economic achievements
-
మన్మోహన్ చేసిన వంద రోజుల మ్యాజిక్..
రెండేళ్ల కిందట శ్రీలంకలో లీటర్ పాల ధర రూ.1,100. గ్యాస్ ధర రూ.2,657కి చేరుకుందనే వార్తలు వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ స్థాయిలో కాకపోయినా భారత్‌కూ ఇదే తరహా పరిస్థితి దాపురించేదే. కానీ 30 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్‌ను ఒడ్డున పడేశాయి. 1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రిగా మన్మోహన్‌సింగ్‌లు జూన్ 25న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది. విదేశీ దిగుమతుల కోసం ఇండియా దగ్గరున్న మారకద్రవ్యం విలువ ఒక బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఈ నగదు రెండు వారాలకు మించి సరిపోదు. అప్పుడు రావ్ – సింగ్‌ల జోడీ బరిలో దిగింది. కేవలం వంద రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుందిపరపతి పెంచారు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందనే వార్తలు బయటకు రాగానే ఎన్నారైలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జూలై 1న డాలరుతో రూపాయి మారకం విలువను 9.5 శాతం తగ్గించారు. దీంతో వెనక్కి మళ్లుతున్న ఎన్నారైల సంపదకు బ్రేకులు పడ్డాయి. దీన్ని శుభసూచకంగా భావించిన మన్మోహన్.. రెండు రోజుల తర్వాత రెండోసారి రూపాయి విలువను 12 శాతం తగ్గించారు. ఒక్కసారిగా రూపాయి విలువ 20 శాతానికి పైగా పడిపోవడంతో ఎన్నారైలు తమ దగ్గరున్న డాలర్లను ఇండియాలోకి పంప్ చేశారు. దీంతో విదేశీ మారకద్రవ్యం లోటుకు తాత్కాలిక అడ్డుకట్ట పడింది.పరువు కాపాడారు రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మారక ద్రవ్యం కొరత దేశాన్ని వేధిస్తూనే ఉంది. ఈ సమస్యను తీర్చేలేక స్విస్ బ్యాంకులో 20 టన్నుల బంగారం తాకట్టు పెట్టి 240 మిలియన్ డాలర్లను అప్పుగా తెచ్చేందుకు అంతకు ముందు ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం అప్పటికే ఐఎంఎఫ్‌తో చర్చలు జరిపింది. కానీ పీవీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అప్పటికే దిట్టగా పేరున్న మన్మోహన్ పూర్తిగా వేరే ప్రణాళిక అమలు చేశారు. 20 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గరే ఉంచి, దాన్ని గ్యారెంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 600 మిలియన్ డాలర్లు అప్పుగా వచ్చేలా వ్యూహం రచించారు. లైసెన్స్ రాజ్‌ని బద్దలు కొట్టారు ఆర్థికమంత్రి హోదాలో 1991 జూలై 25న మన్మోహన్సింగ్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడంతో పాటు ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తి వేయడం, దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం వంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. అంతేకాదు కీలక రంగాల్లో ప్రభుత్వ పెత్తనానికి గుడ్‌బై చెప్పి, ప్రైవేటుకు రెడ్ కార్పెట్ వేశారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు. దీంతో బ్లాక్‌మనీకి చాలా వరకు అడ్డుకట్ట పడింది. నగదు వచ్చేలా.. బ్యాంకుల జాతీయీకరణతో రెడ్ టేపిజం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులు సతాయించేవి. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు లేనిపోని నిబంధనలతో మోకాలడ్డేవి. ఈ రెండింటికీ చెక్ పెడుతూ ప్రైవేటు బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్సింగ్. ప్రభుత్వ ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు. కీలకరంగాల్లో విదేశీ పెట్టుబడులను 51 శాతం వరకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు రంగం ఊపందుకుంది. పరిశ్రమలు విరివిగా వెలిశాయి. దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది. మొత్తంగా మోకాళ్లపై నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి దౌడు తీసేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. ‘సెంచరీ’ ఫలితాలు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అవక ముందు 1990 అక్టోబర్‌లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ, ఇండ్రస్టియల్ వర్కర్స్) డబుల్ డిజిట్ క్రాస్ చేసింది. 1991 జూలైలో మన్మోహన్సింగ్ బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, రూపాయి విలువ తగ్గించి, లైసైన్స్ రాజ్‌కు చెక్ పెట్టారు. వీటి ఫలితాలు కనిపించేందుకు ఏడాది సమయం పట్టింది. ఫలితంగా 1992 సెప్టెంబర్ నుంచి వేజ్ ప్రైస్ లెవల్ 10కి దిగువకు పడిపోవడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక ఫలాలను మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. -
జగన్ పనితనం.. అనితర సాధ్యం
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్లింది. ఆర్భాటాలకు తావులేకుండా పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందువరుసలో నిలిపిన అనితర సాధ్యుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా..రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలుఅభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాలను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించారు. అప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేశారు. గత ప్రభుత్వం హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదిరాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ.. వంటి సంస్థలు ఉన్నాయి.ఎన్నో ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులుఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనున్నట్లు అప్పటి ప్రభుత్వం తెలిపింది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. అప్పట్లో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు.మెరుగైన ప్రణాళికలుఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యోచించింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను కూడా సిద్ధం చేయాలని చూసింది. అందులో భాగంగా ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించింది. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి మెరుగైనా ప్రణాళికలతో పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేశారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?జగన్ హయాంలో ఏపీ నంబర్ వన్జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాజీ సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే ఉండడం గమనార్హం. -
మైక్రో కంటైన్మెంట్పై దృష్టి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు సూచించారు. చిన్న, చిన్న కంటెయిన్మెంట్ జోన్ల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలగబోదని వివరించారు. కొన్ని రాష్ట్రాలు ఒకటి, రెండు రోజులు లాక్డౌన్ విధించడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాలనిచ్చిందో సమీక్షించాలని కోరారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణలో ఇది ఇబ్బందులు సృష్టించిందేమో పరిశీలించమన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో పంజాబ్, పశ్చిమబెంగాల్ సçహా పలు రాష్ట్రాలు స్థానికంగా కొన్ని రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్‌తో పోరు సాగిస్తూనే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు/ ఆరోగ్యశాఖ మంత్రులతో బుధవారం ప్రధాని వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయని, ఆ సమయాల్లో కోవిడ్–19 నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడాలని ప్రధాని కోరారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం, అనుమానితులను గుర్తించడం, చికిత్స అందించడం, వ్యాధిపై ప్రజలకు సరైన సమాచారమివ్వడం.. అనే విషయాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. లక్షణాలు లేని వారే అధికంగా ఉంటున్నారని, కోవిడ్ వ్యాధిని కొందరు తేలికగా తీసుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. అందువల్ల సరైన, స్పష్టమైన సమాచారం అందించడం వల్ల ప్రజల్లో వ్యాధికి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన అపోహలను తొలగించవచ్చని తెలిపారు. తొలి రోజుల్లో అమలు చేసిన లాక్‌డౌన్‌తో మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 700 జిల్లాల్లో.. ఈ ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని మోదీ గుర్తు చేశారు. ఈ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని అధికారులతో స్వయంగా మాట్లాడి, పరిస్థితిని సమీక్షించేలా వారం రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అధికారుల్లో చైతన్యం మరింత పెరుగుతుందన్నారు. పేదలకు ఉచితంగా చికిత్స అందించే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సెప్టెంబర్ 25 నాటికి రెండేళ్లు పూర్తవుతాయని, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 1.25 కోట్ల మంది పేద రోగులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. దేశవ్యాప్త యాక్టివ్ కేసుల్లో 63% ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం నిర్ధారిత కేసుల్లో 65.5%, మొత్తం మరణాల్లో 77% ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు. -
'చైనా ఆర్థిక విజయాలు మాకు ఆదర్శం'
గాంగ్జౌ: చైనాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం భారత్-చైనా బిజినెస్ ఫోరంలో ప్రసంగించారు. భారత- చైనాల పాత బంధాలను బలోపేతం చేయడానికి ఇదొక అద్భుత సమయమని ప్రణబ్ తెలిపారు. చైనా సాధించిన ఆర్థిక విజయాలు భారత్ కు ఆదర్శం అని ఆయన కొనియాడారు. మా ఉత్పత్తులకు చైనా మార్కెట్లో డిమాండ్ పెరగాలని భారత్ ఎదురు చూస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కీలక ప్రాంతాల్లో సమగ్ర సంస్కరణలు ప్రవేశపెట్టడంతో భారత్‌లో వ్యాపారం చేయడం సులభతరంగా మారిందని పేర్కొన్నారు. చైనా నుంచి భారత్‌లో పెట్టుబడులు పెరగడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నామని ప్రణబ్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ భారత వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. గురువారం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర నాయకులతో రాష్ట్రపతి చర్చిస్తారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఆ దేశ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ ఝాంగ్ డేజియాంగ్‌లతో కూడా భేటీ అవుతారు.