
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. తన పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 2 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 2.30 గంటలకు కడపకు విమానంలో బయలుదేరివెళ్తారు.
కడప విమానాశ్రయం నుంచి 3.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలం వేల్పులకు చేరుకుంటారు. అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.10 గంటల నుంచి 5.10 గంటల మధ్య వేల్పుల గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు వేల్పుల నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.
2న సీఎం షెడ్యూల్..
సెప్టెంబర్ 2న ఉదయం 8.50 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 9 గంటల నుంచి 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సాయంత్రం 5 గంటల వరకు సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 5.10 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
3న షెడ్యూల్ ఇదీ..
సెప్టెంబర్ 3న ఉదయం 8.50 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ నుంచి 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడ నుంచి ఉదయం 10.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment