
సాక్షి, నెల్లూరు : రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు చేస్తోందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ఉమ్మడి జలాశయం కాబట్టే కేంద్రం జోక్యం చేసుకుందని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ టీడీపీలో మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. రైతాంగం కోసం అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధం. లిఫ్ట్ ఇరిగేషన్‌పై టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి?’’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment