రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, రాజకీయ పార్టీలకు చెందిన భారీ కాన్వాయ్‌లను కూడా అనుమతించబోమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16 ప్రాంతాల్లోని 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. అందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.