దిగ్విజయంగా కొనసాగుతున్న ఆటా నాదం పాటల పోటీలు | ATA NAADAM Singing Competition Going Well | Sakshi
Sakshi News home page

దిగ్విజయంగా కొనసాగుతున్న ఆటా నాదం పాటల పోటీలు

Published Wed, Nov 10 2021 8:33 PM | Last Updated on Wed, Nov 10 2021 9:12 PM

ATA NAADAM Singing Competition Going Well - Sakshi

అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహిస్తోన్న ఆటా నాదం పాటల పోటీలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆటా జూమ్ ద్వారా ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపుగా 200 మంది గాయని గాయకులు ఈ పోటీలో పాల్గొన్నారు. అక్టోబర్ 23న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి సెమి ఫైనల్స్ నవంబర్ 6 న ముగిశాయి. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్  నిహాల్ కొందూరి , ప్లేబాక్ సింగర్  విజయ లక్ష్మి,  సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు

నవంబరు 13న
ఇరు తెలుగు రాష్ట్రాలనుండి పదకొండు మంది గాయని గాయకులు అభినవ్ అవసరాల, గీత మహతి పిసుపాటి, జ్యోస్న నిమ్మలపాడి, లక్ష్మి శ్రీవల్లి కాందూరి, లేఖ సదా ఫణిశ్రీ వీర,మేఘన నాయుడు దాసరి, నిగమ నెల్లుట్ల, ప్రణతి కే , సాయి శృతి పొలిశెట్టి, సాకేత్ కొమ్మజోస్యుల,వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల ఫైనల్ రౌండ్ కు ఎంపిక అయ్యారు. గెలుపొందిన ఈ గాయని గాయకులు మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన న్యాయనిర్ణేతగా  2021 నవంబర్ 13న జరిగే ఫైనల్స్ లో పోటీపడబోతున్నారు. ఈ పోటీలో విజేతలకు 2021 డిసెంబరు 26 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలేలో పాడే అవకాశం కల్పిస్తున్నారు. 

మొదటిసారి
ఉత్తరాధ్యక్షులు మరియు ఆటా సేవ డేస్ మరియు ఆటా వేడుకల చైర్మన్‌ మధు బొమ్మినేని,   పాలకమండలి సభ్యులు , సంయుక్త  కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల , పాలక  మండలి సభ్యులు  సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ అనిల్ బొద్దిరెడ్డి , పాలక మండలి సభ్యులు  సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి మాతృదేశంలో ఇరు తెలుగురాష్ట్రాలలో ప్రతిభఉన్న గాయనిగాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement