దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేయవచ్చో, వారిని ఆరోగ్యవంతులుగా, ఉన్నత విద్యావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చో.. నిరూపించి వారి హృదయాల్లో నిలిచిపోయారు. ప్రజలను కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టాలు, కన్నీళ్లు.. వాటికి కారణాలు తెలుసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించి.. మీకోసం ఎందాకైనా.. అంటూ నడిచి నిలిచారు. గలగలా జలాలు పారించి నోళ్లు తెరిచిన బీళ్లకు ఊపిరి పోశారు. ఆయన భౌతికంగా దూరమై నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేం. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అంటూ ఆప్యాయమైన ఆయన పిలుపు చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది.
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీ ప్రభుత్వ దోపిడీ, దౌర్జన్యాలు, దాష్టీకాలపై మడమతిప్పకుండా పోరా డారు. ఆ చీకటి పాలనలో నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా ప్రస్థానం పేరుతో 1,475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి భరోసా కల్పించారు. ప్రజల కష్టాలు విన్నారు. కన్నీళ్లు తుడిచారు. 2004 సాధారణ ఎన్నికల్లో ప్రజ లు బ్రహ్మరథం పట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు.
పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సం తకంతో ఎత్తేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకుపైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ.. ఆ తర్వాత ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కి తగ్గలేదు. పావలా వడ్డీకే రైతులకు రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. 2004 – 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1,000 వరకు పెరిగిందంటే.. అది ఆ యన కృషే. నదీ జలాలను తెలుగునేలకు మళ్లించి.. సుభిక్షం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. శరవేగంగా పనులు చేసి.. నీళ్లందించి అపర భగీరథుడిగా నిలిచారు.
విద్య, వైద్యం..
అందరికీ అవసరమైన విద్య, వైద్యాలను అందు బాటులోకి తీసుకొచ్చారు. పేదరికం వల్ల ఏ ఒక్క రూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. లక్షలాదిమంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓసీ విద్యార్థులు ఉన్నత విద్యావంతులయ్యేలా చేశారు. ఉన్నత చదువులు అందరికీ అందుబాటు లోకి రావాలని జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఐటీ)ని ఏర్పాటు చేయించారు. బాసర, ఇడు పులపాయ, నూజివీడుల్లో ట్రిపుల్ ఐటీలను ఏర్పా టు చేశారు.
వైద్యానికి డబ్బులేక ఏ ఒక్కరూ ఇబ్బం ది పడకూడదనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్, గర్భకోశవ్యాధులు, గుండె జబ్బులు తదితర 942 వ్యాధులకు చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీని రూపొందించి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా దక్కేలా చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను మహానేత వైఎస్ రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకం వివిధ పేర్లతో అమలవుతోందంటే ఆయన దార్శనికత అర్థమవుతోంది. ఫోన్ చేసిన నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యే 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 వైద్యసేవలకు ఆయనే శ్రీకారం చుట్టారు.
తనయుడు.. మరో రెండడుగులు ముందుకు
ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనం అభ్యున్నతి కోసం రెండడుగులు ముందుకేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు తోడ్పాటును అందించేందుకు రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతుకు అన్నింటా సాయంగా నిలుస్తున్నారు.
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్–19ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో వైద్యవ్యవస్థను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment