అమరావతి : దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్సార్‌ని గుర్తు చేసుకున్నారు. ‘పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది.నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది’అని పేర్కొన్నారు.
నేడు (సెప్టెంబర్ 2) వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలసి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించిన అనంతరం పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment