ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా జూంలో జాయిన్ అయ్యి ప్రసంగించారు. ఈ వేడుకలలో సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ రెడ్డి, అడ్వైసర్ కోటి రెడ్డి, మలేషియా కన్వీనర్ భాస్కర్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, సందీప్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, చంద్ర, కృష్ణారెడ్డి, సుధీర్, సుహాస్, యుగంధర్, దొరబాబు, సత్యనారాయన రెడ్డి, శ్రీనాథ్, శ్రీని, మధుతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు.
సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా జగనన్న నిలిచారని ప్రవాసులు కొనియాడారు. విద్య, వైద్యం, పోర్టులు వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిరాని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment