
సాక్షి, విజయవాడ: కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాలు దీపాలు వెలిగించే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగా ఇంద్రకీలాద్రి కోటి దీపకాంతులతో వెలిగిపోతుంది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గానగర్ మాడవీధుల వరుకు భక్తులు దీపాలతో అలంకరించారు. కోటి దీపోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. దుర్గామల్లేశ్వర స్వామి వారికి పూజారులు ఘనంగా జ్వాలాతోరణం నిర్వహించారు.
రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వేద మంత్రాల ఘోషతో మారుమోగుతోంది. కార్తీక పూర్ణిమ హారతి కార్యక్రమాన్ని బుద్ధవరుపు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించింది. గోదావరి హారతి కార్యక్రమనికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పలువురు ప్రజాప్రతిధులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment