యను చక్కగా విశ్లేషించారు. ఇ ప్పుడు ప్రపంచం మొత్తం దీన్ని అనుసరి స్తోంది.
తిరుపతిలో సెంటర్ ఫర్ ఎక్సెలెన్సీ ఇన్ వైరాలజీని ఏర్పాటు చేయాలి. ఇది వైరల్ సమస్యలకు పరిష్కారం చూపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ముందడుగు వేస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది.
– ప్రొఫెసర్ బీ జే రావు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , డీన్, తిరుపతి
వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి దీనిపై చర్చిస్తారని సీఎం జగన్ తెలిపారు.
పిల్లలకు పౌష్టికాహారం అందుతోంది..
నాకు ఇద్దరు ఆడపిల్లలు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద మా చిన్న పాపకు నెలంతా పాలు, గుడ్లు, బాలామృతం ఇస్తున్నారు. మా పెద్దపాపకు పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. సాయంత్రం స్నాక్స్ కింద బాలామృతంతో తయారు చేసిన లడ్డు, పాయసం ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. 50 శాతం రిజర్వేషన్లు తెచ్చినందుకు ప్రతి మహిళా తరపున మీకు కృతజ్ఞతలు.
– లక్ష్మీ తిరుపతమ్మ, ఎర్రగుంట పల్లె గ్రామం. చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
సమాచార లోపాన్ని సరిదిద్దాలి...
దివంగత వైఎస్సార్ కృషితో చిత్తూరులో ఏర్పాటైన ‘సీఎంసీ’ 140 పడకలతో అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను కలిగి ఉంది. రోజుకు కనీసం 700 మంది ఔట్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం. 104 సిబ్బంది పీహెచ్‌సీ డాక్టర్లతో కలిసి బృందంగా పనిచేస్తే బాగుంటుంది. చాలా పథకాలు విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం సరైన సమాచార వ్యవస్థ లేకపోవడం. ఎలక్ట్రానిక్ సిస్టంను వాడుకుని దీన్ని మనం మెరుగుపర్చుకోవచ్చు. 1990లో తమిళనాడు మందుల కొనుగోలు, పంపిణీపై మంచి విధానాన్ని అమలు చేసింది. తద్వారా డబ్బుల ఆదాతో పాటు నాణ్యమైన ఔషధాలు అందించవచ్చు. సామాజిక అవగాహనలో భాగంగా విద్యార్ధులు మూడు వారాల పాటు గ్రామాల్లో ఉండేలా మేం కార్యక్రమాలను రూపొందించాం.
– డాక్టర్ అబ్రహం జోసెఫ్, సీఎంసీ వెల్లూరు
దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ దీనిపై మీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి మీతో చర్చిస్తారని చెప్పారు.
రెండుసార్లు ఆదుకున్న ఆరోగ్యశ్రీ
మా ఆయన చనిపోవ డంతో ఇద్దరు పిల్లలను నేనే పోషిస్తున్నా. సొంత ఇల్లు కూడా లేదు. 2018లో నాకు కేన్సర్ సోకడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేశారు. అయితే 7 నెలలకు మళ్లీ రావడంతో మరోసారి ఆరోగ్యశ్రీ ఆదు కుంది. కీమోథెరపీ చేస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి. కేన్సర్ పేషెంట్లకు పింఛన్ లేదంటు న్నారు. మాక్కూడా పింఛన్ ఇప్పించాలి.
– షేక్ గౌసియా, నెల్లూరు జిల్లా
దీనిపై స్పందించిన సీఎం జగన్.. మీరు చెప్పిన దానిపై ఆలోచన చేద్దామని హామీ ఇచ్చారు.
నా పెద్దబిడ్డ ప్రాణం పోశాడు...
నాకు గుండె జబ్బు ఉంది. రూ.5 లక్షలు ఖర్చవు తుందన్నారు. విశాఖ ఇండస్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. నా పెద్దబ్బాయే (సీఎం జగన్) ఆపరేషన్ చేయించాడని భావిస్తున్నా. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా నా కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
– మృత్యుంజయరావు, సాలూరు, విజయనగరం
అద్భుతమైన నిర్ణయం..
కాక్లియర్ ఇంప్లాంట్ కార్యక్రమాన్ని వైఎస్సార్ ప్రవేశపెట్టినప్పుడు దేశంలోని ఈఎన్‌టీ డాక్టర్లంతా నమ్మలేకపో యారు. ఇప్పటివరకు సుమారు 2 వేల మందికి మేలు చేశారు. మరో అద్భుతం ఏమిటంటే దీన్ని కాక్లియర్ ఇంప్లాంట్‌ను రెండు చెవులకు వర్తింపచేయాలని మీరు నిర్ణయించడం. దేశమంతా దీన్ని అనుసరిస్తుంది.
– డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు, ఈఎన్‌టి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, గుంటూరు
ప్రజల్లోకి పథకాలు
ఏఎన్‌ఎంగా మీరు ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. కరోనా వల్ల టెలిమెడిసిన్ ద్వారా మందులు ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నాం. గతంలో పది వేల మందికి ఒక ఏఎన్‌ఎం సర్వే చేయగా గ్రామ సచివాలయాల ద్వారా రెండు వేల మంది జనాభాకి సర్వే చేస్తున్నాం.
– లత, పెనమలూరు, కృష్ణా జిల్లా
లక్షలు ఖరీదు చేసే మిషన్ ఉచితంగానే...
వినికిడి సమస్యకు వైద్య పరీక్షలు, ఆపరేషన్ ఉచి తంగా చేశారు. రూ.లక్షలు ఖర్చయ్యే మిషన్ కూడా ఉచితంగా ఇచ్చారు. అంతే కాకుండా ఒక సంవత్సరం స్పీచ్ థెరపీ ఫ్రీగానే ఇస్తున్నారు. ఒక్క పైసా కూడా మాకు ఖర్చు కాలేదు.
– పఠాన్ ఆరీఫ్ ఖాన్, ఆరోగ్యశ్రీ (కాక్లియర్ ఇంప్లాంట్) లబ్ధిదారుడు, గుంటూరు
మధ్యాహ్నానికే చెక్కు వచ్చేది...
రాష్ట్రంలో తలసేమియా రోగులు 1,500 మంది, హీమోఫిలియా రోగులు 1,500 మంది ఉన్నారు. వీరంతా వైఎస్సార్‌ను తలుచుకుంటారు. ఎందుకంటే.. నిమ్స్ ఆసుపత్రిలో మేం పొద్దున్న చికిత్స విధానాన్ని రాస్తే 11 గంటలకల్లా చెక్కు అందేది. అది రూ.30 వేలైనా, 40 వేలైనా సీఎంవో నుంచి ఇచ్చేవాళ్లు. ఆరోగ్యశ్రీ వచ్చాక తలసేమియా, హీమోఫిలియా బాధితులను చికిత్స పరిధిలోకి తెచ్చారు. మీరు వచ్చిన తర్వాత వారికి పింఛన్ కూడా ఇచ్చారు.
– డాక్టర్ ఎంబీఎస్‌వీ ప్రసాద్, తలసేమియా నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment