gsdp
-
జీఎస్డీపీ పెరగడానికి సూచనలు ఇవ్వండి
సాక్షి, అమరావతి: పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఇందులో భాగస్వాములు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని రూ.199 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.35,69,000కు పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని వెల్లడించింది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పారిశ్రామికవేత్తలు సూచనలు, సలహాలు ఇవ్వాలని పరిశ్రమల శాఖ కోరింది.వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని తెలిపింది. ప్రతి సూచన, సలహాను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా పారిశ్రామికవేత్తల చొరవను గుర్తిస్తూ ఈ–సర్టిఫికెట్‌ను కూడా ప్రదానం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనమిక్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) సామాజిక మాధ్యమాల ద్వారా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చాయి. సూచనలు, సలహాలను http:// swarnandhra.ap.gov.in/Suggestions ద్వారా తెలియజేయొచ్చు. -
అభివృద్ధికి చిరునామా వైఎస్ జగన్ పరిపాలన
-
జగన్ పాలనలో జీఎస్డీపీ పరుగులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో నికర రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో గణనీయంగా పెరుగుదల నమోదైంది. అంతకు ముందు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కంటే గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలోనే అత్యధికంగా జీఎస్డీపీ పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ మేరకు 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలను ఆర్బీఐ హ్యాండ్‌బుక్ రూపంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జీఎస్డీపీ పెరుగుదలను కూడా వివరించింది.ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలు ఎదురైనా వాటిని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ రెండంకెల వృద్ధి నమోదైనట్లు తెలిపింది. జీఎస్డీపీతో పాటు వ్యవసాయం, తయారీ, నిర్మాణ తదితర రంగాల్లోనూ గత ఐదేళ్లలో సగటున ఏటా రెండంకెల వృద్ధి నమోదు కావడం విశేషం. కోవిడ్ సంక్షోభం లేనప్పటికీ చంద్రబాబు అంతకు ముందు ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీ రూ.3.77 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు పెరగడం విశేషం. అంటే.. ఏటా ఒక లక్ష కోట్లు చొప్పున జీఎస్డీపీ పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం.. జీఎస్డీపీ 2019–20 నుంచి వరుసగా 2023–24 ఆర్థిక ఏడాది వరకు పెరుగుతూనే ఉంది. 2018–19లో చంద్రబాబు పాలనలో ప్రస్తుత ధరల ప్రకారం.. జీఎస్డీపీ రూ.7,90,810 కోట్లు ఉండగా 2023–24 నాటికి ఐదేళ్ల జగన్ పాలనలో రూ.12,91,518 కోట్లకు పెరిగింది. అంటే ఐదేళ్లలో రూ.5,00,708 కోట్ల మేర పెరిగింది. మొత్తం మీద వైఎస్ జగన్ పాలనలో జీఎస్డీపీలో ఏటా సగటున 12.66 శాతం మేర వృద్ధి నమోదైంది.వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత..కోవిడ్ సంక్షోభంలో వ్యవసాయ రంగానికి, రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. దీంతో 2019–20 నుంచి 2023–24 వరకు వరుసగా ఐదేళ్లు వ్యవసాయ రంగంలో కూడా ఏటా సగటున రెండంకెల వృద్ధి సాధ్యమైంది. ప్రస్తుత ధరల ప్రకారం.. ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో జీఎస్డీపీ విలువ రూ.1,69,652 కోట్లు పెరిగింది. అంటే ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో జీఎస్డీపీలో ఏటా సగటున 12.97 శాతం వృద్ధి నమోదైంది. -
అట్టడుగు జనం అభివృద్ధి చెందేలా...
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పనులూ ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఫలితంగా అట్టడుగు జనం జీవన ప్రమాణాలు పెరుగుతూ పోతున్నాయి. అభివృద్ధికి నిజమైన నిర్వచనం ఇదే కదా! పారిశ్రామిక పార్కులు, పోర్టుల నిర్మాణం – అభివృద్ధి, విమానా శ్రయాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో ఏపీలో ఉద్యోగ కల్పన వేగం పుంజుకొంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాల్లో అధిక భాగం దక్కడం ఈ అభివృద్ధి నమూనా ప్రత్యే కతగా చెప్పుకోవాలి.ఏపీ ప్రభుత్వం నెలకొల్పిన పారిశ్రామిక పార్కుల ప్రాంతాల్లో ఒకప్పుడు బతుకు తెరువు కోసం పట్నాలకు వలస పోయే పరిస్థితి ఉండేది. మిగిలిన వారు పెత్తందారుల చుట్టూ పని కోసం తిరిగే వారు. ప్రస్తుతం ఆ యా ప్రాంతాల్లో పరి శ్రమలు రావడంతో పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.తిరుపతి జిల్లాలోని ‘శ్రీసిటీ పారిశ్రామిక పార్క్’ సమీపంలోని మల్లావారి పాలెం గ్రామస్థుడు సన్యాసయ్య చెప్పినట్లు ‘బడుగు జీవుల పొలాలకు మంచి ధరలు వచ్చాయి. ఇంటికో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎవరి ముందు తలవంచక ఆత్మ విశ్వాసంతో’ బతుకుతున్నారు.‘‘టెన్త్ మాత్రమే చదివిన నాకు ఎక్కడా పని దొరక లేదు. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తూ... కాలం వృధా చేస్తున్న సమయంలో, సెల్ఫోన్లు తయారీ కంపెనీలో పని దొరికింది. ఇంటి నుండి కంపెనీకి వెళ్లి రావడానికి బస్‌సౌకర్యం, క్యాంటీన్, 24 గంటల హెల్త్ సెంటర్ ఉంది’– తిరుపతికి చెందిన మరో యువతి మనోగతం ఇది. వీరంతా ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలకు చెందిన పేద మహిళలు.ఇక్కడ ఉద్యోగాలు చేసే వారిలో 90 శాతం మహిళలే. టెన్త్ నుండి ఇంజనీరింగ్ వరకు చదివిన వారే. ఈ అవకాశం తైవాన్ బహుళజాతి సెల్‌ఫోన్ తయారీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ ద్వారా మహిళలకు దొరికింది. తిరుపతి జిల్లా శ్రీసీటీలో ఈ కంపెనీ 30 ఎకరాల్లో ఏర్పాటయింది. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దుల్లో, నెల్లూరు జిల్లా తడ, తిరుపతి జిల్లా సత్యవేడు మధ్య ఏర్పాటయ్యింది శ్రీసిటీ పారిశ్రామిక పార్క్. 2006లో ఇక్కడ భూసేకరణ సమయంలో అనేక ఆందోళనలు జరిగాయి. అప్పటి దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులతో స్వయంగా సమావేశమై అప్పటి మార్కెట్ ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి 14 గ్రామాల్లో భూములు తీసుకున్నారు. ఇది 2008లో ప్రారంభమై 7,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. జాతీయ రహదారి, రైల్వే, విమానాశ్రయం, ఓడరేవు అన్నీ దగ్గరగా ఉండడం ఈ పారిశ్రామిక పార్కుకి బాగా కలిసొచ్చింది.ఇందులో ఇప్పటి వరకు 220 కంపెనీలు ఏర్పాటై 62 వేల మందికి ఉపాధి కలిగింది. వారిలో సగం మంది మహిళలే. గత 55 నెలల్లో, రాష్ట్రంలో 311కి పైగా ప్రధాన పరిశ్రమలు స్థాపించారు. 1.3 లక్షల ఉద్యోగావకా శాలు ఉన్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రూ. 13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 386 అవగాహనా ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల మరో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సీ పోర్టుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆరు పోర్టులకు తోడు కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టి వాటిని అభివృద్ధి చేస్తోంది. దాదాపు రూ. 16,000 కోట్లతో రామా యపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టులను నిర్మిస్తున్నారు. కొత్త పోర్టుల వల్ల 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓడరేవుల ద్వారా 75 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు మత్స్యకారుల జీవనోపాధిని పెంచుతాయి. 3,793 కోట్ల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్ల తీరప్రాంతానికి ఓడరేవు లేదా ఫిషింగ్‌హార్బర్ ఉంటుంది. భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమా నాశ్రయం రూ. 4,592 కోట్ల ప్రాజెక్ట్. దీనివల్ల 10,000 మందికి ప్రత్యక్షంగా, 80,000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగబోతున్నాయి. గన్నవరం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాల విస్త రణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రామ్‌కో సిమెంట్, సెంచరీ ప్యానెల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్‌లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమల నుండి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీబీ) ఇండెక్స్‌లో వరుసగా మూడేళ్లుగా భారత్‌లో నంబర్‌వన్‌గా నిలవడం ఈ సందర్భంగా గమనార్హం.- వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్ మొబైల్: 94405 95858- శ్యాంమోహన్ -
మూలధన వ్యయం ‘తగ్గింది’
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మూలధన వ్యయానికి కేటాయింపులు బాగా తగ్గాయి. గత ఏడాది అంటే 2023–24 ఆర్థిక సంవత్సర ప్రతిపాదనల కంటే సుమారు సుమారు రూ.8వేల కోట్లను ఈసారి తక్కువగా చూపెట్టారు. 2023–24లో మూల ధన వ్యయం రూ.37,524 కోట్లు చూపెట్టగా, ఈసారి ప్రతిపాదించింది కేవలం రూ.29,669.14 కోట్లు మాత్రమే. 2023–24 సవరణ అంచనాలకు అనుగుణంగా ఈసారి మూలధన వ్యయ పద్దును ప్రతిపాదించినట్టు అర్థమవుతోంది. 2023–24 ప్రతిపాదనల్లో రూ.37వేల కోట్లకు పైగా చూపెట్టినా వాస్తవంగా ఖర్చు పెట్టింది రూ.24,178 కోట్లు మాత్రమే కావడంతో, ఆ మొత్తానికి రూ.5,500 కోట్లు పెంచి చూపెట్టడం గమనార్హం. అంటే 2023–24 కంటే 2024–25లో రూ.5,500 కోట్లు ఎక్కువగా ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మరి సవరణల బడ్జెట్‌కు వచ్చేసరికి 2024–25లో ఎంత ఖర్చవుతుందో వేచి చూడాల్సిందే. ద్రవ్యలోటు పెంపు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్లో ద్రవ్యలోటు పెంచి చూపెట్టారు. 2023–24లో ద్రవ్యలోటు ప్రతిపాదన రూ.38,234 కోట్లు కాగా, వాస్తవిక ద్రవ్యలోటు రూ.33,785 కోట్లుగా నమోదైంది. అయితే, 2024–25లో ద్రవ్యలోటు అంచనాను ఏకంగా రూ.53,227.82 కోట్లుగా ప్రతిపాదించడం గమనార్హం. ఈ పెంపు జీఎస్డీపీకి అనుగుణంగానే జరిగిందని, జీఎస్డీపీలో 3.5శాతాన్ని ద్రవ్యలోటుగా చూపెట్టడంతోనే ఆ మేరకు పెరుగుదల కనిపించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రెవెన్యూ మిగులు ప్రతిపాదనలోనూ ఈసారి తక్కువగా చూపెట్టారు. రూపాయి రాక, పోక అనంతరం రూ.4,881 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని 2023–24 బడ్జెట్లో చూపెట్టినప్పటికీ సవరించిన అంచనాల్లో అది రూ.9,031 కోట్లకు పెరిగింది.అంటే అప్పటి ప్రభుత్వం అంచనాలో రూ.4,200 కోట్లకు పైగా ఖర్చు కాలేదని అర్థమవుతోంది. ఈసారి మాత్రం 2023–24 ప్రతిపాదిత అంచనాల కంటే తక్కువగా రూ.4,424 కోట్ల రెవెన్యూ మిగులును ప్రతిపాదించారు. దీన్నిబట్టి బడ్జెట్ అంచనాల మేరకు వ్యయం ఉంటుందనే ధీమాను ప్రభుత్వం బడ్జెట్లోవ్యక్తపరిచిందని అర్థమవుతోంది. క్షీణించిన రాష్ట్ర వృద్ధిరేటు! ♦ 14.7 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గుదల ♦ మైనస్‌లోకి పడిపోయిన వ్యవసాయరంగ వృద్ధిరేటు ♦ రూ. 49,059 కోట్ల నుంచి రూ. 45,723 కోట్లకు తగ్గిన వ్యవసాయ విలువ ♦ తలసరి ఆదాయ వృద్ధిరేటులో సైతం క్షీణత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధిరేటు క్షీణించింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ 2022–23తో పోలిస్తే 2023–24లో ప్రస్తుత ధరల వద్ద రూ. 13,02,371 కోట్ల నుంచి రూ. 14,49,708 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వృద్ధి రేటు మాత్రం 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు సైతం 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పతనమైంది. అయితే దేశ వృద్ధిరేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధిరేటు 2.4 శాతం అధికం కావడం గమనార్హం. అయితే స్థిర ధరల వద్ద తెలంగాణ వృద్ధిరేటు గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడాది 7.5 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024–25 ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెల్లడించారు. ద్రవ్యోల్బణంలో 5వ స్థానంలో రాష్ట్రం.. వినియోగదారుల ధరల సూచీ డిసెంబర్ 2023లో జాతీయ స్థాయిలో 5.69% ఉండగా తెలంగాణలో 6.65 శాతంగా నమోదైంది. ఈ లెక్కన దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన ఐదో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. క్షీణించిన తలసరి ఆదాయం... తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2023–24లో రూ. 3,43,297 ఉంటుందని అంచనా. గతేడాది తలసరి ఆదాయం రూ. 3,09,912గా నమోదైంది. తలసరి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ వృద్ధిరేటు మాత్రం క్షీణించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడి పడిపోయిన వ్యవసాయరంగ వృద్ధిరేటు.. వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ (జీవీఏ) రూ. 49,059 కోట్లతో పోలిస్తే రూ. 45,723 కోట్లకు తగ్గిపోయింది. దీంతో వ్యవసాయరంగ వృద్ధిరేటు మైనస్ 6.8 శాతానికి పతనమైంది. నైరుతి రుతుపవనాల ఆలస్యం, వర్షాభావం, కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేకపోవడం, భూగర్భ జలాల్లో క్షీణతతో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలైన విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వాణిజ్యం, మరమ్మతు సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వేలు, వాయు రవాణా వంటి రంగాల్లో సైతం క్షీణత కినిపించింది. తయారీ రంగంలో మాత్రం వృద్ధిరేటు 1.3 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, మైనింగ్, క్వారీయింగ్ వంటి రంగాలు గతంతో పోలిస్తే 2023–24లో అధిక వృద్ధిరేటును నమోదు చేశాయి. -
త్వరలో 1.47 లక్షల మందికి ఉపాధి.. ఎలాగంటే..?
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. పసుపురంగు పార్టీ నేతలు పనికిమాలిన, అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆర్భాటాలకు తావులేకుండా పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందని ఆ ‘ఎల్లో’ నేతలకు చెంపపెట్టులా ఉన్న ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి. అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్‌లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. జగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? సెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలోనే..
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతో పోలిస్తే అభివృద్ధి చెందింది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా.. ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం. 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ. 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా, నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది. టీడీపీ ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం మైనస్ 6.5శాతంతో టీడీపీ కాలంలో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.13,640 కోట్లు కేటాయించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 24,620 పాఠశాలల్లోని వసతులను మెరుగుపరిచారు. -
ఆదాయంతోపాటు అభివృద్ధి
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత సర్కారు హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలోనే ఆదాయం పెరగడంతోపాటు అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. టీడీపీ హయాం కంటే ఇప్పుడే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా నమోదైందని, గత ప్రభుత్వంతో పోల్చితే అప్పులు కూడా ఇప్పుడే తక్కువని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమానికి గత సర్కారు కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేసిందని గణాంకాలతో సహా బహిర్గతం చేశారు. మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పులు, ఆదాయం, వృద్ధిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖలు ద్వారా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఒకసారి రూ.పది లక్షల కోట్లు మరోసారి రూ.11 లక్షల కోట్లు, ఇంకోసారి రూ.నాలుగున్నర లక్షల కోట్లు అంటూ యనమల తన లేఖల్లోనే పరస్పర విరుద్ధ గణాంకాలను పేర్కొనటాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి లాంటి వారు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేయడంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐకి కూడా ఇదే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆమె కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర ఆర్ధిక శాఖ, కాగ్, ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలే వాస్తవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు ఇదే విషయాన్ని పార్లమెంట్లో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అప్పులు, రాష్ట్ర ఆదాయం, స్థూల ఉత్పత్తిపై తాను చెబుతున్న లెక్కల్లో తప్పులుంటే చెప్పాలని యనమలకు సవాల్ విసిరారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి రూ.250 కోట్లకు లెక్కలు కనిపించడం లేదని బుగ్గన వెల్లడించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రూ.370 కోట్లకు నామినేషన్‌పై డిజైన్ టెక్కు ఇచ్చారని, ఈ స్కామ్ 2017లోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీ విచారణలో వెలుగులోకి వచ్చిందన్నారు. సెబీ, ఈడీ కూడా దీనిపై విచారణ చేశాయన్నారు. ఎవరి హయాంలో అప్పులు ఎలా? 2018–19 నాటికి (టీడీపీ హయాంలో) రూ.2,57,210 లక్షల కోట్లు 2021–22 నాటికి (వైఎస్సార్సీపీ హయాంలో) రూ.3,93,718 లక్షల కోట్లు మూడేళ్లలో వైఎస్సార్సీపీ హయాంలో పెరిగిన అప్పులు రూ.1,36,500 కోట్లు సగటున ఏడాదికి రూ.45,500 కోట్లు అప్పులు ♦ టీడీపీ హయాంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.33,032 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీల సంక్షేమానికి రూ.74,249 కోట్లు వ్యయం. ♦ టీడీపీ హయాంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.11,400 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్ సీపీ పాలనలో ఎస్టీల సంక్షేమానికి రూ.25,323 కోట్లు వ్యయం ♦ టీడీపీ హయాంలో బీసీ సంక్షేమానికి రూ.30,970 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో బీసీ సంక్షేమానికి చేసిన వ్యయం రూ.1,12,960 కోట్లు ♦ మైనారిటీలకు టీడీపీ హయాంలో వ్యయం సున్నా ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం రూ.11,157 కోట్లు ♦ చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు డిస్కమ్‌లకు చెల్లింపు రూ.20,165 కోట్లు ♦ వైఎస్సార్సీపీ పాలనలో నాలుగేళ్లలో రూ.57,417 కోట్లు చెల్లింపు టీడీపీ హయాంలో గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి గ్యారెంటీ అప్పులు రూ,13,247 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.57,687 కోట్లు ♦ 2014 నాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.22,000 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.66,664 కోట్లు వైఎస్సార్సీపీ వచ్చాక నాలుగేళ్లలోగ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ♦ వైఎస్సార్ సీపీ హయాంలో గ్యారెంటీ అప్పులు రూ.1,18,000 కోట్లు ♦ నాన్ గ్యారెంటీ అప్పులు రూ.83,000 కోట్లు బాబు హయాంలో ఓవర్ డ్రాప్ట్ 2018–19లో 74.3 శాతం వినియోగం ♦ వైఎస్సార్సీపీ పాలనలో అనుమతించిన రోజుల్లో 2019–20లో 39.5 శాతం వినియోగం ♦ 2020–21లో అనుమతించిన రోజుల్లో 51.5 శాతమే ఓవర్ డ్రాప్ట్ వినియోగం ♦ 2014–15లో ద్రవ్యలోటు మూడు శాతానికి అనుమతిస్తే 3.95 శాతానికి చేరింది ♦ 2018–19లో మూడు శాతానికే అనుమతి ఉంటే 4.06 శాతానికి చేరింది. ♦ ఇప్పుడు 2021–22లో 4.5 శాతానికి అనుమతి ఉంటే ద్రవ్యలోటు కేవలం 2.01 శాతమే ఉంది. ♦ టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రూ.1,62,828 కోట్లను అసెంబ్లీ అనుమతి లేకుండా అధికంగా వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి అప్పు రూ.1,34,600 లక్షల కోట్లు ♦ 2019 మే నాటికి మొత్తం అప్పు రూ,3,28,700 లక్షల కోట్లు.. అంటే అప్పుల పెరుగుదల 19.55 శాతం వైఎస్సార్సీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2022–23 నాటికి మొత్తం అప్పు రూ.4,99,895 లక్షల కోట్లు. అంటే అప్పు పెరుగుదల శాతం 15.46 శాతమే ♦ టీడీపీ హయాంలో ఐదేళ్లలో మూలధన వ్యయం రూ.76,139 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.15,227 కోట్లే ♦ వైఎస్సార్సీపీ హయాంలో మూడేళ్లలో మూల ధన వ్యయం రూ.55,086 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.18,362 కోట్లు ♦ టీడీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ34,73,477 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.6,95,695 లక్షల కోట్లు ♦ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ.43,34,192 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.10,83,548 లక్షల కోట్లు. -
నాలుగేళ్లలో రెట్టింపు కానున్న ఏపీ స్థూల ఉత్పత్తి
-
ఏపీ స్థూల ఉత్పత్తిపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక.. నాలుగేళ్లలో రెట్టింపు
ఏపీ జీఎస్డీపీ 2022–23లో 16 శాతం వృద్ధితో రూ.13 లక్షల కోట్లకు చేరింది. 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. సాక్షి, అమరావతి: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ ఏకంగా రూ.20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరం నుంచి ఏపీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2027 నాటికి దేశ ఆర్థిక పరిస్థితితోపాటు ఏపీ సహా 15 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల తీరు తెన్నులపై ‘ఎస్బీఐ రీసెర్చ్’ నివేదికను విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. ‘ఎస్బీఐ రీసెర్చ్’ ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2022 నుంచి వృద్ధి వేగం పుంజుకుంది. 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ► దేశ ప్రస్తుత వృద్ధి రేటును పరిగణలోకి తీసు కుంటే 2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమిస్తుంది. ప్రపంచ జీడీపీలో భారత్ వాటా నాలుగు శాతాన్ని దాటుతుంది. ప్రపంచ దేశాల జీడీపీలో భారత్ 2014లో పదో ర్యాంకులో ఉండగా 2015లో 7వ ర్యాంకులో నిలిచింది. 2019లో ఆరో ర్యాంకులో ఉంది. 2022లో ఐదో ర్యాంకులో ఉండగా 2027 నాటికి మూడో ర్యాంకులో నిలిచే అవకాశం ఉంది. ► 2027 నాటికి భారత్ జీడీపీ రూ.420.24 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో 15 రాష్ట్రాల నుంచే దేశ జీడీపీకి రూ.358.40 లక్షల కోట్లు సమకూరనుండటం గమనార్హం. దీనికి సంబంధించి అత్యధికంగా 13 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవనుంది. ఉత్తర్‌ప్రదేశ్ 10 శాతం వాటాతో రెండో స్థానంలో, ఐదు శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలవనున్నాయి. ► 2027 నాటికి భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఏకంగా కొన్ని దేశాలకు మించి వృద్ధి నమోదు చేస్తాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ.11 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నమోదు కాగా 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది. -
తొమ్మిదేళ్లలో జీఎస్డీపీ 155% వృద్ధి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇటీవలి కాలంలో అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని.. జాతీయ వృద్ధి కంటే అధిక వృద్ధితో వేగంగా దూసుకుపోతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2014–15 నుంచి 2022– 23 మధ్య 118.2శాతం పెరిగితే.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 155.7శాతం వృద్ధి సాధించిందని తెలిపింది. 2014–15 నుంచి ఇప్పటివరకు తెలంగాణ సగటున ఏటా 12.5శాతం వృద్ధి నమోదు చేయగా.. జాతీయ వృద్ధి 10.5 శాతమేనని పేర్కొంది. 2014–15తో పోల్చితే 2022–23 నాటికి దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగిందని.. ఇదే సమయంలో దేశ జనాభాలో రాష్ట్ర వాటా మాత్రం అంతే ఉందని వివరించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 2022–23లో రాష్ట్రం 12.93 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి సాధించినట్టు తెలిపింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూపొందించిన ‘ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @ 10’ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ శనివారం ఈ నివేదికను ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)’లో ఆవిష్కరించారు. అందులోని వివరాలివీ.. తలసరి ఆదాయంలో అగ్రగామి రాష్ట్ర తలసరి ఆదాయం 2014–15 రూ.1,12,162కాగా.. 2022–23 నాటికి రూ.3,08,732కి పెరిగింది. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.79,118 నుంచి రూ.1,72,000కి చేరింది. గత తొమ్మిదేళ్లలో జాతీయ తలసరి ఆదాయం 9.2 శాతం వృద్ధి సాధించగా.. తెలంగాణ 12.1శాతం వృద్ధి నమోదు చేసింది. అందుబాటులో ఉన్న 16 రాష్ట్రాల తలసరి ఆదాయం వృద్ధి లెక్కలను పరిశీలిస్తే.. 2022–23లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రంగాల వారీగా వృద్ధి ఇదీ.. ► ప్రాథమిక రంగమైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను పరిశీలిస్తే.. తెలంగాణ 2014–15లో ప్రస్తుత ధరల వద్ద 19.5శాతం వృద్ధి సాధించగా, 2022–23 నాటికి 21.1శాతానికి పెరిగింది. తొమ్మిదేళ్లలోనే ప్రాథమిక రంగంలో ఏడింతల వృద్ధి రేటును నమోదు చేసింది. ► ద్వితీయ రంగమైన తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాల్లో రాష్ట్రం ప్రస్తుత ధరల వద్ద 2014–15 నుంచి 2022–23 మధ్య కాలంలో 186.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ► రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, రవాణా, కమ్యూనికేషన్, ఇతర సేవలతో కూడిన తృతీయ రంగం అధిక చేయూత అందిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్వీఏ)లో తృతీయ రంగం వాటా ఏకంగా 61.3శాతం కావడం గమనార్హం. సొంత పన్నుల ఆదాయంలో 266% వృద్ధి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2014–15లో రూ.29,288 కోట్లు ఉండగా.. 2022–23 నాటికి ఏకంగా 266శాతం వృద్ధితో రూ.1,06,949 కోట్లకు పెరిగింది. సగటున ఏటా 18.3శాతం వృద్ధి నమోదు చేసింది. రాష్ట్ర జనాభాపై అదనపు పన్నులు విధించకుండానే ఈ మేరకు ఆదాయం పెంచుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బడ్జెట్ సైతం రూ.62,306 కోట్ల నుంచి రూ.2,04,085 కోట్లకు పెరిగినట్టు వివరించింది. -
దక్షిణాదిన తలసరి ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ: ఆర్బీఐ గణాంకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదో సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల కృషి, వాటి వాటాపై సంతోషకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం తోటి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంలో ముందుకు దూసుకుపోతోంది. 2014 ఫిబ్రవరి-జూన్ మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా అనేక రకాలుగా అననుకూల పరిస్థితులు ఎదుర్కొన్న నవ్యాంధ్ర ప్రదేశ్ ఆర్థిక పనితీరు సంతృప్తికరంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయి మెట్రోపాలిటన్ నగరం రాజధానిగా లేనప్పటికీ ఏపీ గణనీయమైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ.13.2 లక్షల కోట్లు. పారిశ్రామికంగా, విద్య, సామాజిక రంగాల్లో మొదటి నుంచీ ముందున్న తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధించగా, తర్వాత కర్ణాటక రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, కేరళ రూ.కేరళ రూ. 10 లక్షల కోట్లతో ముందుకు సాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 9 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల జీఎస్డీపీలను కలిపితే రూ.26.5 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగి ఉండకపోతే– జీఎస్టీడీపీ విషయంలో తమిళనాడు కన్నా ఉమ్మడి ఏపీ ముందుండేది.ఒక ఆంగ్ల వాణిజ్య పక్షపత్రిక 2022కు సంబంధించి ఆర్బీఐ, ఇకనామిక్ సర్వే నుంచి లభించిన గణాంకాల ఆధారంగా కొన్ని అంచనాలు వేసింది. తలసరి ఆదాయంలోనూ ఏపీ పరుగులు తీస్తోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ఐటీ, ఔషధాల పరిశ్రమల కేంద్రం హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రూ.2,65,623 తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని, హైదరాబాద్ వంటి పారిశ్రామిక మహానగరం ఆంధ్రప్రదేశ్ లో లేకున్నా ఈ రాష్ట్రం రూ. 2,07,771 తలసరి ఆదాయం నమోదు చేసుకోవడం నిజంగా ఘనవిజయమే. ఎందుకంటే, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర సాంకేతిక, వైద్య విద్యలకు సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ఆలస్యంగా విద్యాసంస్థలు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు, అత్యధిక జీతాలు చెల్లించే రంగాలు కూడా ఏపీలో ఇంకా చెప్పుకోదగ్గస్థాయికి ఎదగలేదు. ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ చదువుల కోసం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడడం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ రూ.2,07,771 తలసరి ఆదాయం సాధించడం నిజంగా ప్రశంసనీయం. ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాలు, గట్టి పునాదులున్న ఫార్మా రంగాల ద్వారా 21వ శతాబ్దపు నగరంగా రూపుదిద్దుకున్న గ్లోబల్ సిటీ హైదరాబాద్ అంతర్భాగం కావడం వల్ల తెలంగాణ దక్షిణాదిన తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచింది. అయితే, తొమ్మిదేళ్ల క్రితం సొంత ప్రయాణం మళ్లీ ప్రారంభించిన ఏపీ తలసరి ఆదాయంలో మంచి ప్రగతి సాధించిందనే చెప్పవచ్చు. కాగా, తలసరి ఆదాయంలో జాతీయ సగటు అయిన రూ.1,50,007ను ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాటì అందనంత ముందుకెళ్లడం ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల పునాదులకు అద్దంపడుతోంది. దక్షిణాదిన ఈ ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించి గట్టి పోటీ ఉందని కూడా ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలూ ఈ రెండింటితో పోటీపడుతూ ముందుకు పరిగెడుతున్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ సహా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలూ భారత ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్లుగా ఉపయోగపడుతున్నాయి. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
తలసరి అప్పు.. రూ. 98,033
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు లక్ష రూపాయలకు చేరువైంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో తీసుకునేవి కలిపి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,57,059 కోట్లకు (పూచీకత్తు రుణాలు కాకుండా) చేరనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. ఒక్కొక్కరి తలపై అప్పు రూ.98,033కు చేరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనాల మేరకు తలసరి అప్పు రూ.94 వేలు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు వేలు పెరుగుతోంది. ఇక ప్రభుత్వం పూచీకత్తులు ఇచ్చి కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలనూ కలిపితే.. తలసరి అప్పు మరో రూ.30వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జీఎస్డీపీతో పోలిస్తే తగ్గుదల కాగా, రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన బడ్జెట్ గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పుల శాతం తగ్గుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీఎస్డీపీలో 25.4 శాతం అప్పు ఉండగా, అదే 2023–24 సంవత్సరం ముగిసే సమయానికి ఇది జీఎస్డీపీలో 23.8 శాతానికి తగ్గుతుండడం గమనార్హం. ఇదే క్రమంలో 2021–22, 2022–23 సంవత్సరాల్లో కూడా జీఎస్డీపీలో అప్పుల శాతం తగ్గిందన్నమాట. వడ్డీల చెల్లింపులకే రూ.22,407 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్పులకు వడ్డీల కింద ఈసారి రూ.22,407.67 కోట్లు చెల్లించనుంది. 2022–23లో వడ్డీల కింద రూ.18,911 కోట్లు చెల్లించగా.. ఈసారి మరో రూ.3,500 కోట్ల మేర పెరిగాయి. ►ఇక రుణాల తిరిగి చెల్లింపుల కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ.12,606 కోట్లను చూపింది. ఇందులో ప్రజా రుణం కింద రూ.9,341.17 కోట్లు,, కేంద్రం నుంచి తీసుకునే రుణాలకు రూ.427.16 కోట్లు, ఇతర రుణాలకు రూ.2,837.76 కోట్లు తిరిగి చెల్లించనుంది. తగ్గిన పూచీకత్తు రుణాలు! 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–23లో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలకు రుణాల కోసం ప్రభుత్వమిచ్చిన పూచీకత్తులు తగ్గిపోయాయి. 2021–22 ముగిసే నాటికి ప్రభుత్వ పూచీకత్తులు మొత్తం రూ.1,35,282.51 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.1,29,243.60 కోట్లకు తగ్గాయి. పూచీకత్తు ఇచ్చి కార్పొరేషన్లు, సంస్థల పేరిట తీసుకునే రుణాలనూ ఎఫ్ఆర్బీఎం కింద రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామన్న కేంద్ర నిబంధనే దీనికి కారణం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ కార్పొరేషన్‌కూ పూచీకత్తు ఇవ్వలేదు. ఇదే సమయంలో గత ఏడాది ఇచ్చిన పూచీకత్తుల అసలులో కొన్ని నిధులు చెల్లించడంతో.. 2022–23లో ప్రభుత్వ గ్యారెంటీలు రూ.6 వేల కోట్ల మేర తగ్గాయి. మొత్తంగా పూచీకత్తులతో కలిపి రాష్ట్ర రుణం రూ.4,52,235 కోట్లకు చేరడం గమనార్హం. -
రాష్ట్రంలో ప్రగతి పరుగులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం)ను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నందునే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్లో భాగంగా ద్రవ్య విధానాన్ని మంత్రి వెల్లడించారు. ద్రవ్య విధాన వ్యూహపత్రాన్ని సభకు సమర్పించారు. ‘కోవిడ్ తరువాత పరిస్థితుల్లో రాష్ట్రం పురోగమనంలో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయ వనరులు 21.1 శాతం అద్భుత ప్రగతి కనబరుస్తున్నట్లు సవరించిన బడ్జెట్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోనూ పన్నుల వసూళ్లు ఆశించిన దానికంటే అధికంగా ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 5.06 శాతం పెరుగుతుంది. జీఎస్డీపీలో ద్రవ్యలోటు 4 శాతం ఉంటుందని 2022–23 బడ్జెట్లో అంచనా వేశాం. కానీ, ఆర్థిక ప్రగతి కారణంగా 3.21 శాతానికి తగ్గింది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ.. అనేక కొత్త పథకాలు, భారీ కమిట్మెంట్స్తో వ్యయం అధికంగా ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు రూ.2,980 కోట్లుగా ఉంటుంది. 2022–23 ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 25.9 శాతం ఉంటాయని అంచనా వేసినా. సవరించిన బడ్జెట్ అంచనాల్లో అది 24.33 శాతంగానే ఉండనుంది’అని హరీశ్ తెలిపారు. పన్నుల ఆదాయమే వెన్నుదన్ను ‘రాష్ట్రానికి పన్నుల ఆదాయమే వెన్నుదన్నుగా ఉంది. అందులో భాగంగా పన్ను వసూళ్లలో ఎలాంటి లోపాలు ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, సామాన్యులపై భారం వేయకుండా ఎక్కడెక్కడ పన్నులు ఇంకా వసూలు అయ్యే అవకాశం ఉందో వాటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఆదాయం మరింత పెంచుకుంటాం. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మార్కెట్ ధరల స్థిరీకరణ, స్టాంపు డ్యూటీ పెంపుతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడులు రూ.1.31 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేశాం. పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఇక పన్నేతర ఆదాయ కూడా పెరుగుతోంది. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని విక్రయించడం వల్ల ఆదా యం పొందుతున్నాం..’అని మంత్రి వివరించారు. కేంద్రం కంటే బెస్ట్ ‘స్థిర, ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి కేంద్రంతో పోలిస్తే అభివృద్ధి అధికంగా ఉంది. 2020–21 కోవిడ్ సమయంలో అభివృద్ధి తిరోగమంలో ఉన్నా కేంద్రంతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఆ సంవత్సరం కేంద్రం 6.6 శాతం తిరోగమనంలో ఉంటే.. రాష్ట్రం 4.9 శాతం తిరోగమనంలో ఉంది. ఆ మరుసటి సంవత్సరం నుంచి ఆర్థిక పురోగతి సాధ్యమైంది. తిరోగమనం నుంచి పురోగతి వైపు మళ్లడమే కాకుండా ఏకంగా 10.9 శాతం పెరుగుదల సాధ్యమైంది. సెకండరీ సెక్టార్‌లోని ఉత్పత్తి, విద్యుత్, నీటి సరఫరా, నిర్మా ణం రంగం పురోగతిలో ఉంది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, గనులు, క్వారీ కూడా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించాయి. నిరంతర విద్యుత్, చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు వంటి పథకాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి’అని హరీశ్ తెలిపారు. -
కరోనా వేళా ఏపీలో వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలుచేయడంవల్లే దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్–రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వృద్ధి రేటు నమోదవుతోందని కేంద్రం నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ప్రవేశపెట్టిన వివరాల్లో.. కరోనా లాంటి విపత్తు సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో జీఎస్డీపీ వృద్ధిరేటు మైనస్ స్థాయికి పడిపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ సహా కేవలం 3 రాష్ట్రాల్లోనే వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడించింది. దీని ప్రకారం.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏపీ(0.08%), తమిళనాడు (0.14%), పశ్చిమ బెంగాల్ (1.06 %) మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ వృద్ధిరేటు మైనస్ స్థాయికి పడిపోయినట్లు కేంద్రం పేర్కొంది. ఆ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలవల్లే.. మరోవైపు.. ఆ ఆర్థిక సంవత్సరంలో ఏపీ మినహా మిగిలిన రెండు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమనార్హం. ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రజాకర్షక పథకాలు అమలుచేయడం సహజం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా అక్కడి ప్రభుత్వాలు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలతో ఆయా రాష్ట్రాల్లో వృద్ధిరేటు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అప్పటికి 9 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలుచేస్తుండడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నప్పటికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తోంది. దీనివల్లే ఆ ఏడాది రాష్ట్రంలో వృద్ధిరేటు సాధ్యమైందని అ«ధికార వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఇక ఆ ఏడాది దేశంలో ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలున్న మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వృద్ధిరేటు మైనస్ స్థాయిలోనే ఉంది. 2021–22లో ఏపీనే టాప్.. కరోనా అనంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో అయితే ఏపీ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసినట్లు పార్లమెంట్లో తెలిపిన వివరాల్లో కేంద్రం పేర్కొంది. ఆ ఏడాది దేశంలోనే అత్యధికంగా ఏపీ 11.43% జీఎస్డీపీ వృద్ధిరేటును నమోదు చేసినట్లు వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కంటే ఏపీ మెరుగైన వృద్ధిరేటు నమోదుచేసిందని కేంద్రం తెలిపింది. -
అవును... అభివృద్ధికి అడ్డా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అధోగతిపాలైందని, అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని ప్రతి పక్ష నాయకులు, కొందరు కుహనా మేధావులు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా వృద్ధి చెందుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబు తోంది. ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2021 – 2022’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ రెండో వారంలో విడుదల చేసిన నివేదిక ప్రతిపక్షాలు, ఇతరులూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ నేతృత్వంలోని వైసీపీ 2019 మే 30వ తేదీన అధికారంలోకి వచ్చింది. తర్వాతి కొద్ది కాలానికే కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతల మయ్యాయి. అయితే ఈ కోవిడ్ సంక్షోభాన్ని కూడా ఆంధ్ర ప్రదేశ్ సమర్థవంతంగా అధిగమించిందనే చెప్పాలి. కోవిడ్‌తో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణిస్తే ఏపీలో ఈ క్షీణత 2.58 శాతం మాత్రమే నమోదైంది. అయితే అనతి కాలంలోనే పుంజుకుని 2021–22లో భారత దేశం 8.7 శాతం వృద్ధి రేటు సాధించగా ఆంధ్రప్రదేశ్ 11.43 శాతంతో దేశంలో అత్యధిక ఆర్థికాభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా ఎదిగింది. అంతేకాకుండా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో వరుసగా మూడేళ్ళపాటు మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వారికి ఆర్బీఐ నివేదికలో సమగ్రమైన సమాధానాలు లభిస్తాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న చివరి ఏడాదిలో సాధించిన అభివృద్ధినీ, జగన్ మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధినీ ఆర్బీఐ నివేదిక ఆధారంగా పరిశీలిస్తే రాష్ట్రంలో అన్ని రంగాల్లో సంతృప్తికరమైన పురోగతిని గమనించవచ్చు. ఉదా హరణకు 2018–19లో సామాజిక రంగానికి చంద్రబాబు ప్రభుత్వం రూ. 76,759 కోట్ల రూపాయలు వ్యయం చేస్తే, 2021–22లో జగన్ జగన్ ప్రభుత్వం రూ.1,13,434 కోట్లు వ్యయం చేసింది. సంక్షేమ ఫలాలను అందించే ఈ వ్యయం విషయంలో ఏపీ దేశంలో ఆరో స్థానంలో ఉంది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) 2020–2021లో రూ. 10,14,374 కోట్లు కాగా అది 2021–2022 నాటికి రూ. 12,01,736 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం చంద్రబాబు సీఎంగా ఉన్న 2018–19లో రూ. 1,54,031 గా ఉంది. అది 2020–21 నాటికి రూ. 1,76,707కూ, 2021–22 నాటికి రూ. 2,07,717కు పెరిగింది. ఇదే సమయంలో దేశంలో తలసరి ఆదాయం రూ. 1,26,855 నుంచి రూ. 1,49,848 కు మాత్రమే పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో ఈ పెరుగుదల రూ. 23,000గా ఉంటే... రాష్ట్రంలో రూ. 31,010 పెరిగిందన్న మాట! తలసరి ఆదాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 9వ స్థానంలో ఉంది. ఆర్థిక శాస్త్రంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) అనే పదాన్ని రాష్ట్రం లేదా దేశంలోని ఆయా రంగాల వస్తు, సేవల ఉత్పత్తి విలువ లెక్కించడానికి వాడతారు. ఆంధ్రప్రదేశ్‌లో 2021–22లో జీవీఏ గ్రోత్ రేట్ 18.47 గా నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఇంత ఎక్కువ గ్రోత్ రేట్ నమోదు కావడం ఇదే మొదటి సారి. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తుల జీవీఏలో పెరుగుదల 14.50 శాతం నమోదైంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. జీవీఏ ప్రాతిపదిక లెక్కన మొత్తం వ్యవసాయ రంగం విలువ చంద్రబాబు హయాంలో సుమారు రూ. 10 లక్షల కోట్లు ఉంటే జగన్ ప్రభుత్వ హయాంలో అది రూ. 15 లక్షల కోట్లకు పెరిగింది. పరిశ్రమల జీవీఏ 2018– 19లో రూ. 18లక్షల కోట్లు ఉంటే అది 2021–2022 నాటికి రూ. 24 లక్షల కోట్లకూ పెరిగింది. గత మూడేళ్ళుగా వ్యవసాయ రంగాభివృద్ధి కూడా సంతృప్తికరంగానే ఉందని ఆర్బీఐ నివేదిక తెలియజేస్తోంది. 2018–2019లో స్థూల సాగుభూమి 72.97 లక్షల హెక్టార్లు కాగా అది 2021–2022 నాటికి 74.07 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇదే కాలంలో 10,838 వేల టన్నుల నుంచి 11,299 వేల టన్నులకూ, నూనె గింజల ఉత్పత్తి 504 వేల టన్నుల నుంచి 804 వేల టన్నులకూ పెరిగాయి. చేపలు, గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం బాబు పాలన చివరి ఏడాదిలో సాధారణ ద్రవ్యోల్బణం 6.9 శాతం ఉంటే ప్రస్తుతం 5.2 శాతంగా ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వేయి మందికి 45 మంది నిరుద్యోగులుంటే ఇప్పుడు వీరి సంఖ్య 33కి తగ్గింది. అలాగే పట్టణ ప్రాంతంలో గతంలో ప్రతి వేయి మందికి 73 మంది నిరుద్యోగులుంటే ఇప్పుడు వారి సంఖ్య 60కి తగ్గింది. 6234 ప్రభుత్వాసుపత్రులతో ఆంధ్రప్రదేశ్ దేశం లోనే అగ్రస్థానంలోనూ, 86,721 ఆస్పత్రి పడకలతో దేశంలో రెండో స్ధానంలోనూ ఉంది. 2018–19లో రాష్ట్రంలో విద్యుత్ లభ్యత 6,380 కోట్ల యూనిట్లు ఉండగా నేడు 6822 కోట్ల యూనిట్లకు పెరిగింది. చంద్రబాబు పాలన ఆఖరి ఏడాదిలో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 58,677 కోట్లుగా నమోదు కాగా అది ఈ ఏడాది రూ. 85,265కు పెరిగింది. 2021–22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాలపై వడ్డీగా రూ. 22,740 కోట్లు చెల్లించగా... ఉత్తర ప్రదేశ్ రూ. 43 వేల కోట్లు, మహారాష్ట్ర రూ. 42 వేల కోట్లు, తమిళనాడు రూ. 41 వేల కోట్లు చెల్లించాయి. దేశ ఎగుమతుల్లో 5.8 శాతం వృద్ధి ఉంటే, రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధి 19.4 శాతంగా నమోదైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు నాల్గో స్థానానికి చేరుకుంది. నీతి ఆయోగ్ ర్యాకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ డీసెంట్ ఎకనమిక్ గ్రోత్ విభాగంలో రెండో ర్యాంక్, పేదరిక నిర్మూలన విభాగంలో 3వ ర్యాంక్, గుడ్ హెల్త్ విభాగంలో 2వ ర్యాంక్, క్లీన్ వాటర్, శానిటేషన్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించింది. జగన్ ప్రభుత్వం నగదు బదిలీ పథకం ద్వారా గత మూడే ళ్ళుగా పేదలకు సుమారు లక్షా 90 వేల కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పథకంపై ప్రారంభంలో కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ క్రమంగా ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న నగదు బదిలీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్ధ పురోగమనానికి కూడా తోడ్పడుతోంది. కోట్లాది రూపాయల మేరకు బదిలీ అవుతున్న నగదును లబ్ధిదారులు కొద్ది రోజుల్లోనే వివిధ రకాల వస్తు, సేవల కొనుగోలుకూ, ఫీజుల చెల్లింపునకూ ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడడం, వస్తువుల తయారీ అవసరం ఏర్పడడం, దానికై ముడి సరకులు కొనుగోలు చేయడం, ఉపాధి లభించడం, వ్యాపారాలు వృద్ధి చెందడం జరుగుతోంది. వ్యాపార లావాదేవీలు పెరగడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రాబడి కూడా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ఒక లబ్ధిదారుడికి ప్రభుత్వం ఒక ఏడాదిలో లక్ష రూపాయలు బదిలీ చేస్తే ఆ మొత్తం ఏడాదిలో కనీసం 50 లావాదేవీల ద్వారా చేతులు మారుతోంది. ఫలి తంగా అన్ని చోట్లా వస్తుసేవలకు గిరాకీ ఏర్పడి, క్రయ విక్ర యాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రాబడి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పన్నుల రాబడి పెరగడానికీ, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగడానికీ, వస్తు సేవలకు గిరాకీ ఏర్పడటానికీ... ఫలితంగా రాష్ట్రాభివృద్ధికి ఈ నగదు బదిలీ కొంత కారణమవుతుంది. అయితే పెద్దఎత్తున నగదు ప్రజలకు ఇవ్వడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రజలకూ, ప్రజల నుంచి మార్కెట్లోకీ వచ్చినప్పటికీ గతంతో పోలిస్తే ద్రవ్యోల్బణం 6.9 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గడం గమనార్హం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు, మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అలా కాకుండా ఆర్బీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా మొండిగా అబద్ధాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. - వి. వి. ఆర్. కృష్ణంరాజు అధ్యక్షుడు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ -
Telangana: రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరింత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, అనుబంధ రంగాల ఆర్థికాభివృద్ధితో పాటు మరింత ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. ప్రైవేట్ పెట్టుబడులకు దోహదపడే విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం, పాడి రంగాల ద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) వృద్ధిని పెంపొందించే కార్యక్రమాలపై బీఆర్కేఆర్ భవన్లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన దాదాపు 30 మంది ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొని విలువైన సూచనలు అందించారు. ప్రభుత్వ శాఖల పనిలో సమర్థతను పెంపొందించడం వల్ల ప్రజల దృక్పథంలో మార్పు వస్తుందని సోమేశ్‌కుమార్ అన్నారు. అధిక ఉత్పాదకతను సాధించేందుకు వీలుగా విధానాల మార్పుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి అపారమైన అవకా శాలు ఉన్నాయన్నారు. సాగునీరు, విద్యుత్, సేకరణ, రైతుబంధు వంటి పెట్టుబడి మద్దతు విధానాలతో రాష్ట్రంలో రైతులు ఎంతో ప్రయో జనం పొందారని, గత ఎనిమిదేళ్లలో పంటల విస్తీర్ణం 64% పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు నివేదించారు. పంటల ఉత్పాదకతను ప్రోత్సహించడం, ఉద్యాన రంగం బలోపేతం, పంటకోత తర్వాత మెరుగైన నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ పరిశోధన, విస్తరణ వ్యవసాయ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి కొన్ని వ్యూహాలని తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో మరింత ఉత్పాదకత, అధిక వృద్ధిని సాధించడానికి వివిధ శాఖల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. -
వ్యవసాయ రంగంలో 14.5% ప్రగతి నమోదు: ఏపీ ప్రణాళికశాఖ కార్యదర్శి
-
తెలంగాణలో ప్రగతి పరుగులు.. నీతి ఆయోగ్ ‘అర్థ్‌నీతి’ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ విశ్లేషించింది. జీఎస్డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రమని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు, దేశ ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ నీతి ఆయోగ్ ‘అర్థ్‌నీతి–వాల్యూమ్’ 7ను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది. ‘జీఎస్డీపీ పరంగా తెలంగాణ ఏడో పెద్ద రాష్ట్రం. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది’ అని పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సగటున వార్షిక వృద్ధి 9 శాతం కంటే ఎక్కువగా ఉందని, ఇది రాష్ట్ర ఆవిర్భావం ముందు కంటే ఎక్కువ అని పేర్కొంది. (చదవండి: Desi Apple: డిమాండ్ ఎక్కువ.. ధర తక్కువ!) రాష్ట్ర దేశీయోత్పత్తి(ఎస్డీపీ)లో సేవా రంగం వాటా 60 శాతంగా ఉందని వివరించింది. అయితే ఉపాధి విషయంలో వ్యవసాయ రంగం గణనీయమైన వాటా కలిగి ఉందని, మొత్తం జనాభాలో 54 శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డారని వివరించింది. ఎస్‌డీపీలో వ్యవసాయ రంగ వాటా 16 శాతమని, 86 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులేనంది. రాష్ట్ర దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 17 శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ తదితర హైటెక్ రంగాలు, టెక్స్టైల్స్, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్స్ వంటి సంప్రదాయ రంగాల మిశ్రమంగా ఉందని విశ్లేషించింది. 2020, అక్టోబర్ నాటికి రాష్ట్రంలో 153 ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్) ఉండగా, వీటిలో 34 కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, 56 నోటిఫై అయ్యాయని, 63 అనుమతులు పొంది ఉన్నాయని వివరించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 2020లో ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీని ఆవిష్కరించిందని, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఫార్మా రంగంలో నేషనల్ లీడర్... ఫార్మాస్యూటికల్స్ రంగంలో తెలంగాణను నేషనల్ లీడర్‌గా నీతిఆయోగ్ అభివర్ణించింది. 2019–20లో 4.63 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసిందని పేర్కొంది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉందని చెప్పింది. హైదరాబాద్‌ను ఫార్మా సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఈ ఫార్మాసిటీని సుస్థిర పారిశ్రామిక నగరానికి అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌గా ఏర్పాటు చేయనుందని వివరించింది. ఐటీలో స్థిరమైన వృద్ధి... తెలంగాణలో ఐటీ రంగం స్థిరమైన వృద్ధి రేటు కనబరుస్తోందని అర్థ్‌నీతి విశ్లేషించింది. ఐటీ రంగంలోనూ తెలంగాణ అగ్రశ్రేణిలో నిలిచిన రాష్ట్రమని, గడిచిన కొన్నేళ్లలో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్(ఐటీఈఎస్) ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి రేటు కనబరిచిందని తెలిపింది. ఇటీవలే ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) రానున్న ఐదేళ్లలో ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 53 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు కానుందని వివరించింది. కేంద్ర పన్నుల వాటాలో 6% తగ్గుదల 2019–20 ఆర్థిక సంవత్సర వాస్తవిక వ్యయంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13% అధికంగా రాష్ట్రం వ్యయం చేయనుందని, ఇదే కాలంలో రాష్ట్ర రెవెన్యూలో 31% వార్షిక పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,990 కోట్లుగా ఉంటుందని, ఇది 2019–20తో పోల్చితే 6 శాతం తగ్గుదలను సూచిస్తోందని తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ద్రవ్య లోటు లక్ష్యాలను అమలు చేయడం ద్వారా ప్రస్తుతం జీఎస్డీపీలో 29.5 శాతంగా ఉన్న అప్పులు.. 2025–26 నాటికి 29 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2021–26 మధ్య కాలంలో రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు 0.86% వాటా ఉందని, అంటే ప్రతి వంద రూపాయల్లో 86 పైసలు తెలంగాణకు వస్తాయని విశ్లేషించింది. (చదవండి: కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష! ) విస్తృతంగా మౌలిక వసతులు తెలంగాణలో అద్భుత రహదారులు, రైల్వే సౌకర్యం ఉందని, రాష్ట్రం గుండా 2,592 కి.మీ. పొడవైన 16 జాతీయ రహదారులు వెళ్తున్నాయని విశ్లేషించింది. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో ఇది 10% అని తెలిపింది. 200లకుపైగా రైల్వేస్టేషన్లు దేశంలోని ఇతర నగరాలతో అనుసంధానమై ఉన్నాయని వివరించింది. 2021, ఫిబ్రవరి నాటికి 16,931 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిఉందని విశ్లేషించింది. మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) టూరిజానికి హైదరాబాద్ ప్రముఖ ప్రాంతమని, గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ సహా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిందని వివరించింది. అలాగే మెడికల్ టూరిజంలో హైదరాబాద్ మేజర్ సిటీగా అభివృద్ధి చెందిందని, తెలంగాణలోని పలు ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొంది. 2018లో 9.28 మంది దేశీయ పర్యాటకులు, 3.2 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని తెలిపింది. -
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రుణ పరిమితి
సాక్షి, న్యూఢిల్లీ : 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలకు గరిష్ట రుణ పరిమితిని నిర్దేశించామని, జీఎస్డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలకు సంఘం సూచనలు చేస్తుందని రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. జీఎస్డీపీలో 4 శాతం వరకు రుణాలు తీసుకునేలా అనుమతించామన్నారు. 2018–22 వరకు ఆంధ్రప్రదేశ్‌కు విధించిన అప్పుల పరిమితి ప్రకారం.. 2018–19లో రూ.27,569 కోట్లు, 2019–20లో రూ.32,417 కోట్లు, 2020–21లో రూ.30,305 కోట్లు, 2021–22లో రూ.42,472 కోట్లను నికర గరిష్ట రుణ పరిమితిగా విధించామని మంత్రి తెలిపారు. 2019–20 కాలంలో పన్నుల రాబడి తగ్గినందున ప్రత్యేక పథకం కింద రూ.2,534 కోట్లు అదనంగా రుణం తీసుకునేందుకు అనుమతించామని వెల్లడించారు. ఇక 2020–21 కాలంలో జీఎస్డీపీపై రెండు శాతం అదనపు రుణాలకు అనుమతిచ్చామని, అందులో భాగంగానే ఏపీకి రూ.19,192 కోట్లకు అనుమతి మంజూరు చేశామన్నారు. దీనికి అనుగుణంగా ఎఫ్ఆర్ఎంబీ చట్టానికి రాష్ట్రాలు సవరణలు చూసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతేగాక.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మదింపు చేయలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ వెల్లడించిన లెక్కల ప్రకారం ద్రవ్యలోటు తొలుత రూ.68,536 కోట్లుగా లెక్కించారని, అయితే.. రాష్ట్ర బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటును రూ.54,369.18 కోట్లుగా లెక్కించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. అంతేగాక.. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాస్తవ ద్రవ్యలోటు రూ.53,702.73 కోట్లుగా తేలిందని కేంద్రమంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇళ్లకు రూ.3లక్షలు ఇవ్వాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు చొప్పున ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.1.8 లక్షలు గిరిజన ప్రాంతాల వారికి సరిపోదన్నారు. గిరిజన ప్రాంతాలకు సరకు రవాణా ఖర్చు ఎక్కువవుతుందని, అందుకు రూ.3లక్షలు చొప్పున ఇవ్వాలని ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఆ రోడ్లను హైవేలుగా మార్చండి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెం టరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి,లోక్ సభాపక్ష నాయకుడు పీవీ మిధున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం మంగళవారం గడ్కరీతో సమావేశమైంది. విశాఖ జిల్లాలో విస్తృతమైన రోడ్ నెట్వర్క్ ఉన్నప్పటికీ నా నాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సబ్బవరం జం క్షన్ నుంచి వెంకన్నపాలెం, చోడవరం, వడ్డా ది, రావికమతం, కొత్తకోట మీదుగా నర్సీపట్నం వరకు ఉన్న రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్–009), నర్సీపట్నం నుంచి గన్నవరం, కోట నందూరు మీదుగా తుని వరకు ఉన్న రహదారి (ఎస్‌హెచ్–156) అత్యంత రద్దీ కలిగి ఉన్నందున వీటిని జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. లోక్‌సభ సభ్యులు డాక్టర్ బి.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్, చింతా అనురాధ, మార్గాని భరత్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంజీవ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. రూ. 6,750 కోట్ల ‘ఉపాధి’ బకాయిలివ్వండి సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన రూ.6,750 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేం ద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. వైఎ స్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం మంత్రితో సమావేశమైంది. పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉపాధి పథకం కింద 18.4 కోట్ల పనిదినాలతో దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పనిదినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా చేరుకోగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన భూముల రీసర్వేలో సర్వే రాళ్లు పా తే కూలీల వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి ఉపాధి పథకం కింద లేబర్ బడ్జెట్‌ను సవరించాలి’.. అని మంత్రిని కోరారు. ‘కాఫీ’ పెంపకాన్ని అనుమ తించండి ఉపాధి హామీ పథకం కింద విశాఖ జిల్లా పాడేరులో కాఫీ తోటల పెంపకాన్ని గిరిజనులు చేపట్టేందుకు అనుమతించాలని కూడా విజయసాయిరెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. వారికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు. -
అదనపు రుణ వినియోగంపై ఆంక్షలు లేవు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు లేవని కేంద్రం తెలిపింది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్రక సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి ఎటువంటి నిబంధనలు లేవు. 1 శాతంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఒక్కో సంస్కరణ(వన్ కార్డ్, వన్ నేషన్, స్థానిక సంస్థల బలోపేతం, విద్యుత్ రంగం వంటివి)కు 0.25 శాతం చొప్పున అదనంగా వినియోగించుకోవచ్చు. కేంద్రం సూచించిన ఏవైనా మూడు సంస్కరణలు అమలు చేస్తే మిగతా 0.50 శాతం రుణం అదనంగా వాడుకోవచ్చు’అని ఆ అధికారి వివరించారు. అదేవిధంగా, కేంద్ర పన్నుల్లో ఏప్రిల్, మే నెలలకు గాను రాష్ట్రాల వాటా కింద రూ.92,077 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఆసరాగా ఉండేందుకు 2020–21 బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఈ మొత్తం విడుదల చేశామని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
అప్పుల కోసం చంద్రజాలం
సాక్షి, అమరావతి: లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు కనికట్టు చేశారు. ఇదే కనికట్టుతో భారీ ఎత్తున అప్పులు చేశారు. చేసిన అప్పులతో ఆస్తులు ఏమైనా సమకూర్చారా? అంటే అదీ లేదు. కమీషన్ల రూపంలో భారీగా కాజేశారు. ఇదీ నాలుగేళ్ల పది నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం. ఉమ్మడి రాష్ట్రంలో అంటే 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) 2013–14 నాటికి రూ.8,55,935 కోట్లు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 2019–20 నాటికి రూ.10,67,990 కోట్లకు చేరుకుందని చంద్రబాబు సర్కార్ లెక్కలు వేసింది. ఇవే లెక్కలను చూపించి 2018–19 నాటికే రూ.2.58 లక్షల కోట్ల అప్పులు చేసింది. గత ఐదేళ్లలో ఏటా పది శాతం వృద్ధి రేటు సాధించినట్లు చంద్రబాబు పదేపదే చెబుతూ వచ్చారు. ఆ లెక్కన చూసుకున్నా జీఎస్డీపీ వృద్ధి రేటు ఐదేళ్లలో 50 శాతానికి మించకూడదు. కానీ, 2013–14లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీతో పోల్చితే 2019–20 నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 124.79 శాతం అధికంగా ఉన్నట్లు చెప్పడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. కేవలం భారీ ఎత్తున అప్పులు తేవడం కోసమే లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపి చంద్రబాబు మాయ చేశారని స్పష్టమవుతోంది. అన్నింటా అదే కథ రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి 2013–14లో 8,55,935 కోట్లు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపుతూ వచ్చింది. దేశంలో డబుల్ డిజిట్ వృద్ధిరేటు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ఊదరగొట్టింది. వాస్తవానికి వ్యవసాయ వృద్ధి తిరోగమనంలోనే కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయంతో సంబంధం లేని చేపలు, మాంసం ఉత్పత్తులు భారీగా పెరిగినట్లు అంచనాలు వేస్తూ దాన్ని వ్యవసాయంలో కలిపేసి వృద్ధిరేటు అమోఘం అంటూ కనికట్టు చేసింది. పరిశ్రమల నుంచి సేవల రంగం వరకూ వృద్ధి రేటులో ఇదే కథ. అప్పులతో రాష్ట్రానికి ఒరిగిందేమిటి? రాష్ట్ర విభజన మరుసటి ఏడాదే అంటే 2014–15లో జీఎస్డీపీ రూ.5,26,470 కోట్లకు.. 2015–16లో రూ.6,09,934 కోట్లకు.. 2016–17లో రూ.6,99,307 కోట్లకు, 2017–18లో రూ.8,03,873 కోట్లు, 2018–19లో 9,18,964 కోట్లు.. 2019–20 నాటికి కేవలం 13 జిల్లాల రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏకంగా రూ.10,67,990 కోట్లకు చేరినట్లు బాబు సర్కారు మాయ చేసింది. ఇలా లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపి 2018–19 నాటికే రూ.2.58 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. 2019–20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపిస్తూ, దాని ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.32,000 కోట్ల అప్పులు చేయాలని చంద్రబాబు భావించారు. ఇప్పటివరకూ చేసిన అప్పులతో టీడీపీ ప్రభుత్వ పెద్దల జేబులు నిండడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రుణపరిమితి పెంచండి
సాక్షి, హైదరాబాద్ : స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3% మించి రుణాలు స్వీకరించేందుకు ఆర్థికాభివృద్ధి ఉన్న రాష్ట్రాలను అనుమతించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని సీఎం కేసీఆర్ 15వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఇది ఎంతో సహకరిస్తుందన్నారు. జీఎస్డీపీపై అదనంగా మరొకశాతం అప్పు పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ బృందంతో.. సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృందానికి కేసీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు. వివిధ అంశాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న పురోగతికి గుర్తింపుగా ప్రోత్సాహకాలను సిఫారసు చేయాలన్నారు. కేంద్ర పథకాలకే పరిమితం చేయకుండా రాష్ట్రాల కీలక పథకాలకు ఈ ప్రోత్సాహకాలను వర్తింపజేయాలన్నారు. రైతుబంధు, మధ్యాహ్న భోజనం, ఉపాధిహామీ వంటి పథకాలను తొలుత రాష్ట్రాలే అమలు చేయగా, కేంద్రం అనుసరించక తప్పలేదని, ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. ప్రాధాన్య, అప్రాధాన్యత అంశాలను కేంద్రం కన్నా రాష్ట్రాలే బాగా గుర్తించగలవన్నారు. పన్నుల క్రమబద్ధీకరణలో భాగంగా రాష్ట్రాలు తమ స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడి జీఎస్టీకి సంపూర్ణ మద్దతునిచ్చాయని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయానికి ఆధారమైన వాణిజ్య పన్ను/వ్యాట్ జీఎస్టీలో అంతర్భాగమైందన్నారు. కేంద్రం ఆదాయ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీలను జీఎస్టీలో విలీనం చేయలేదన్నారు. 50% పైగా రాష్ట్రాలకు సొంత ఆదాయం తెచ్చే పన్నులు జీఎస్టీ పరిధిలోకి రాగా కేవలం 31% కేంద్ర పన్నులు మాత్రమే ఏకీకృత పన్ను జాబితాలో చేరాయన్నారు. దీంతో రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోయాయన్నారు. (రాష్ట్రాభివృద్ధిలో ఐటీ పాత్ర భేష్) దేశమంతా తెలం‘గానం’ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్లు నిధుల వ్యయ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయగల పరిపక్వతను రాష్ట్రాలు సాధించాయని, ఈ విషయంలో కేంద్రం కంటే రాష్ట్రాలే ఆర్థిక దూరదృష్టితో వ్యవహరించగలవని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనాల గురించి మాత్రమే చర్చ జరిగేదని, ఇప్పుడే దేశమంతా తెలంగాణ అభివృద్ధి నమూనా గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాలకు సమ భాగస్వామ్యం లభించనుందని నీతి ఆయోగ్ ఏర్పాటుతో ఆశలు చిగురించాయని, కానీ ఈ ఆశలు ఫలించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు అధిక నిధుల కేటాయింపునకు తాము వ్యతిరేకం కామన్నారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ కాకుండా ఇతర మార్గాల్లో సహకారం అందించాలన్నారు. రాష్ట్రాలకు పన్నుల ఆదాయం పంపిణీ పెంచాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల వల్ల దేశ అభివృద్ధి ఎజెండా ముందుకు సాగిందని గుర్తు చేశారు. బకాయిలు ఇవ్వాలి తెలంగాణ ఏర్పడిన కొత్తలో తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. తీవ్ర విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలతోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు దేశ సగటుకు దిగువన ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని, బంగారు తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2002–05, 2005–11 మధ్య కాలంలో రాష్ట్రం పరిధిలోని అంశాలపై కేంద్ర నిధుల వ్యయం 14–20%కు పెరిగిందని, అలాగే ఉమ్మడి జాబితాలోని అంశాలపై 13–17%కు చేరిందని 14వ ఆర్థిక సంఘం నివేదించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులు పెంచేందుకు పుష్కలమైన అవకాశాలున్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోందన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రాలకు రావాల్సిన రోడ్డు సెస్, క్లీన్ ఎనర్జీ సెస్ పూర్తి స్థాయిలో రావడం లేదని, కాగ్ తప్పుబట్టినా కేంద్రం బకాయిలు చెల్లించడం లేదని సీఎం వెల్లడించారు. 2017–18 చివరినాటికి కేంద్ర రాష్ట్రాలకు రూ.72,726 కోట్ల రోడ్ సెస్, రూ.44,505 కోట్ల క్లీన్ ఎనర్జీ సెస్‌ను బకాయి పడిందన్నారు. ప్రాధామ్యాలు నిర్ణయించే హక్కు రాష్ట్రాలకే రాష్ట్రాల్లోని పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రాధామ్యాలు నిర్ణయించుకునేందుకు అవకాశాలు కల్పిస్తే బావుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల్లోనూ లెక్కకు మించి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉండడాన్ని ఆయన ఉదహరించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన సర్కారియా కమిషన్ చర్చల సందర్భంగా కూడా ఉమ్మడి జాబితా రద్దు చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయని గుర్తు చేశారు. కేంద్ర–రాష్ట్ర ఉమ్మడి జాబితాలో చేర్చిన క్రిమినల్లా, అటవీ, దివాళా, కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమం, లీగల్, మెడికల్, విద్య, విద్యుత్ వంటి అంశాలపై ఎక్కువగా పార్లమెంటే చట్టాలు చేస్తోందన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం కొత్త పథకాలు అమలు చేస్తోందని, రాష్ట్రాల్లో అంతకంటే మంచి పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నదీజలాల హక్కుల నిర్ధారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరి ఏళ్లు గడుస్తున్నా.. ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు నివేదించలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయొచ్చునని మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తమ ప్రభుత్వం చేసి చూపించిందని కేసీఆర్ అన్నారు. రాబోయే ఐదారేళ్లలో దేశంలోని ప్రతీ గ్రామానికి నీటిసరఫరా చేసే లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రూ.8–10లక్షల కోట్ల వ్యయం కావొచ్చన్నారు. ప్రతీఏడాది ఎమ్మెస్పీ పెంచాలి కనీస మద్దతు ధరను రూ.500 లేదా ప్రస్తుతమున్న ఎమ్మెస్పీకి మూడోవంతు పెంచడమో చేయాలని కేసీఆర్ సూచించారు. ఉద్యోగుల డీఏలో మాదిరిగా ధరల సూచీకి లింక్ చేయడం ద్వారా ఎమ్మెస్పీని ప్రతీఏడాది పెంచాలని కోరారు. వ్యవసాయరంగంలో లాభాలు, ఉత్పాదకత తక్కువగా ఉన్నందున రైతులు–వినియోగదారుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10వేలు రైతులకు చెల్లించడం అనేది ఈ దిశగా ఒక ముందడుగు అని చెప్పారు. నీటిరంగంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న పలు విభేదాలను సంప్రదింపులతో అధిగమించగలిగామని, కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు ఒక సజీవసాక్ష్యమని కేసీఆర్ చెప్పారు. సీఎం పేర్కొన్న మరిన్ని అంశాలు – కేంద్రపన్నులో రాష్ట్రాల వాటా పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. జీఎస్టీ విధానం అమలు వల్ల రాష్ట్రాల సొంత ఆదాయాల్లో కోత పడిందన్నారు. అందువల్ల జీఎస్టీలో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని కోరారు. – ఎఫ్ఆర్బీఎంను ఇప్పుడు ఉన్నదానికంటే 1% పెంచాలని, సమానత్వం, సమర్థత విషయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యయానికి బదులు రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలు ఇవ్వాలని కోరారు. – రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 8,368 నుంచి 12,751కు, పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 74 నుంచి 142కు పెంచామని, వాటి అవరాలకు తగ్గట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని కోరారు. – రాష్ట్రంలోని 1.24కోట్ల ఎకరాలకు నీటిపారుదల సదుపాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని పలు ప్రాజెక్టులు చేపట్టాం. రూ.80 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో 13 జిల్లాల పరిధిలో 18లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. 15వ ఆర్థికసంఘం కాల పరిమితిలో ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.40,169 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని సిఫారసు చేయాలి. – ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం నిర్వహణ కోసం 2020–25 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలకు రూ.10,142 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.2,850 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.12,722 కోట్ల నిర్వహణ వ్యయాన్ని సైతం 15వ ఆర్థిక సంఘం కింద సిఫారసు చేయాలి. ఈ పథకం కింద వినియోగదారులపై యూజర్ చార్జీలు విధించాలని అనుకుంటున్నాం. కానీ కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో కమిషన్ సహకారం అందించాలి. -
తయారీ, సేవల రంగంపై దృష్టి పెడతా
సాక్షి, అమరావతి : గడిచిన నాలుగేళ్ల పారిశ్రామిక వృద్ధి రేటులో వ్యవసాయం.. దాని అనుబంధ రంగాలు కీలకపాత్ర పోషించాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దేశ సగటుతో పోలిస్తే తయారీ రంగం, సేవల రంగంలో వెనుకబడి ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం ఆదుకోవడంతో పారిశ్రామిక వృద్ధిరేటులో దేశ సగటు కంటే ముందంజలో నిలిచినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ప్రజావేదికలో పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్పై సోమవారం ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్డీపీలో 34.34 శాతం వ్యవసాయ రంగం నుంచి వస్తుంటే, తయారీ, సేవల రంగాల నుంచి తక్కువ ఉందన్నారు. గడిచిన నాలుగేళ్లలో దేశ సగటు వృద్ధిరేటు 7.10 శాతంగా ఉంటే రాష్ట్రంలో 9.5 శాతంగా ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో భారీ వృద్ధి రేటు నమోదు కావడమేనన్నారు. నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో దేశ సగటు వృద్ధిరేటు రెండు శాతంలోపు ఉంటే అది మన రాష్ట్రంలో 10.5 శాతంగా ఉందని, ఇదే సమయంలో దేశ తయారీ రంగ వృద్ధిరేటు 8.43 శాతంగా ఉంటే రాష్ట్రంలో 14.35 శాతంగా నమోదయ్యిందన్నారు. ఇక రానున్న కాలంలో తయారీ, సేవా రంగాలపై అధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరగాలంటే వీరు తయారీ, సేవల రంగాల వైపు మారాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఐటీ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, నిర్మాణ, పర్యాటక రంగాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. నన్ను చూసే పెట్టుబడులు వస్తున్నాయి కేంద్రం చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్టును అమలుచేయకపోవడంతో తామే సొంతంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని, దుగరాజపట్నం బదులు రామాయపట్నంలో ఓడరేవులను, కాకినాడలో ప్రైవేటు సంస్థ హల్దియాతో పెట్రో కెమికల్ ఫ్యాక్టరినీ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. కాగా, పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుల ద్వారా మొత్తం 2,622 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.10.48 లక్షల పెట్టుబడులు, 32.33 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ఒప్పందాల్లో ఇప్పటివరకు 810 అమల్లోకి వచ్చాయని వీటివల్ల 2.51 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు. పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరిగానని, దీనికి నా వ్యక్తిగత క్రెడిబిలిటీ తోడుకావడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారన్నారు. కొత్త సంవత్సరంలో కుప్పం, దగదర్తి ఎయిర్‌పోర్టులకు, రామాయపట్నం ఓడరేవు, అక్కడ సమీపంలోనే కాగిత పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయన్నుట్లు తెలిపారు. అలాగే, కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో విమనాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేశారు. తలాక్ బిల్లుకు వ్యతిరేకం తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీనికోసం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడి పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ బిల్లును రాజ్యసభలో తీవ్రంగా వ్యతిరేకించాలని చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. ఈ విషయమై తాను ఇప్పటికే రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీతో మాట్లాడానని, విపక్ష పార్టీలన్నింటితో కలిసి సమన్వయంతో పనిచేయాలని వారికి చెప్పారు. మరోవైపు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసీఆర్‌తో రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ ప్రధానికి లేఖ రాయించి తీసుకువస్తే స్వాగతిస్తామన్నారు. -
ఆదాయం, వృద్ధిలో తెలంగాణ దూకుడు-మంత్రి
సాక్షి, హైదరాబాద్: దేశ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయ వృద్ధి (జీఎస్డీపీ) రేటు 10.5 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అమలు చేసిన అభివృద్ధి పనులతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం పుంజుకుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయం (2014–15)లో 6.8 శాతమున్న జీఎస్డీపీ వృద్ధి రేటు సుస్థిరంగా పెరుగుతూ వస్తోందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డిలతో కలసి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘వస్తూత్పత్తులు, తయారీ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతికూలతను చవిచూసిన జీఎస్డీపీ ఆదాయం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. 2012–13లో మైనస్‌లో (–15.4) ఉన్న వృద్ధి రేటు 2015–16 నాటికి 9.8కు చేరింది. తలసరి ఆదాయం కూడా జాతీయ సగటుతో పోలిస్తే రూ.52 వేలకుపైగా ఎక్కువగా నమోదైంది. 2016–17లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,03,219 కాగా తెలంగాణలో రూ.1,55,612. రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం సుస్థిరంగా పెరిగింది. 2016–17లో 21.1% ఉండగా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక కూడా 17 నుంచి 18 శాతం వృద్ధి ఉంది. తెలంగాణ వృద్ధి దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. పరిశ్రమలకు, సాగుకు నిరంతర విద్యుత్, నూతన పారిశ్రామిక విధానం, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందుండటం తదితరాలు ఆదాయ వృద్ధికి, వృద్ధి రేటుకు అండగా నిలిచాయి. 2017–18లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణదే అగ్రస్థానం’’అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో ఇదే వేగం, ఇదే ప్రగతి కొనసాగుతాయని మంత్రి ధీమా వెలిబుచ్చారు. 2018–19 బడ్జెట్ రూపకల్పనపై శాఖలవారీ కసరత్తు పూర్తయిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా సీఎం సమక్షంలో తుది మెరుగులు దిద్దుతామని చెప్పారు. గతేడాది ప్రవేశపెట్టిన రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌కు తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాధాన్యంగా ఎంచుకున్న మిషన్ భగీరథ, సాగుకు 24 గంటల విద్యుత్తు తదితరాలపై భారీగా నిధులు వెచ్చించామన్నారు. కేంద్రం ఈ బడ్జెట్లోనైనా తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు , మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లివ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయించాలని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలసి కోరాం. గిరిజన, హార్టి వర్సిటీలకు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌కు తగినన్ని నిధులు కేటాయించాలి’’అని కోరారు.