సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎంపీ నందిగం సురేష్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.
చదవండి: మార్గనిర్దేశకుడు వైఎస్సార్.. ఆ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలుగా..
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పాలకుడు ఎలా ఉండాలో చూపిన నాయకుడు వైఎస్సార్ అని, తండ్రి స్ఫూర్తితో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన నడుస్తోందన్నారు. పేదల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు తెచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నామన్నారు.
కాగా, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment