సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత సర్కారు హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలోనే ఆదాయం పెరగడంతోపాటు అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. టీడీపీ హయాం కంటే ఇప్పుడే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా నమోదైందని, గత ప్రభుత్వంతో పోల్చితే అప్పులు కూడా ఇప్పుడే తక్కువని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమానికి గత సర్కారు కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేసిందని గణాంకాలతో సహా బహిర్గతం చేశారు. మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
అప్పులు, ఆదాయం, వృద్ధిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖలు ద్వారా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఒకసారి రూ.పది లక్షల కోట్లు మరోసారి రూ.11 లక్షల కోట్లు, ఇంకోసారి రూ.నాలుగున్నర లక్షల కోట్లు అంటూ యనమల తన లేఖల్లోనే పరస్పర విరుద్ధ గణాంకాలను పేర్కొనటాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి లాంటి వారు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేయడంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐకి కూడా ఇదే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆమె కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర ఆర్ధిక శాఖ, కాగ్, ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలే వాస్తవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
అప్పులు, రాష్ట్ర ఆదాయం, స్థూల ఉత్పత్తిపై తాను చెబుతున్న లెక్కల్లో తప్పులుంటే చెప్పాలని యనమలకు సవాల్ విసిరారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి రూ.250 కోట్లకు లెక్కలు కనిపించడం లేదని బుగ్గన వెల్లడించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రూ.370 కోట్లకు నామినేషన్‌పై డిజైన్ టెక్‌కు ఇచ్చారని, ఈ స్కామ్ 2017లోనే జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ డీజీ విచారణలో వెలుగులోకి వచ్చిందన్నారు. సెబీ, ఈడీ కూడా దీనిపై విచారణ
చేశాయన్నారు.
ఎవరి హయాంలో అప్పులు ఎలా?
2018–19 నాటికి (టీడీపీ హయాంలో) రూ.2,57,210 లక్షల కోట్లు
2021–22 నాటికి (వైఎస్సార్‌సీపీ హయాంలో) రూ.3,93,718 లక్షల కోట్లు
మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ హయాంలో పెరిగిన అప్పులు రూ.1,36,500 కోట్లు
సగటున ఏడాదికి రూ.45,500 కోట్లు అప్పులు
♦ టీడీపీ హయాంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.33,032 కోట్లు వ్యయం
♦ వైఎస్సార్‌సీపీ పాలనలో ఎస్సీల సంక్షేమానికి రూ.74,249 కోట్లు వ్యయం.
♦ టీడీపీ హయాంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.11,400 కోట్లు వ్యయం
♦ వైఎస్సార్ సీపీ పాలనలో ఎస్టీల సంక్షేమానికి రూ.25,323 కోట్లు వ్యయం
♦ టీడీపీ హయాంలో బీసీ సంక్షేమానికి రూ.30,970 కోట్లు వ్యయం
♦ వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లలో బీసీ సంక్షేమానికి చేసిన వ్యయం రూ.1,12,960 కోట్లు
♦ మైనారిటీలకు టీడీపీ హయాంలో వ్యయం సున్నా
♦ వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం రూ.11,157 కోట్లు
♦ చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు డిస్కమ్‌లకు చెల్లింపు రూ.20,165 కోట్లు
♦ వైఎస్సార్‌సీపీ పాలనలో నాలుగేళ్లలో రూ.57,417 కోట్లు చెల్లింపు
టీడీపీ హయాంలో గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పుల పెరుగుదల ఇలా
♦ 2014 నాటికి గ్యారెంటీ అప్పులు రూ,13,247 కోట్లు
♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.57,687 కోట్లు
♦ 2014 నాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.22,000 కోట్లు
♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.66,664 కోట్లు
వైఎస్సార్‌సీపీ వచ్చాక నాలుగేళ్లలోగ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు
♦ వైఎస్సార్ సీపీ హయాంలో గ్యారెంటీ అప్పులు రూ.1,18,000 కోట్లు
♦ నాన్ గ్యారెంటీ అప్పులు రూ.83,000 కోట్లు
బాబు హయాంలో ఓవర్ డ్రాప్ట్ 2018–19లో 74.3 శాతం వినియోగం
♦ వైఎస్సార్‌సీపీ పాలనలో అనుమతించిన రోజుల్లో 2019–20లో 39.5 శాతం వినియోగం
♦ 2020–21లో అనుమతించిన రోజుల్లో 51.5 శాతమే ఓవర్ డ్రాప్ట్ వినియోగం
♦ 2014–15లో ద్రవ్యలోటు మూడు శాతానికి అనుమతిస్తే 3.95 శాతానికి చేరింది
♦ 2018–19లో మూడు శాతానికే అనుమతి ఉంటే 4.06 శాతానికి చేరింది.
♦ ఇప్పుడు 2021–22లో 4.5 శాతానికి అనుమతి ఉంటే ద్రవ్యలోటు కేవలం 2.01 శాతమే ఉంది.
♦ టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రూ.1,62,828 కోట్లను అసెంబ్లీ అనుమతి లేకుండా అధికంగా వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది.
టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా
♦ 2014 నాటికి అప్పు రూ.1,34,600 లక్షల కోట్లు
♦ 2019 మే నాటికి మొత్తం అప్పు రూ,3,28,700 లక్షల కోట్లు.. అంటే అప్పుల పెరుగుదల 19.55 శాతం
వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా
♦ 2022–23 నాటికి మొత్తం అప్పు రూ.4,99,895 లక్షల కోట్లు. అంటే అప్పు పెరుగుదల శాతం 15.46 శాతమే
♦ టీడీపీ హయాంలో ఐదేళ్లలో మూలధన వ్యయం రూ.76,139 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.15,227 కోట్లే
♦ వైఎస్సార్‌సీపీ హయాంలో మూడేళ్లలో మూల ధన వ్యయం రూ.55,086 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.18,362 కోట్లు
♦ టీడీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) పెరుగుదల రూ34,73,477 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.6,95,695 లక్షల కోట్లు
♦ వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) పెరుగుదల రూ.43,34,192 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.10,83,548 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment