
ధర్మాన, తిలక్‌ల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
కోటబొమ్మాళి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి డబ్బుతో అధికారం కొనుగోలు చేసేందుకు అడ్డదారులు తొక్కుతారని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. గురువారం కోటబొమ్మాళి మండలం కొత్తపేట రెడ్డి కల్యాణ మండపంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్.హేమసుందరరాజు అధ్యక్షత బూత్ కమిటీల శిక్షణ శిబిరం నిర్వహించారు.
రాబోయే ఎన్నికల్లో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై ధర్మాన దిశానిర్దేశం చేశారు. అనంతరం పాకివలస, పట్టుపురం, పొన్నానపేట, కురుడు, పెదబమ్మిడి తదితర గ్రామాల నుంచి సుమారు 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
సమావేశంలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, నందిగాం ఎంపీపీ ప్రతినిధి యర్ర చక్రవర్తి, బోయిన నాగేశ్వరరావు, కవిటి రామరాజు, పేడాడ వెంకటరావు, అన్నెపు రామారావు, నేతింటి నాగేష్, దుబ్బ వెంకటరావు, దుంగ శిమ్మన్న, కాళ్ళ సంజీవరావు, దుబ్బసింహాచలం, టి.లచ్చుమయ్య, దుక్క రామకృష్ణ, ఆర్.ముకుందరెడ్డి, కణితి నారాయణమూర్తి, చల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment