తోటపల్లిగూడూరు: వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళలర్పిస్తున్న నాయకులు
సాక్షి, పొదలకూరు (నెల్లూరు): జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశాయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని, దీంతో రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులోని బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్ పదో వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. మధ్యాహ్నం వేలాది మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజన్న అడుగు జాడల్లో నడుస్తూ తన కేబినెట్లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, మొలబంటి శేఖర్‌బాబు, కుడుముల వెంకటేశ్వర్‌రెడ్డి, సంగన పెంచలరెడ్డి, మారు వెంకట్రామిరెడ్డి, తెనాలి నిర్మలమ్మ, కండే సులోచన, ఎస్‌కే అంజాద్, వి.లక్ష్మీనారాయణ, ఎ.బుజ్జిరెడ్డి, డి.విజయభాస్కర్‌రెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి, నోటి వెంకటేశ్వర్‌రెడ్డి, తుమ్మల కిషోర్, తన్నీరు సాయిచంద్ పాల్గొన్నారు. అలాగే మండలంలోని తాటిపర్తిలో నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించి, దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలుకూరు పోలిరెడ్డి, పామూరు లచ్చారెడ్డి, ఎస్కే మహ్మద్, లక్కు శ్రీనివాసులురెడ్డి, లక్కు మల్లికార్జున్‌రెడ్డి, లక్కు సురేంద్రరెడ్డి, పి.వెంకటరమణారెడ్డి, పి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మొగళ్లూరులో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా గ్రామంలో యువకులు ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కారణజన్ముడు డాక్టర్ వైఎస్సార్
ముత్తుకూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కారణజన్ముడని వైఎస్సార్‌సీపీ నేతలు కొనియాడారు. ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వైఎస్ వర్ధంతిని నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కాకుటూరు లక్ష్మణరెడ్డి, మురాల వెంకటేశ్వర్లు, ఈదూరు శ్రీనివాసులురెడ్డి, బైనా రామయ్య, అక్కయ్యగారి శివ పాల్గొన్నారు. అలాగే మామిడిపూడిలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేళపాళెం ప్రభాకరరెడ్డి, పెమ్మారెడ్డి పద్మనాభరెడ్డి, షేక్ గౌస్‌బాషా, రాజారామిరెడ్డి, మీరామొహిద్దీన్, బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నేలటూరు ఎస్సీ కాలనీలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈపూరు గిరిధర్‌రెడ్డి, చీకిరి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేసి, బట్టలు పంపిణీ చేశారు. అలాగే అచ్చన్నతోపులో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేశారు. కందులూరు వెంకటరామరెడ్డి, అన్నం రామసుబ్బయ్య, అన్నం రమేష్, ఎ.ప్రసాద్, హరి, చెంగారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా పంటపాళెంలో నాయకులు నంగాచెంగారెడ్డి, మాదినేని ప్రభాకరనాయుడు, రావి విజయకుమార్‌రెడ్డి, ఈపూరు ధనుంజయ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దొరువులపాళెంలో మాజీ సర్పంచ్ ఇసనాక చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
వైఎస్సార్ ఆదర్శప్రాయులు
తోటపల్లిగూడూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శప్రాయులని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ పదో వర్ధంతి సందర్భంగా సోమవారం తోటపల్లిగూడూరు వైఎస్సార్‌సీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళలర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మాటతప్పని, మడమ తిప్పని నాయకుడిగా ప్రజారంజక పాలన సాగించాడన్నారు. వైఎస్సార్ సువర్ణయుగ పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అండగా నిలవాలన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ మన్నెం చిరంజీవులగౌడ్, నాయకులు కామిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తలమంచి సురేంద్రబాబు, ఆకుల మధు, మన్నెం సుబ్రహ్మణ్యం, ఎంబేటి శేషమ్మ పాల్గొన్నారు. అలాగే పేడూరులో స్థానిక నాయకుడు తిక్కవరపు సనత్‌కుమార్‌రెడ్డి ఆద్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళలర్పించారు. వరిగొండ పంచాయతీలో నాయకులు కామిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సురేష్‌రెడ్డిల ఆధ్వర్యంలో, పాపిరెడ్డిపాళెంలో తిరవళ్లూరు ఈశ్వరయ్య, తివళ్లూరు వెంకటేశ్వర్లు, నెల్లూరు లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో, నరుకూరు సెంటర్‌లో వేగూరు శ్రీనివాసులు, వెలిచర్ల శ్రీనివాసులగౌడ్‌ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
జనం గుండెల్లో చెరగని ముద్ర
మనుబోలు: మహానేత రాజశేఖరరెడ్డి తన జనరంజక పాలనతో జనం గుండెల్లో చెరగని ముద్ర వేశారని వైఎస్సార్‌సీపీ మనుబోలు మండలాధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ పదో వర్ధంతి సందర్భంగా సోమవారం మండలంలోని కట్టువపల్లి ఎస్సీకాలనీలో వైఎస్సార్ అభిమాని గిద్దలూరు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళలకు రవికలు పంపిణీ చేశారు. అలాగే చెర్లోపల్లి, మడమనూరు, వీరంపల్లిల్లోని వైఎస్సార్ విగ్రహాల వద్ద ఆయా గ్రామాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమాల్లో చిట్టమూరు అజయ్‌రెడ్డి, దాసరి మహేంద్రవర్మ, అనమాల ప్రభాకర్‌రెడ్డి, చేరెడ్డి రామిరెడ్డి, కేవీఆర్ గౌడ్, దాసరి భాస్కర్‌గౌడ్, కోసూరు కోటేశ్వర్‌గౌడ్, గిద్దంటి రమణయ్య, దేసిరెడ్డి హరనాద్‌రెడ్డి, ఏలూరు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
పూడిపర్తిలో
వెంకటాచలం: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వెంకటాచలం మండలం పూడిపర్తిలో నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డక్కిలి రమణయ్య, ఎన్.సుధీర్, నాగేంద్ర పాల్గొన్నారు. అలాగే కసుమూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టి.సుధాకర్, తూమాటి వెంకటరామానాయుడు, బాబర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment