వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాద రావు
శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యాఖ్యలు టీడీపీ మాటల్లా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ..విచారణ పూర్తి కాకుండానే పబ్లిసిటీ కోసం చేసిన ఘటన అని డీజీపీ ముందస్తుగానే తేల్చి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఇంటరాగేషన్‌లో భిన్నమైన వాస్తవం గుర్తించినా దిగువస్థాయి పోలీసు అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
- వైఎస్ జగన్ మోహన రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు తీశాయి. శ్రీకాకుళంలో ఏడు రోడ్ల జంక్షన్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
- పాలకొండలో కోటదుర్గ గుడి నుంచి వైఎస్‌ఆర్ జంక్షన్ వరకు ఎమ్మెల్యే వి.కళావతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
- పాతపట్నం వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్లో కొవ్వొత్తులతో మానవహారం, నిరసన ప్రదర్శన చేపట్టారు.
- రణస్థలంలో జాతీయ రహదారిపై ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు.
- టెక్కలిలో వైఎస్‌ఆర్ జంక్షన్ వద్ద పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.
- ఆమదాలవలసలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
-నరసన్నపేటలో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో, కాశీబుగ్గ బస్టాండ్ వద్ద పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో, కవిటిలో రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment