
సాక్షి, తాడేపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలేని లోటు తీర్చలేనిదని, ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ మహానేత మరణించి 11 ఏళ్లయింది. ప్రతి వ్యక్తి వైఎస్సార్‌ని తమ కుటుంబ సభ్యుడని భావించారు. విలువల కోసం కట్టుబడిన వ్యక్తి.. సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. ( నాన్న నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నారు )
కోట్లాది మంది గుండెల్లో మహానేత స్థానం సంపాదించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం అందరికీ ఒక స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితో పుట్టిన పార్టీనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము. వైఎస్సార్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నట్టే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో వైఎస్సార్ సీపీని ముందుకు తీసుకెళ్తామ’’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment