![Election Commission: File FIR Against Those Celebrating Poll Results Amid Covid19 - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/2/49.jpg.webp?itok=GvwN57-t)
న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాల అనంతం జరిపే విజయోత్సవాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఐదు రాష్ట్రాల సీఎస్‌లకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా నేడు (మే 2) నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థుల మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, రోడ్‌షోలు జరుపుకుంటున్నారు.
కౌంటింగ్‌లో డీఎంకే, టీఎంసీ పార్టీ ముందజలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ మద్దతుదారులు కోల్‌కత్తా, చెన్నైలలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, అతిక్రమించినవారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. పనిలో అలసత్వం వహించిన సంబంధిత ఎస్‌హోచ్‌ఓను సస్పెండ్ చేయాలనే ఆదేశించింది. ప్రతి ఎఫ్‌ఐఆర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొంది.
చదవండి:
మే 2న ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక నిర్ణయం
తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment