
న్యూజిలాండ్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నివాళులు అర్పించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆనంద్ ఎద్దుల నాయకత్వంలో ఆక్లాండ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుష్మిత చిన్నమలరెడ్డి, సమంత్ దాగెపూడి, శివ గండ, మనోజ్ అల్లం, విజయ్ ఆల్ల, గీతా ఇందూరి, ప్రణవ్ అన్నమరాజు, శ్రీనివాస్ గోట్ల, వినయ్ చంద్రపతి, శ్రద్ధా సాయిలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సభ్యుల కృషిని ఏపీ ఉమెన్స్ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు అభినందించారు.









Comments
Please login to add a commentAdd a comment