
సెప్టెంబర్ 2 న దివంగత మహానేత వైస్సార్ వర్ధంతిని పురష్కరించుకుని ముందస్తుగా ఘన నివాళులు అర్పించారు ఆస్ట్రేలియా లోని ప్రవాస భారతీయులు.బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రంమలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైస్సార్ గారు చిరస్మరణీయుడన్నారు. డాక్టర్ వైఎస్సార్ చేసిన గొప్ప పనులు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి , రామకృష్ణ రెడ్డి వల్లూరి ,బిజివేముల రఘు రెడ్డి, కర్రి శ్రీనివాస్ ,అల్లం యుగంధర్ రెడ్డి , కోట శ్రీనివాస్‌రెడ్డి, కనుబుద్ది సురేష్, గాదె విజయేందర్, కిషోర్, చాగంటి వంశీ, బొమ్మిరెడ్డి జస్వంత్, మందా రామకృష్ణారెడ్డిలతో పాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.
ఈ కార్యకమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ముస్తఫా, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ మేడపాటి , చల్లా మధు తదితరులు మాట్లాడారు. నిర్వాహకులను అభినందించారు.
చదవండి : Veena Reddy: ఆ ఘనత సాధించిన భారత సంతతి తొలి వ్యక్తిగా..
Comments
Please login to add a commentAdd a comment