
ఏపీ నూతన డీజీపీ గౌతం సవాంగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను గురువారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వర రావును కూడా బదిలీ చేసింది. వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్‌గా కుమార్ విశ్వజిత్‌ను నియమించింది. అలాగే మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment