సాక్షి, హైదరాబాద్/అమరావతి: కుల, మత, వర్గ, వర్ణ రాజకీయాలకు అతీతంగా మానవత్వమే తన అభిమతంగా ప్రజా సంక్షేమ సుపరిపాలన అందించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు నిర్వహించారు. మహానేతను మనసారా స్మరించి ఘన నివాళుర్పించారు. వైఎస్సార్ గతించి పదేళ్లయినా ఆయనపై ప్రేమ, అభిమానం చెక్కు చెదరలేదని కొనియడారు.
వైఎస్సార్ సీపీ తెలంగాణ కార్యాలయంలో..
హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ తెలంగాణ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్నినిర్వహించారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మహానేత వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ కార్యదర్శి జల్లేపల్లి సైదులు పూలమాలలు వేసి నివాళర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని ఆరీఫా, రొష్ని వృద్దాశ్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు వైవీ పురుషోత్తం ఆధ‍్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు రొట్టెలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలో సురేష్, అశోక్, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమగోదావరిలో..
జిల్లాలోనూ బుట్టాయిగూడెం మండలం దొరమామిడి, తెల్లవారి గూడెం, బుట్టాయిగూడెం గ్రామాల్లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళర్పించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు,రొట్టె,పళ్లు పంపిణీ చేశారు. పేదవేగి మండలం బాపిరాజు గూడెంలో వైఎస్సార్ విగ్రహాన్ని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి కొఠారి అబ్బాయి చౌదరి ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. తాడేపల్లిగూడెంలోవైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పోలీసు ఐ ల్యాండ్, మసీదు రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళర్పించారు. వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వృద్ధులు, రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.
తూర్పుగోదావరిలో..
మామిడికుదురు మండలం మొగలికుదురులో వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అనాధ ఆశ్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దుప్పట్లు పంపిణీ చేశారు. గోకవరంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహానికి హన్న విద్యా సంస్థల అధినేత బి.సువర్ణకుమార్ టీవీని బహుకరించారు. రంపచోడవరంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. వైఎస్సాఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో రామన్నదొర, రాము, కారుకోడి పూజ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో..
పామర్రు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజశేఖర్, బొమ్మారెడ్డి మధురెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, ఆరుమళ్ళ శ్రీనాధరెడ్డి, ఆరేపల్లి శ్రీనివాసరావు, కిరణ్ రెడ్డి, అబ్దుల్ మొబీన్, పెయ్యేల రాజు పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పూలమాల వేసి నివాళర్పించారు. నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ చిత్రపటానికి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పూలమాల వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ మద్దిరాల కోటమ్మ, రామిశెట్టి మురళి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంటరీ సమన్వయకర్త పొట్లూరి వరప్రసాద్, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పాల్గొని వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు తన్నీరు నాగేశ్వరావు, ఇంటూరి రాజగోపాల్, చౌడవరపు జగదీష్, ఎంవి చలం, తుమ్మల ప్రభాకర్, వేల్పుల రవికుమార్ పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా మహానేత డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళర్పించారు. వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ ఆధ్వర్యంలో ఐదువేల మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకు చీరలు,పండ్లు పంపిణీ చేశారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సేవాదళ్ అధ్యక్షులు వాసు ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి మంత్రి అవంతి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళర్పించారు. పార్క్ హోటల్‌లో జంక్షన్‌లో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ అధికారి ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని వేపగుంట, వేపగుంట, సుజాత నగర్, పెందుర్తి, సబ్బవరం, రాంపురం ప్రాంతాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ పార్లమెంటు అధ్యక్షుడు సరగడం చిన్నప్ప నాయుడు, నక్కా కనకరాజు, మామిడి రాజు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి సత్తి రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం, మాజీ కార్పొరేటర్లు,వార్డుఅధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి మంత్రి అవంతి శ్రీనివాస్,ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పూల మాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ, విఎంఆర్‌డిఏ ఛైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.
దివంగత మహానేత వైఎస్సాఆర్ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌లు పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు దంతులూరి దిలీప్ కుమార్,మళ్ల బుల్లిబాబు,కాండ్రేగుల విష్ణు మూర్తి, జాజుల రమేష్, కొణతాల మురళీ కృష్ణ పాల్గొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పాయకరావు, నక్కపల్లి, ఎస్.రాయవరంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు వృద్ధులకు దుప్పట్లు, రోగులకు పాలు,పండ్లు పంపిణీ చేశారు.వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, బొలిశెట్టి గోవిందు,మధువర్మ,బాబూరావు, సాయిబాబా పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో అరకులోయలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుంబా రవిబాబు వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అరకు వ్యాలీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. చోడవరం కొత్తురు జంక్షన్‌లో నిర్వహించిన దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో పేదలకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు.
అనంతపురం జిల్లాలో...
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ చిత్రపటానికి ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లాలో..
మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నందికొట్కూరులోని వైఎస్సార్ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్థర్ పూలమాల వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చెరుకుచెర్ల రఘురామయ్య, భరత్ కుమార్ రెడ్డి, ధర్మారెడ్డి, రమాదేవి, వనజ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో..
పుల్లిచెర్ల మండలం కల్లూరులో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి రాష్ట్ర్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు. మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కలికిరిలోని వైఎస్సార్ విగ్రహానికి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు. సంతపేటలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు జగదీష్, పురుషోత్తమరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ పట్టణంలో వైఎస్సార్ చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు రైతులు, పేదలు, విద్యార్థులు అన్నివర్గాల మేలు చేశాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తండ్రి ఆశయాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగిస్తారని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment