
సుజనా చౌదరితో ఏపీ డీజీపీ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రపద్రేశ్ డీజీపీ జేవీ రాముడు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో భేటీ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు ఏపీ డీజీపీ జేవీ రాముడుతో పాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం జే వీ రాముడు కేంద్ర మంత్రిని కలిశారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి ప్రమేయం ఉన్నట్టు వార్తలు రావడం, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీజీపీ.. సుజనా చౌదరిని కలవడం ప్రాధాన్యం ఏర్పడింది.