
(ఫైల్ ఫోటో)
నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
సాక్షి, అమరావతి: తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారు. ‘నేను వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని సీఎం వైఎస్ జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
మహానేత వైఎస్సార్: నిలువెత్తు సంక్షేమ రూపం
నిరుపేదల గుండె దీపం
నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది#YSRForever
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2021